అమీబా

అమీబా
Scientific classification
Phylum:
Subphylum:
Class:
Order:
Tubulinida
Family:
Genus:
Amoeba

Bery de St. Vincent 1822

అమీబా (ఆంగ్లం : Amoeba) ఒక ఏకకణ జీవి. ఇవి మిధ్యాపాదం (Pseudopodia) ద్వారా కదులుతాయి. ఆంగ్లంలో "అమీబా" ఏకవచనమైతే, "అమీబే" బహువచనం.

చరిత్ర

అమీబాను మొదటి సారిగా ఆగస్టు జొహాన్ రొసెల్ వోన్ రొసెన్‌హాఫ్ 1757 లో కనుగొన్నాడు.[1] పాతతరం ప్రకృతివాదులు అమీబాను "ప్రొటియస్ ఎనిమల్ క్యూల్" అని సంబోధించేవారు. గ్రీకుల దేవత "ప్రొటియస్" తన రూపాన్ని అనేకరకాలుగా మార్చుకునేవాడని, అతని పేరుమీద ఈ జీవికి ఆ పేరు పెట్టారు. ఆ తరువాత Bory de Saint-Vincent ఈ జీవికి "అమీబా" అను పేరు పెట్టాడు,[2] గ్రీకు భాషలో అమీబా (amoibè (αμοιβή) ), అనగా "మార్పు".[3]

అమీబా శరీర నిర్మాణం.

వ్యాధికారక అమీబా

అమీబాలో కొన్ని జాతులు ఇతర జీవులలో వ్యాధులను కలుగజేస్తాయి:

  • ఎంటమిబా హిస్టాలిటికా (Entamoeba histolytica) వలన అమీబియాసిస్ (Amoebiasis), లేదా అమీబిక్ డిసెంటిరీ (Amoebic dystentery) వస్తుంది.
  • నీగ్లేరియా ఫౌలెరీ (Naegleria fowleri) ("brain-eating amoeba") మంచి నీటిలో జీవించే ఈ అమీబా ముక్కు ద్వారా ప్రవేశించి, --183.82.8.198 05:18, 2014 నవంబరు 4 (UTC) ప్రాణాంతకమైన మెదడువాపు వ్యాధి కలిగిస్తుంది.
  • ఎకాంథమీబా (Acanthamoeba) వలన అమీబిక్ కెరటైటిస్ (Amoebic keratitis) అనే కంటి వ్యాధి వస్తుంది.

వ్యాధులు

మూలాలు

  1. Leidy, Joseph (1878). "Amoeba proteus". The American Naturalist. 12 (4): 235–238. doi:10.1086/272082. Retrieved 2007-06-20.
  2. Audouin, Jean-Victor (1826). Dictionnaire classique d'histoire naturelle. Rey et Gravier. p. 5.
  3. McGrath K, Blachford S, eds. (2001). Gale Encyclopedia of Science Vol. 1: Aardvark-Catalyst (2nd ed.). Gale Group. ISBN 078764370X. OCLC 46337140.

బయటి లింకులు