అడవి జంతువుల అక్రమ రవాణా
చట్టవిరుద్ధంగా అడవిజంతువులని లేదా వృక్షాలను లేదా వీటి వివిధ ఉత్పత్తులను (చర్మం, ఆకులు, పూలు, గింజలు) సమీకరించడం, రవాణా చెయ్యడం, అమ్మకానికి ఉంచడాన్ని అడవిసంపద అక్రమ రవాణా గా పరిగణించబడుతుంది. ఇది చిన్న తరహా స్థాయిలో ఒక పల్లె నుండి మరే పల్లెకి కావచ్చు లేదా అంతర్జాతీయ స్థాయిలో దేశాల మధ్య కావచ్చు. ఇది అక్రమ వ్యాపారం కావటం వలన ఎంత విలువలో లావాదేవీలు జరుగుతాయన్నది నిర్ధారించలేము. 780 నుండి వెయ్యి కోట్ల డాలర్ల వరకూ ఈ అక్రమ వ్యాపారం సంపాదన ఉండవచ్చు అన్నది ఒక అంచనా. అక్రమంగా తరలించే కలప, చేపలకన్నా ఎక్కువగా మాదకద్రవ్యాలు, మనుషుల అక్రమ తరలింపుకు సమానంగా అడవిసంపద తరలింపు జరుగుతూంది.[1][2]
ఈ వ్యాపారంలో అత్యధికంగా గిరాకీ ఉన్నవి వివిధ రకాల పెంచుకునే జంతువులు, జంతువుల కొమ్ములు, దంతాలు, చర్మం, అస్థిపంజరం, లోపలి అవయవాలతో తయారయ్యే ఆహారం, ఔషధులు, వస్త్రాలు (బెల్టు, బూట్లు వగైరా), ఆభరణాలూను.ప్రపంచ వ్యాప్తంగా గిరాకీ పెరుగుతూనే ఉంది. అమెరికా, చైనా, యూరోప్ లో ఈ వ్యాపారం అత్యధిక స్థాయిలో ఉంది.
వివరణ
ప్రపంచవ్యాప్తంగా ఈ అక్రమ రవాణా మరింత పెరగటానికి కారణం పెరుగుతున్న డిమాండే. మాంసం; చీనా సాంప్రదాయ ఔషధాలు; పరదేసప్పెంపుడు జంతువులు; ఆభరణాలు; వెముకలు/దంతాలతో రూపొందించిన చెస్ ఆట; చర్మంతో తయారైన వస్త్రాలు షోకుదుస్తులు; ట్రోఫీలు.[3]
ఆఫ్రికాలోని ఎన్నో ప్రాంతాలలో వారి సంప్రదాయాన్ననుసరించి కోతి మాంసాన్ని తినటం ఒక ఆచారం, అది అక్కడి రుచికరమైన వంటకాలలో ఒకటి. ప్రోటీన్ సరఫరా కోసం కోతి మాంసం మీద ఆధార పడతారు అక్కడి ప్రజలు.సంవత్సరానికి దాదాపు 40 వేల కోతులను ఆఫ్రికాలోని ప్రజల మాంసం అవసరాలకు వేటాడుతున్నారన్నది సమాచారం. ఇంకా ఎక్కువగా ఈ మాంసాన్ని ఆఫ్రికా, ఐరోపా, అమెరికా దేశాల మార్కెట్లకు అక్రమంగా తరలిస్తున్నారు.
