అహమ్మద్ షా బహదూర్

Ahmad Shah Bahadur
The Mughal Emperor Ahmad Shah Bahadur, practices his equestrian skills, in a hunting field in the year 1750.
13th Mughal Emperor
పరిపాలన26 April 1748 – 2 June 1754
Coronation4 May 1748 at Red Fort, Delhi
పూర్వాధికారిMuhammad Shah
ఉత్తరాధికారిAlamgir II
రాజప్రతినిధిNawab Bahadur
జననం23 December 1725
Delhi, Mughal Empire
మరణం1 January 1775 (aged 49)
Delhi, Mughal Empire
Burial
Mausoleum of Mariam Makani, Delhi
SpousesGauhar Afruz Banu Begum and another wife
వంశముHamid Shah Bahadur
Bidar Bakht Mahmud Shah Bahadur
Tala Said Shah Bahadur
Muhammad Jamiyat Shah Bahadur
Muhammad Dilawar Shah Bahadur
Mirza Rujbi
Mirza Mughlu
Muhtaram-un-Nisa Begum
Dil Afruz Begum
Names
Abu-Nasir Mujahid ud-din Muhammad Ahmad Shah Bahadur
రాజవంశంTimurid
తండ్రిMuhammad Shah
తల్లిQudsia Begum
మతంIslam

అహమ్మద్ షా బహదూర్, మిర్జా అహమ్మద్ షా, షహన్‌షా అహమ్మద్ బహదూర్ (1725 డిసెంబరు 23 - 1775 జనవరి 1) మొఘల్ చక్రవర్తి ముహమ్మద్ షాకు కుమారుడుగా జన్మించాడు.1748 లో అహమ్మద్ షా బహదూర్ తన 22 వ సంవత్సరంలో తండ్రి సింహాసనాన్ని వారసుడుగా 15 వ మొఘల్ చక్రవర్తిగా అధిష్టించాడు. అహమ్మద్ షా మొఘల్ సింహాసం అధిష్టించే తరుణంలో మొఘల్ సామ్రాజ్యం పతనావస్థలో ఉంది. ఆయన బలహీన పాలన మూడవ ఘజి ఉద్ - దీన్ - ఖాన్ జంగ్ (ఇమాద్- ఉల్-ముల్క్) బలం పుంజుకోవడానికి కారణం అయింది.

అహమ్మద్ షా బహదూర్ చాలా బలహీనమైన మొఘల్ రాజాస్థానానికి వారసత్వం వహించాడు. ఆయన మొఘల్ సామ్రాజ్యానికి నామమాత్రపు చక్రవర్తిగా మాత్రమే ఉన్నాడు. ఆయన వజీరు ఘజి ఉద్ - దీన్ - ఖాన్ జంగ్ చేత సింహాసనాధిస్ఠుడు అయ్యాడు. ముహమ్మద్ షా 6 సంవత్సరాల పాలన తరువాత ఘజి ఉద్ - దీన్ - ఖాన్ జంగ్ చేత పదవీచ్యుతుడయ్యాడు. తరువాత ముహమ్మద్ షా ఆమె తల్లి ఘజి ఉద్ - దీన్ - ఖాన్ జంగ్ ఆదేశాలతో అంధులుగా చేయబడి ఖైదు చేయబడ్డారు. ముహమ్మద్ షా 1775 లో సహజమరణం పొందాడు.

ఆరంభకాల జీవితం

రాకుమారుడు అజమ్మద్ 1725లో మొఘల్ చక్రవర్తి ముహమ్మద్ షా, ఆమె పట్టపురాణి కుద్సియా బేగంకుమారుడుగా జన్మించాడు.

