అర్ధ్ సత్య
అర్ధ్ సత్య | |
---|---|
దర్శకత్వం | గోవింద్ నిహలానీ |
రచన | వసంత్ దేవ్(మాటలు) |
స్క్రీన్ ప్లే | విజయ్ టెండూల్కర్ |
కథ | ఎస్‌డి పన్వాల్కర్ |
దీనిపై ఆధారితం | ఎస్‌డి పన్వాల్కర్ రాసిన సూర్య అనే కథ ఆధారంగా |
నిర్మాత | మన్మోహన్ శెట్టి ప్రదీప్ ఉప్పూర్ |
తారాగణం | ఓంపురి స్మితా పాటిల్ అమ్రీష్ పురి నసీరుద్దీన్ షా |
ఛాయాగ్రహణం | గోవింద్ నిహలానీ |
కూర్పు | రేణు సలూజా |
సంగీతం | అజిత్ వెర్మన్ |
విడుదల తేదీ | 19 ఆగస్టు 1983 |
సినిమా నిడివి | 130 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
అర్ధ్ సత్య, 1983 ఆగస్టు 19న విడుదలైన హిందీ సినిమా. గోవింద్ నిహలానీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఓంపురి, స్మితా పాటిల్, అమ్రీష్ పురి, నసీరుద్దీన్ షా తదితరులు నటించారు.[1] ఎస్‌డి పన్వాల్కర్ రాసిన 'సూర్య' అనే చిన్న కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు మరాఠీ నాటక రచయిత విజయ్ టెండూల్కర్ స్క్రీన్ ప్లే రాయగా, వసంత్ దేవ్ మాటలు రాశాడు.[2]
భారతీయ సినిమారంగ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిన ఈ సినిమా అనేక అవార్డులను గెలుచుకుంది.[3] భారతదేశంలో రూపొందిన అత్యుత్తమ పోలీసు చిత్రాలలో ఒకటిగా పరిగణించబడుతోంది.[4] 1984లో పార్టీ అనే పేరుతో సీక్వెల్ విడుదలైంది. ఈ సినిమా వల్ పేరుతో తమిళంలోకి రీమేక్ చేయబడింది.
1983 భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఈ సినిమాకు జాతీయ ఉత్తమ నటుడు విభాగాల్లో అవార్డు వచ్చింది.
కథా నేపథ్యం
ప్రశంసలు పొందిన ఈ పోలీసు నేపథ్య సినిమాలో కథానాయకుడు ఓం పురి, తన చుట్టూ ఉన్న చెడులతో, తన బలహీనతలతో సమాజంపై పోరాడే ఒక పోలీసు. మరాఠీ రచయిత దిలీప్ చిత్రే నేపథ్య కవితలు రాశాడు. రామశెట్టి పాత్రను పోషించడానికి దర్శకుడు నిహలానీ కొత్త నటుడి కోసం చూస్తున్నపుడు, రచయిత టెండూల్కర్ అమ్రాపుర్కర్ నటించిన "హ్యాండ్స్ అప్" అనే మరాఠీ నాటకాన్ని[5] చూడమని చెప్పాడు.[6] దిలీప్ చిత్రే రాసిన పద్యం నుండి సినిమా టైటిల్ తీసుకున్నారు.[5]
నటవర్గం
- ఓం పురి (సబ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ అనంత వేలాంకర్)
- స్మితా పాటిల్ (జ్యోత్స్న గోఖలే)
- అమ్రిష్ పూరి (పోలీస్ కానిస్టేబుల్ వెలాంకర్ అనంత్ తండ్రి)
- మాధురి పురందరే (అనంత్ తల్లి)
- నసీరుద్దీన్ షా (సస్పెండ్ చేయబడిన పోలీసు మైక్ లోబో)
- సదాశివ్ అమ్రాపుర్కర్ (స్థానిక మాఫియా డాన్ రామ శెట్టి)
- మదన్ జైన్ (రాముడి శెట్టి కుమారుడు)
- షఫీ ఇనామ్‌దార్ (పోలీస్ ఇన్‌స్పెక్టర్ హైదర్ అలీ)
- ఐలా అరుణ్ (స్నేహా వాజ్‌పేయి)
- సతీష్ షా (డాకోయిట్)
- అచ్యుత్ పోత్దార్ (పోలీస్ ఇన్స్పెక్టర్ పాటిల్)
- ఆకాష్ ఖురానా (ఖన్నా, మిల్ ఓనర్)
- విజయ్ కశ్యప్ (మిల్ యూనియన్ లీడర్)
నిర్మాణం
ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్‌కు మొదట ప్రధాన పాత్రను ఇవ్వగా, బిజీ షెడ్యూల్ కారణంగా అమితాబ్ ఈ సినిమాలో నటించలేకపోయాడు. ఓం పురి అనంత్ వేలంకర్‌గా నటించగా, ఇది తన కెరీర్‌లో నిలిచే పాత్రగా మారింది.
అవార్డులు
సంవత్సరం | ప్రతిపాదించిన విభాగం | పురస్కారం | ఫలితం |
---|---|---|---|
1983 | ఓం పురి | ఉత్తమ నటుడు – కార్లోవీ వారీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ | గెలుపు |
భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ నటుడు | |||
1984 | ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు - ఉత్తమ నటుడు | ప్రతిపాదన | |
మన్మోహన్ శెట్టి, ప్రదీప్ ఉప్పూర్ | ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు - ఉత్తమ సినిమా | గెలుపు | |
గోవింద్ నిహలానీ | ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు - ఉత్తమ దర్శకుడు | ||
సదాశివ్ అమ్రాపుర్కర్ | ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు - ఉత్తమ సహాయ నటుడు | ||
ఎస్‌డి పన్వాల్కర్[7] | ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు - ఉత్తమ కథ | ||
విజయ్ టెండూల్కర్ | ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు - ఉత్తమ స్క్రీన్ ప్లే |
మూలాలు
- ↑ "Ardh Satya (1983)". Indiancine.ma. Retrieved 2021-08-17.
- ↑ Ardh Satya at lib.virginia.edu Archived 13 డిసెంబరు 2007 at the Wayback Machine
- ↑ Ardh Satya Review
- ↑ Best cop films starboxoffice.com.
- ↑ 5.0 5.1 Salam, Ziya Us (6 November 2014). "Ardh Satya (1983)". The Hindu. Retrieved 2021-08-17.
- ↑ N, Patcy (3 November 2014). "'Sadashiv Amrapurkar was offered limited roles but he picked the best'". Rediff.com. Retrieved 2021-08-17.
- ↑ Ardh Satya Awards IMDb
బయటి లింకులు
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అర్ధ్ సత్య
- ఆల్మూవీ లో అర్ధ్ సత్య
- న్యూయార్క్ టైమ్స్‌లో సినిమా సమీక్ష