అర్థ్

అర్థ్
అర్థ్ సినిమా పోస్టర్
దర్శకత్వంమహేష్ భట్
రచనమహేష్ భట్
స్క్రీన్ ప్లేమహేష్ భట్
సుజిత్ సేన్
కథమహేష్ భట్
నిర్మాతకుల్జిత్ పాల్
తారాగణంషబానా అజ్మీ
కుల్ భూషణ్ ఖర్బందా
స్మితా పాటిల్
రాజ్ కిరణ్
రోహిణీ హట్టంగడి
ఛాయాగ్రహణంప్రవీణ్ భట్
కూర్పుకేశవ్ హిరణి
సంగీతంజగ్జీత్ సింగ్
చిత్ర సింగ్
విడుదల తేదీ
1982
సినిమా నిడివి
138 నిముషాలు
దేశంభారతదేశం
భాషహిందీ
బడ్జెట్₹1 కోటి
బాక్సాఫీసు₹2 కోట్లు

అర్థ్, 1982లో విడుదలైన హిందీ సినిమా. మహేష్ భట్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో షబానా అజ్మీ, కుల్ భూషణ్ ఖర్బందా, స్మితా పాటిల్, రాజ్ కిరణ్, రోహిణీ హట్టంగడి తదితరులు నటించారు.[1] గజల్ ద్వయం, జగ్జీత్ సింగ్ - చిత్ర సింగ్ సంగీతాన్ని సమకూర్చారు.

పర్వీన్ బాబితో తన సంబంధం గురించి మహేష్ భట్ రాసిన సెమీ ఆటోబయోగ్రాఫికల్ సినిమా ఇది.[2] ఇండియా టైమ్స్ మూవీస్ సంకలనం చేసిన 25 తప్పక చూడాల్సిన బాలీవుడ్ సినిమాలలో ఈ సినిమా కూడా ఒకటి.[3] ఈ సినిమాను బాలు మహేంద్ర 1993లో మరుపాదియుమ్ పేరుతో తమిళంలో రీమేక్ చేశాడు. 2017లో పాకిస్తానీ నటుడు, దర్శకుడు షాన్ షాహిద్ అర్థ్ 2 సినిమాను విడుదల చేసాడు.

నటవర్గం

బాక్సాఫీస్

1 కోటి రూపాయలతో రూపొందిన ఈ సినిమా 2 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద "హిట్"గా ప్రకటించబడింది.

అవార్డులు

సంవత్సరం అవార్డు విభాగం గ్రహీత (లు), నామినీ (లు) ఫలితం
1982 భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు జాతీయ ఉత్తమ నటి షబానా అజ్మీ గెలుపు
1983 బి.ఎఫ్.జె.ఏ. అవార్డులు ఉత్తమ కళా దర్శకుడు మధుకర్ షిండే గెలుపు
1984 ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు ఉత్తమ నటి షబానా అజ్మీ గెలుపు
ఉత్తమ సహాయ నటి రోహిణి హట్టంగడి గెలుపు
స్మితా పాటిల్ ప్రతిపాదన
ఉత్తమ చిత్రం కుల్జిత్ పాల్ ప్రతిపాదన
ఉత్తమ దర్శకుడు మహేష్ భట్ ప్రతిపాదన
ఉత్తమ సంభాషణలు గెలుపు
ఉత్తమ కథ గెలుపు

మూలాలు

  1. "Arth (1982)". Indiancine.ma. Retrieved 2021-08-04.
  2. "A tribute to Parveen Babi". 4 October 2011. Archived from the original on 4 October 2011.
  3. "25 Must See Bollywood Movies". Indiatimes Movies. 15 October 2007. Archived from the original on 15 October 2007.

బయటి లింకులు