1680- 1707 దక్కన్ యుద్ధాలు చివరిసారిగా అహమ్మద్ షా పుట్టక ముందే మొఘల్ సామ్రాజ్యాన్ని పూర్తిగా బలహీనం చేసాయి. అహమ్మద్ షా సింహాసనం అధిష్టించే సమయానికి చివరి విచ్చిన్నతకు మొఘల్ సామ్రాజ్యం సిద్ధంగా ఉంది. 1737 ఢిల్లీ యుద్ధం తరువాత పూర్వపు మొఘల్ సామ్రాజ్యంలో ఢిల్లీ తప్ప మరేమి మిగల లేదు. రాకుమారుడు అహమ్మదుకు స్త్రీవ్యసనం ఉండేది. అంతేకాక రాకుమారుడు నిరక్ష్యరాశ్యుడు. రాకుమారుడు యుద్ధశిక్షణ కూడా పొందలేదు. అహమ్మద్ షా తండ్రి కుమారుని కట్టుదిట్టంగా పర్యవేక్షించినప్పటికీ మొఘల్ చక్రవర్తి మొహమ్మద్ షా సామ్రాజ్యాన్ని సమైక్యపరచలేని అసమర్ధతను ఆసరాచేసుకుని ఆయన భార్య పట్టపురాణి ఆధిక్యత అధికం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఆయన తల్లి కుద్సియా బేగం మాత్రం కుమారునికి మద్దతు ఇచ్చింది.,[1]

అహమ్మద్ షా బహదూర్ అత్యవసర పరిస్థితి

మొఘల్ సామ్రాజ్యంలోని లాహోర్ వైస్రాయి జకరియా ఖాన్ బహదూర్ మరణించిన తరువాత ఆయన ఇద్దరు కుమారులు యహ్యా ఖాన్ బహదూర్, మైన్ షా నవాజ్ ఖాన్ వారసత్వపు అధికారం కొరకు పరస్పరం కలహించుకున్నారు. తన అన్నను ఓడించిన తరువాత మైన్ షా నవాజ్ ఖాన్ తనకు తానే " మొఘల్ వైస్రాయ్ ఆఫ్ పంజాబు "గా ప్రకటించుకున్నాడు. ఈ బలహీనతను ఉపయోగించికోవడానికి " అహమ్మద్ షా దుర్రానీ " 30,000 సైన్యంతో షా నవాజ్ ఖాన్ సహాయంతో మరొక యుద్ధానికి సిద్ధం అయ్యాడు.

1748 ఏప్రిల్ మాసంలో అహమ్మద్ షా అబ్దల్ షా నవాజ్ ఖాన్‌తో కలిసి సింధూ లోయప్రాంతం మీద దండయాత్రచేసాడు. ఈ చర్యతో ప్రేరితమైన సింధు నవాబు సర్బులంద్ ఖాన్ మొఘల్ సైన్యాల సహాయంతో నదీతీరంలో సైన్యాలను సమీకరించి బలోపేతం చేసాడు. మొఘల్ చక్రవర్తి రాకుమారుడు అహమ్మద్, ప్రధాన వజీరు కామరుద్దీన్ ఖాన్, హఫీజ్ రహ్మత్ ఖాన్, మూడవ సఫ్దర్జంగ్, ఘాజీ ఉద్-దీన్- ఖాన్ ఫెరోజ్ జంగ్ (ఇంతిజాం ఉద్- దు- ల్లా), నాసిర్ ఖాన్ (ఘజని పూర్వపు సుబేదార్), కాబూల్, యాహ్యా ఖాన్, అలీ ముహమ్మద్ ఖాన్ రొహిల్లాలను పంపాడు. 1748 మణిపూర్ యుద్ధం సమయంలో దురానీ 12,000 సైన్యాలను ఎదుర్కోడానికి మొఘల్ సామ్రాజ్యం 75,000 సైన్యాలను పంపింది.[2] సట్లైజ్ నదీతీరంలో సిర్హింద్ వద్ద రెండు సైన్యాలు ముఖాముఖి పోట్లాడుకున్నాయి. చివరికి రాకుమారుడు అహమ్మదుకు విజయం లభించింది. తరువాత రాకుమారుడు అహమ్మదు బహదూరు బిరుదుతో సత్కరించబడ్డాడు. [3] యుద్ధంలో ప్రధాన వజీరు కుమరుద్దీన్ ఖాన్ మరణించడంతో మొఘల్ చక్రవర్తి మొహమ్మద్ షా తీవ్రంగా విచారించాడు.[2] మొఘల్ సైన్యానికి చెందిన కలాత్, దెరా ఘాజీ ఖాన్, దెరా ఇస్మాల్ ఖాన్ కలిసి అహమ్మద్ షా దుర్రానీని హత్యచేయడానికి ప్రణాళిక వేసారు. వారి ప్రణాళిక చివరికి బహిరంగమై వారు పట్టుబడ్డారు.