చీనా దేశపు సాంప్రదాయ చికిత్సా శాస్త్రం కోసం ఖడ్గమృగం కొమ్ములను, పెద్దపులి వెముకలను, ఇతర జంతువుల శరీర భాగాలను వినియోగిస్తారు. కొన్ని వేల కోట్ల మంది ఈ చికిత్సా పద్ధతిని పాటిస్తారు. ఉదాహరణకు, కొందరు పెద్దపులి వెముకలతో తయారైన ఒక ఖరీదైన ద్రవాన్ని వారి శారీరక బలాన్ని పెంపొందించడం కోసం, ఆర్త్రైటిస్ నుండి ఉపశమనం కోసం, రక్త ప్రసరణ మెరుగు పడడం కోసం తాగుతుంటారు.[4]
పెద్దపులి ఉత్పత్తులకు సంబంధించిన చట్టాల్లో లోపాల వలన ఈ అక్రమరవాణాకు ఆసరా దొరుకుతోంది. 1993లోనే చైనాలో పెద్దపులి వెముకల అమ్మకంపై నిర్బంధం ఉన్నప్పటికీ 2005లో కృత్రిమ వాతావరణంలో పెరిగిన పులుల వెముకలను అమ్మడం చట్టబద్ధం చేసారు. ఇందువలన కొనే వెముకలు చట్టబద్ధమా విరుద్ధమా అన్న అనుమానం కొనేవారిలో ఉంటుంది. ఏది ఏమైనా పులి వెముకలతో తయారైన మద్యం మాత్రం చైనాలో అమ్మడం నిషేధం. ఐనప్పటికీ 2011లో ఒక టీవీ చానల్ ప్రకటనలో ఈ మద్యం అమ్మకం గురించి వచ్చింది. చీనా చికిత్సా పద్ధతి అంతగా పని చేయ్కపోయినా ఆ సాకుతో జంతుబలి జరుగుతూనే ఉంది.[5]
ఇక పెంపుడు జంతువుల విషయానికొస్తే. ఆ ప్రాంతానికి చెందని జంతువులను పెంపుడు జంతువులుగా పెంచుకోవడం ప్రతిష్ఠనిస్తుందని కొందరు నమ్ముతారు. సినిమాలు, టీవీ ద్వారా కొన్ని జంతువుల పెంపకం ప్రచారాన్ని పొందుతూంది. చట్టబద్ధంగా ఈ జంతువులను తెచ్చుకోవడం ఖర్చుతో కూడుకున్న విషయం కాబట్టీ, ఎన్నో జంతువులు అక్రమంగా రవాణా చెయ్యబడుతున్నాయి. డ్రాగన్ జాతి బల్లులు, ఉడుములు, పక్షులు (పెద్ద రకం చిలుకలు, ఒక రకం గ్రద్ధలు), ఈ జంతువులలో ముఖ్యమైనవి. పెద్దపులులు కూడా పెంపుడు జంతువులుగా మంచి ప్రజాదరణలో ఉన్నాయి. ఒక అంచనా ప్రకారం అమెరికాలో 5,000 నుండి 7,000 పెద్దపులులు 2013లో పెంపుడు జంతువులుగా ఉన్నాయి. ఆ సంఖ్యతో పోల్చుకుంటే కేవలం 400 జంటుప్రదర్శన శాలల్లో, మరో 3,200 అడవుల్లో ఉన్నాయి. చేపలు, కోతులు, చింపాంజీలు, ఇతర జంతువులు కూడా అక్రమ రవాణాకు గురి అవుతున్నాయి.
ప్రభావం
ఆర్ధిక ప్రభావం
కొన్ని ఉగ్రవాద సంస్థలకు చెందిన సభ్యులు అక్రమ వనసంపద అక్రమరవాణా ద్వారా వచ్చే డబ్బుతో వారికి కావాల్సిన ఆయుధాలు కొనడానికి, వారి దురాగతాలను అమలు చేయడానికి వాడుకుంటున్నారు. ఈ వ్యాపారంలో కావాల్సిన పనివాళ్ళందరూ అక్రమంగా పని చేసే వారే. మాదకద్రవ్యాలపై జరిగే నిఘా, అదుపుదల ఈ అక్రమంపై జరగటం లేదు. ఈ వ్యాపారంలో అపరిమితంగా డబ్బు వస్తుంది. ఉదాహరణకి మాడగాస్కర్ లో లభ్యమయ్యే ఒక రకం తాబేలు (ఇవి ప్రపంచవ్యాప్తంగా 400 మాత్రమే ఉన్నాయి) ఒక్కటే 24 వేల అమెరికన్ డాలర్ల ధర పలుకుతుంది.
