అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవం
అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవం | |
---|---|
జరుపుకొనే రోజు | డిసెంబరు 5 |
ఆవృత్తి | వార్షికం |
అనుకూలనం | ప్రతి సంవత్సరం ఇదేరోజు |
అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవం (వాలంటీర్స్ దినోత్సవం) ప్రతి సంవత్సరం డిసెంబరు 5వ తేదీన నిర్వహించబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా శాంతి, అభివృద్ధిలకు మద్దతుగా వాలంటీరిజాన్ని మెరుగుపరచడంతోపాటు...[1] కష్టాల్లో ఉన్నవారిని ఎలాంటి లాభాపేక్ష లేకుండా రక్షించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న వారందరి సేవను గుర్తించుకునేందుకు ఈ దినోత్సవం జరుపబడుతుంది.[2]
ప్రారంభం
ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 1985, డిసెంబర్ 17 తేదీన చేసిన 40/212 తీర్మానంలో ప్రతి సంవత్సరం డిసెంబరు 5వ తేదీన స్వచ్ఛంద దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించింది.[3] ఐక్యరాజ్య సమితి ఇందులో కీలకపాత్ర పోషిస్తుండగా, రెడ్‌క్రాస్, స్కౌట్స్ అండ్ గైడ్స్, వంటి అనేక ఎన్‌జిఒ సంస్థలు ఈ స్వచ్ఛంద సేవకు తమవంతు సహకారాన్ని అందిస్తున్నాయి.
దాదాపు 130 దేశాల్లో 86 ఫీల్డ్‌యూనిట్లతో ఐక్యరాజ్య సమితి వాలంటీర్ల సంఘం ఏర్పాటయింది. ఐక్యరాజ్య సమితి గుర్తించిన 7700 మంది వాలంటీర్లు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏం జరిగినా అక్కడికి వెళ్ళి సేవలను అందిస్తారు. అంతేకాకుండా 2000వ సంవత్సరం నుండి ఐక్యరాజ్య సమితి ఆన్‌లైన్ వాలంటీర్ల విభాగం కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ విభాగంలో ఫ్రెంచ్, స్పానిష్, ఇంగ్లీషు భాషల్లో ఆన్‌లైన్‌లో సేవలందించే వాలంటీర్లు పనిచేస్తారు.[4]
కార్యక్రమాలు
- ఐక్యరాజ్య సమితి 1997, నవంబరు 20వ తేదీన జరిపిన జనరల్ అసెంబ్లీలో ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ కు జపాన్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదన మేరకు 52/17 తీర్మానంతో 2001వ సంవత్సరం అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవంగా ప్రకటించబడింది.[5][6]
చిత్రమాలిక
-
2001 అంతర్జాతీయ స్వచ్చంద సంవత్సరం సదస్సులో కోఫి అన్నన్ ప్రసంగం
-
నేపాల్ లో 2017లో జరిగిన అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవం
మూలాలు
- ↑ "A/RES/40/212. International Volunteer Day for Economic and Social Development". www.un.org. Retrieved 5 December 2019.
- ↑ "About United Nation Volunteers".
- ↑ "A/RES/40/212. International Volunteer Day for Economic and Social Development". www.un.org. Retrieved 5 December 2019.
- ↑ ఆంధ్రభూమి, సబ్ ఫీచర్ (4 December 2016). "ఉద్యమంలా స్వచ్ఛంద సేవ". andhrabhoomi.net. కృష్ణతేజ. Archived from the original on 5 December 2019. Retrieved 5 December 2019.
- ↑ "UNGA Resolution 52/17: Declaration of 2001 as International Year of Volunteers | UNV". www.unv.org (in ఇంగ్లీష్). Retrieved 5 December 2019.
- ↑ "United Nations Official Document". www.un.org. Retrieved 5 December 2019.