నూతన మొఘల్ చక్రవర్తి అహమ్మద్ షా బహదూర్ కుమరుద్దీన్ ఖాన్ కుమారుడైన ముయిన్- ఉల్- ముల్క (మీర్ మన్ను) ను మణిపూర్ యుద్ధవీరుడిగా గుర్తించి పంజాబు వైస్రాయిగా నియమించాడు. 1750లో ముయిన్ - ఉల్- ముల్క్ (మీర్ మన్ను) కూడా అహమ్మద్ షా దుర్రానీ మధ్య జరిగిన శాంతి ప్రయత్నంలో కొంత భూభాగం వదులుకున్నాడు. అయినప్పటికీ 1751లో అహమ్మద్ షా దుర్రానీ తిరిగి దండయాత్రచేసి కాశ్మీర్‌ను ఆక్రమించుకున్నాడు. 1753 నాటికి అహమ్మద్ దుర్రానీని ఎదిరించి మొఘల్ సైన్యాలను నడిపించిన ముయిన్ - ఉల్- ముల్క్ అహమ్మద్ షా దుర్రానీని ఓడించి కాశ్మీర్‌ను తిరిగి వశపరచుకున్నారు. ముయిన్ - ఉల్ - ముల్క్ అహమ్మద్ షా దుర్రానీని క్షమించడమే కాక యుద్ధం చూపించిన ధైర్యసాహసాలను మెచ్చి మొఘల్ చక్రవర్తి అనుమతితో దుర్రానీని తన ప్రతినిధిగా చేసుకున్నాడు.

విదేశీ సంబంధాలు

1751లో అహమ్మద్ షా బహదూర్ ఓట్టమన్ దూత హాజీ యీసఫ్‌కు నివాస అనుమతి ఇచ్చి వారు ఇస్తాబుల్‌కు తిరిగి వెళ్ళడానికి అనుమతి ఇచ్చాడు. తరువాత అహమ్మద్ షా బహదూర్ ఓట్టమన్ సుల్తానులతో సంబంధాలు ఏర్పరచుకోవడానికి ప్రయత్నించలేదు.

సైనిక దాడులు

మణిపూర్ యుద్ధంలో సాధించిన విజయం అహమ్మద్ షా బహదూర్ వ్యూహాత్మక పరాక్రమానికి సాక్ష్యంగా ఉంది. అయన మొఘల్ సింహాసనం అధిష్టించిన తరువాత ఆయన 1745- 51 లో పుర్బియా సాయుధ దళాలను మొఘల్ సైన్యంలో కొత్తగా ప్రవేశపెట్టాడు. పూర్బియా సాయిధ దళాలను మొఘల్ సంరాజ్య వాయవ్య భూభాగంలో ఉన్న దుర్రానీ, సిక్కు తిరుగుబాటుదారుల అణిచివేతకు ఉపయోగించబడ్డారు.[4]

మొఘల్ సామ్రాజ్య స్థితి

యుద్ధం కాలం
అంఝెరా యుద్ధం 1728
పాల్ఖెడ్ యుద్ధం --
జైత్పూర్ యుద్ధం 1729
ఢిల్లీ యుద్ధం 1737
భోపాల్ యుద్ధం --
దామల్చెర్రీ పాస్ యుద్ధం 1740
త్రిచొనోపోలీ ఆక్రమణ 1841
మొదటి కత్వా యుద్ధం 1742
త్రిచొనోపోలీ ఆక్రమణ 1743
రెండవ కత్వా యుద్ధం 1745
బుర్ద్వాన్ యుద్ధం 1747
మాల్తాన్ యుద్ధం 1751
సిధ్ఖెడ్ యుద్ధం 1757
మంగ్రోల్ యుద్ధం 1761
రక్షాస్భువన్ యుద్ధం --