ఏనుగు దంతాలు కూడా అవి లభ్యమయే దేశాల్లో తక్కువ ధరకు, విదేశాల్లో విపరీతంగా ఎక్కువ ధరకు అమ్ముడౌతాయి. 2007 కన్నా ఈ ఏనుగు దంతపు వ్యాపారం 2014 కి రెట్టింపయింది. చైనా, అమెరిక మొదటి ద్వితీయ స్థానాలలో ఈ అక్రమ రవాణాకు గమ్యదేశాలుగా ఉన్నాయి.
ఏ దేశాల్లో ఈ అక్రమ రవాణా జరుగుతుందో ఆ దేశాల పర్యటన, అభివృద్ధి నష్టాల్లోకి పడిపోతాయి.
ఆరోగ్యం
జంతువుల ద్వారా ఒక చోటు నుండి మరో చోటికి చేరే రోగ కారకాలు మనుషులనూ జంతువులనూ రోగగ్రస్తులను చేస్తాయి. గమ్య స్థానపు దేశంలోని నిజవాస జంతువులకూ, వృక్షసంపదకూ హాని తలపెడతాయి. అమెరికాలోని ప్రభుత్వ అకౌంటెబిలిటీ అధికారుల ప్రకారం 75% రోగాలు జంతువుల ద్వారానే మనుషులకు ప్రబలుతున్నాయి. జంతువుల అక్రమ రవాణాకు ఈ రకమైన రోగాలు ప్రబలటానికి సంబంధం ఉందా లేదా అన్న విషయం చర్చనీయాంశమే ఐనప్పటికీ, ఎన్నో రోగాలు అకస్మాత్తుగా ప్రబలటానికి జంతువుల అక్రమ రవాణానే కారణమని నిర్ధారణ జరిగింది. జంతువుల అక్రమ రవాణా ద్వారా ప్రబలిన కొన్ని వ్యాధులు :
- సార్స్ (సీవియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రం - శ్వాసకోశ సంబంధ వ్యాధి) : చైనాలో సివెట్స్ (అడవి పిల్లులు) - మనుషుల మధ్య సంపర్కం ద్వారా ఈ వ్యాధి ప్రబలిందని అంచనా.
- బర్డ్ ఫ్లూ (హెచ్5ఎన్1) ఒక భయంకరమైన వైరస్. ఇది గ్రద్ధల ద్వారా మనుషులకి ప్రబలిందని నిపుణుల అంచనా. ఇది కొన్ని చోట్ల ఫారం కోళ్ళ ద్వారా కూడా వ్యాపించింది.
- మనీపాక్స్ అనే వ్యాధి ఆఫ్రికా జంతువుల్లో ఉంటుంది, ఇది అక్రమ రవాణా ద్వారా మనుషులకు వ్యాపించవచ్చు.
- హెర్పెస్ బీ వైరస్
ఇది మకాక్ కోతుల్లో ఉండే వైరస్. కోతులు గీరటం లేదా కరవటం ద్వారా వైరస్ మనుషుల్లో చేరి మెదడును సమూలంగా నాశనం చేసి మృత్యువుకు దారి తీస్తుంది.
- సాల్మొనెల్లా
ఈ వైరస్ ద్వారా డయేరియా, జ్వరం, కడుపులో నొప్పి కలుగవచ్చు. తాబేళ్ళు, డ్రాగన్ బల్లులు, ఇతర సరీసృపాల ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది.
ప్రకృతి
ప్రతి ఒక్క ప్రాణి ప్రకృతిలో తన వంతు పాత్ర పోషిస్తుంది. నీటి సైకిల్, ఆహారపు గొలుసులో ప్రతి జంతువుకూ స్థానముంది. ఇవి వేరే ప్రదేశాలకు తరలించబడినపుడు ఇక్కడా-అక్కడా రెండు చోట్లా ప్రకృతికి హాని చేకూరుతుంది.