మొఘల్ సామ్రాజ్యం ప్రధాన వజీరు కుమర్- ఉద్- దిన్ ఖాన్ సిరిహింద్ యుద్ధంలో మరణించాడు. మొఘల్ చక్రవర్తికి ఈ సమాచారం అందించబడుంది. ఈ వార్త చక్రవర్తిని కుంగదీసింది. తరువాత మొఘల్ చక్రవర్తి రోగగ్రస్థుడై త్వరలోనే మరణించాడు. అది విన్న రాకుమారుడు అహమ్మద్ షా ఢిల్లీకి చేరి తండ్రి మరణం కొరకు ఒక వారం దుఃఖం అనుష్ఠించాడు. తరువాత 1748 ఏప్రిల్ 18న మొఘల్ సింహాసనం అధిష్టించాడు. 1748 ఏప్రిల్ 29న ఎర్రకోట వద్ద ఆయనకు పట్టాభిషేకం జరిగింది. తరువాత ఆయన " అబు నాసిర్ ముజహిద్ - ఉద్ - దిన్ అహమ్మద్ షా ఘజి " బిరుదనామాన్ని స్వీకరించాడు.

అహమ్మద్ షా మొఘల్ అవధ్ నవాబును సఫ్దర్జంగ్‌ను ప్రధాన వజీర్‌ను చేసాడు, మూడవ ఘజీ - ఉద్- దీన్- ఫెరోజ్ - జంగ్ (ఇమాద్ - ఉల్- ముల్క్) మీర్ బక్షిగా నియమించాడు, ముయిన్ - ఉల్- ముల్క్ (మీర్ మన్ను) (మరణించిన ప్రధాన వజీర్ కుమరుద్దీన్ ఖాన్ కుమారుడు) ను పంజాబు గవర్నర్‌ను చేసాడు.[5] మొఘల్ రాజ్యసభ ప్రధాన నపుంసకుడు జావేద్ ఖాన్ నవాబ్ బహదూర్ (జావేద్ ఖా) కు అధికారికంగా " నవాబ్ బహదూర్ " బిరుదు ఇవ్వబడింది. .[6] తరువాత చక్రవర్తి అంతఃపుర స్త్రీలతో సంతోషంగా కాలం గడిపాడు. దాదాపు కొన్ని మాసాల వరకు ఆయన పురుషులను చూడలేదని కొన్ని కథనాలు వివరిస్తున్నాయి.

మొదటి కర్నాటక యుద్ధం (1746–1748)

The Mughal Subedar of the Deccan Muzaffar Jang welcomes Joseph François Dupleix.

1749 లో జోసెఫ్ ఫ్రాంకోయిస్ డూప్లెక్స్ మొఘల్ సామ్రాజ్యం దక్కన్‌లో నియమించిన శక్తివంతమైన నిర్వాహకులైన చందాసాహెబ్, ముజాఫర్ జంగ్‌ల కూటమి చేరాడు. వారిని వారి ప్రాంతాలకు పాలకులను చేయాలని ప్రతిపాదించాడు. వీరితో ప్రముఖ నాయకుడైన హైదర్ ఆలీ కూడా చేతులు కలిపి ఫ్రెంచ్ వైపు మొగ్గుచూపాడు. తరువాత చందా సాహెబ్, ముజాఫర్ జంగ్, ఫ్రెంచ్ తరఫున నాయకత్వం వహించిన పటిసియర్, మార్క్విస్ డీ బస్సి - కాస్టిల్నౌ కలిసి కర్నాటక నవాబు అంవతుద్దీన్ ముహమ్మద్ ఖాన్‌ను ఆంబూర్ యుద్ధం (1749) లో ఓడించారు.[7] విజయవంతంగా నిర్వహించబడిన ఈ యుద్ధం ఫలితంగా 1759లో ముహమ్మద్ అలి ఖాన్ వాలాజా, నాసిర్ జంగ్ వారికి వారు ఆగ్లేయులతో కూటమి ఏర్పరుచుకున్నారు. డీ బస్సీ నుండి జింగీ కోటను తిరిగి స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించిన నాసిర్ జంగ్‌ను కడప నవాబు హిమ్మత్ ఖాన్ అడ్డగించి ఓడించి చంపబడ్డాడు. విజేత వెనుక ఉన్న జోసెఫ్ ఫ్రాంకొయిస్ డూప్లెక్స్ ముజాఫర్‌ను తూర్పు దక్కన్ మొఘల్ భూభాగాలకు నిజాంను చేసాడు. చందా సాహెబ్ కర్నాటక నూతన నవాబుగా నియమించబడ్డాడు. ఔరంగజేబు కాలం నుండి సముద్రపు దోపిడీదారులుగా పేరు ఉన్నప్పటికీ క్రమంగా ఫ్రెంచ్ మొఘల్ సామ్రాజ్యం అంతటా ఆధీనత సాధించారు.

గుజరాత్ నష్టం

1750 లో మరాఠీలు గుజరాత్‌ను తమరాజ్యంలో విలీనం చేసుకున్నారు. తరువాత ఇరు పక్షాల మద్య తీవ్రమైన సంఘర్షణ చెలరేగింది. ఈ సంఘర్షణలలో భాగంగా 1753లో రాజ్ బొవ్రి మసీదు ధ్వంసం చేయబడింది.[8] గుజరాత్ విలీనం మొఘల్ చక్రవర్తి అహమ్మద్ షా బహదూర్ జునాగఢ్ నవాబుగా ముహమ్మద్ బహదూర్ ఖాంజీని నియమించి అలాగే మొఘల్ సామ్రాజ్యానికి విశ్వాసంగా ఉన్నందుకు బదులుగా పలు బిరుదులను ప్రధానం చేసాడు [9] అహమ్మద్ షా బహదూర్, సఫ్దర్జంగ్ సలాబత్ ఖానును 18,000 మొఘల్ సైన్యంతో తిరుగుబాటు చేస్తున్న రాజపుత్రభూభాగాలను అణిచివేసి సైన్యాలను అభివృద్ధికి మద్దతు కూడమట్టమని పంపాడు.

ఒరిస్సా నష్టం

1751లో ప్రఖ్యాతి చెందిన బెంగాల్ నవాబు అలివర్ది ఖాన్ (గొప్ప సైనిక వ్యూహనిపుణుడు) 11 సంవత్సరాల కాలం తన భూభాగాల రక్షణార్ధం మరాఠీలతో పోరు సాగించిన తరువాత బృహత్తరమైన మరాఠీసైన్యాలచేతిలో ఓటమి పొందాడు. మరాఠీ సైన్యాలకు రఘోజీ నాయకత్వం వహించాడు. తరువాత రఘోజీ ఒరిస్సా భూభాగాలను తన రాజ్యంతో విలీనం చేసాడు.

రెండవ కర్నాటక యుద్ధం (1749–1754)

Siege of Arcot was a major battle fought between Robert Clive and the combined forces of the Mughal Empire's Nawab of the Carnatic, Chanda Sahib, assisted by a small number of troops from the French East India Company.

1751 లో చందా సాహెబ్ ఆయన సైనికాధికారులు రేజా సాహెబ్, ముహమ్మద్ యూసఫ్ ఖాన్ ముహమ్మద్ అలీ ఖాన్, క్లైవ్ ఆర్కాట్ యుద్ధంలోవాలాజాచేత ఓడించబడ్డారు. తరువాత ముజాఫర్ జంగ్ కర్నూలు నవాబ్, కడప నవాబు, సావనూర్ నవాబు విముఖతను ఎదుర్కొన్నాడు. వారు ముగ్గురు కలిసి 3,000 సైనికులతో ఉన్న ముజాఫర్ జంగ్ శిబిరాలపై దండయాత్ర సాగించారు. యుద్ధంలో సావనూరు నవాబు మరణించాడు, కర్నూలు నవాబు హిమయత్ ఖాన్ కాల్చివేయబడి తీవ్రంగా గాయపడిన సమయంలో .[10] ముజారఫ్‌ జంగ్‌తో సవాలు చేసి ద్వంధయుద్ధానికి పిలిచి యుద్ధంలో ఒకరిని ఒకరు తొలగించుకున్నారు.