బొమ్మలకొలువు
-
బెల్జియం కస్టంస్ అధికారులు జప్తు చేసుకున్న చిరుత చర్మంతో చేసిన సంచి. ఇది ఇప్పుడు మధ్యాఫ్రికా రాయల్ మ్యూజియంలో ఉంది.
-
1880-90 మధ్య తూర్పాఫ్రికాలో ఏనుగు దంతపు రవాణా
-
మయన్మార్ లో అక్రమంగా అమ్మకమవుతున్న పునుగుపిల్లి జాతి పిల్లి.
-
మయన్మార్ లో అక్రమంగా అమ్మకానికి ఉంచిన పాములు, సరీసృపాలు (ఆంటీటర్ ను చూడొచ్చు)
-
మయన్మార్ లో అక్రమంగా అమ్మకమవుతున్న పెద్దపులి గోర్లు, పంజా, వెముకలు
-
మయన్మార్ లో అక్రమంగా అమ్మకమవుతున్న రకరకాల జంతువుల దంతాలు, వెముకలు, ఈకలు.
-
ఇది కోతి జాతికి చెందినది. ఈ జంతువు కోతి జాతిలో ఉన్న ఏకైక విషపు జంతువు. దీని చేతి కింది భాగంలో విషం ఉంటుంది. ఆ విషాన్ని నోట్లోకి తీసుకొని కరవడం ద్వారా విషాన్ని శతృశరీరంలోకి పంపుతుంది. దీని పళ్ళను పీకేయడం ద్వారా అలా జరగకుండా ఆపుతారు అక్రమ రవాణా దారులు. అలా పళ్ళు పీకేసాక ఇన్ఫెక్షన్ కి ఈ జంతువు చనిపోవచ్చు కూడా.
-
పాములను అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నప్పటి దృశ్యం
-
ఎగిరే ఉడుత అక్రమ రవాణా చేస్తుండగా పట్టుకున్నారు. ఈ ఉడుత ఒక కన్నును కోల్పోయింది
-
రక రకాల సీతాకోకచిలుకలు, గబ్బిలాలు, పక్షులు ఇలా ఫ్రేముకట్టి గ్రీకుదేశంలో అమ్ముతారు.
ఇవి కూడా చూడండి
మూలాలు
- ↑ హేకెన్, జెరెమీ. "ట్రాన్స్‌నేషనల్ క్రైం ఇన్ ది డెవలపింగ్ వల్డ్ (అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అంతర్జాతీయ నేరం)" (PDF). గ్లోబల్ ఫినాన్షియల్ ఇంటెగ్రిటీ. గ్లోబల్ ఫినాన్షియల్ ఇంటెగ్రిటీ. Retrieved 2014-08-30.
- ↑ డాల్బర్గ్ గ్లోబల్ డెవలప్మెంట్ అడ్వైజర్స్; వల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్. "ఫైటింగ్ ఇల్లిసిట్ వైల్డ్‌లైఫ్ ట్రాఫికింగ్ : ఎ కన్సల్టేషన్ విత్ గవర్నమెంట్స్(అడవి జంతువుల అక్రమ రవాణాకు విరుద్ధంగా పోరాటం : ప్రభుత్వాలతో మంతనాలు)" (PDF). వల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్. వల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్. Archived from the original (PDF) on 2015-09-23. Retrieved August 30, 2014.
- ↑ ఖడ్గమృగం కొమ్మును అక్రమంగా రవాణా చేయడాన్ని నిరోధిస్తున్న జాలస్థలంలో ఒక కథనం
- ↑ చైనాలో పులి వెముకల నుండి మద్యం తయారు చేయడం గురించి కథనం
- ↑ చైనాలో పులి వెముకల మద్యం అమ్మకంపై కథనం