ఏడు సంవత్సరాల ఈస్టిండియా యుద్ధం

  • కొలకత్తా ఆక్రమణ
  • చాందనగర్ యుద్ధం
  • ప్లాసరీ యుద్ధం
  • త్రిచినోపొలి యుద్ధం (1757)
  • కడలూర్ యుద్ధం (1758)
  • నాగపట్నం యుద్ధం (1758)
  • కండోర్ యుద్ధం
  • తంజావూరు ఆక్రమణ
  • పాట్నా యుద్ధం (1759)
  • పాండిచేరి యుద్ధం.
  • మచిలీపట్నం ఆక్రమణ.
  • మద్రాసు ఆక్రమణ
  • చింసురా యుద్ధం
  • హాజీపూర్ యుద్ధం (1760)
  • కారైకాల్ యుద్ధం (1760)
  • మాసుంపూర్ యుద్ధం (1760)
  • షెర్పూర్ యుద్ధం (1760)
  • ఉద్గిర్ యుద్ధం (1760)
  • వందవాసి యుద్ధం.
  • పాండిచేరి ఆక్రమణ (1760)
  • సుయాన్ యుద్ధం (1761)

ముజాఫర్ జంగ్ మరణం గొప్ప సంచలనం సృష్టించింది. కనీవినీ ఎరిగని ఈ సంఘటన మొఘల్ సామ్రాజ్యంలోనూ, ఫ్రెంచ్ ప్రజలలోనూ కల్లోలం రేకెత్తించింది. డీ బుస్సీ చక్రవర్తి కోర్టులో బాధ్యత వహించి చక్రవర్తి అహమ్మద్ షా బహదూర్ అంగీకారం లేకుండానే ముజాఫర్ జంగ్ సోదరుడు సలాబాత్ జంగును దక్కన్ సుబేదారుగా నియమించాడు. తరువాత ఏప్రిల్ 12న హైదరాబాదులో ప్రవేశించి అక్కడి నుండి మరాఠీల మీద దాడి చేయడానికి ఏప్రిల్ 18న ఔరంగాబాదు చేరి అక్కడ సైన్యాలను బలోపేతం చేసాడు. .[11] తన సోదరుడు శక్తివంతుడు కావడం సహించలేని మూడవ ఘాజీ ఉద్- దిన్- ఖాన్ ఫెరోజ్ జంగ్ (ఇంతిజాం ఉద్- దౌలా) (ప్రముఖ మొఘల్ సైనికాధికారి) అతని పదవిని రద్దు చేసి అతడిని భయపెట్టడానికి 1,50,000 మంది సైనికులతో దక్కన్ వైపు కదిలాడు. అక్కడ అప్పటి వరకు శత్రువుగా ఉన్న నానాసాహెబ్ పేష్వా బాలాజీ బాజీరావు సాయంతో సలాబత్ జంగును తొలగించాడు. తరువాత జోసెఫ్ ఫ్రాంసియోస్ డూప్లెక్స్ మరాఠీలను ఎదిరించాలని నిశ్చయించుకున్నాడు. 1751 డిసెంబరు సూర్యగ్రహణ సమయంలో సందభాన్ని అవకాశంగా తీదుకుని బాలాజీ భాజీరావును ఓడించాడు. తరువాత డీబస్సీ, సలాబత్ జంగ్ కూటమి పాట్నా వైపు సాగి మారాఠీల మీద వరుస విజయాలు సాధించారు. తరువాత సంవత్సరం డీ బస్సీ అహ్మద్ నగర్ సమీపంలో మరాఠీలతో శాంతి ఒప్పందం చేసాడు.

మూడవ ఘజీ - ఉద్- దిన్ ఖాన్ ఫెరోజ్ జంగ్ (ఇంతిజాం ఉద్ దౌలా) నానాసాహెబ్ పేష్వాతో చేతులు కలిపినందుకు ఆయన మీద స్వంత బృందాలు విషప్రయోగం చేసారు.1752 లో ముహమ్మద్ అలీ ఖాన్ వాలాజా, క్లైవ్ చేతిలో ఓడిపోయిన తరువాత జరిగిన తిరుగుబాటులో కర్నాటక నవాబు చందా సాహెబ్ మరణించాడు. ముహమ్మద్ అలీ ఖాన్ వాలాజా తరువాత విజయవంతంగా కర్నాటకా నవాబుగా ప్రకటించబడ్డాడు.

1753 లో డీ బస్సీ ఉత్తర సర్కాతులతో కూటమి చేరాడు. ఈ కదలిక తరువాత మరాఠీల మీద వరుస విజయాలకు నాంది అయింది. 1754 లో డీ బస్సీ రఘోజీ మీద విజయం సాధించాడు. 1757 వరకు ఈ యుద్ధం కొనసాగింది. సలాబత్ జంగ్, డీ బస్సీ మారాఠీల మీద వరుస విజయాలు సాధించారు. ఫ్రెంచి మద్దతు సలాబత్ జంగ్ ను మరింత శక్తివంతుని చేసింది. 1756లో సలాబత్ జంగ్ ఉపయోగించిన శక్తివంతమైన తుపాకులు (కాటియోక్స్) ఫిరంగులకంటే శక్తివంతంగా పనిచేసాయి. .[4] మరాఠీ తురుగుబాటుదారులను ఈ ఆయుధాలు తీవ్రంగా మట్టుపెట్టాయి.

అంతఃకలహాలు (1750–1754)

The Mughal Grand Vizier Safdarjung had severely mismanaged the empire and was the cause of a divisive Civil War, based solely on the ethnic composition of the subjects of the Mughal Emperor Ahmad Shah Bahadur.

1749లో జరిగిన కాల్పుల నుండి మొఘల్ ప్రధాన వజీరు సఫ్దర్‌జంగ్ ప్రాణాలతో వెలుపలికి వచ్చిన తరువాత మొఘల్ రాజ్యసభలో ఉద్రేకాలు అధికం అయ్యాయి. ప్రధాన వజీరు చట్టబద్ధంగా ఆఫ్ఘన్ కుట్రలో భాగస్వామ్యం ఉందని భావించిన కొందరిని అధికారం నుండి తొలగించడం మరికొంత ఆందోళనకు దారి తీసింది. ఇది సఫ్దర్‌జంగ్ తురానీ కుట్రదారుల మద్య కలహానికి దారితీసింది. 1759లో రాజపుత్రుల మీద దాడి సాగించిన తరువాత తన 18,000 సైనిక బృందాలకు వేతనం చెల్లించమని నిర్భందినందుకు సలాబత్ ఖాన్ బహదూర్‌ను జావేద్ ఖాన్ నవాబు బహదూర్ ఖైదు చేసి సైనికులను ఢిల్లీకి పంపారు. ఖైదు చేయబడిన సలాబత్ ఖాన్ బహదూర్ (సైనికులు తిరుగుబాటు చేయగలరని భావించి) సైకులకు వేతనం చెల్లించడానికి తన ఆస్తులను విక్రయించి సైనికులకు వేతనంగా చెల్లించి పేదరికంలో మునిగిపోయాడు. తరువాత సలాబత్ ఖాన్ బహదూర్ డెర్విష్ (సూఫీ ముందు పేదరిక జీవితం గడుపుతానని ప్రమాణం చేసిన వాడు) లా జీవించాడు.

ఈ విధానాలకు ఆగ్రహించిన మొఘల్ ప్రధాన వజీర్ అహ్మద్ ఖాన్ బంగాష్ అవధ్ లోని సఫ్దర్ జంగ్ ఆస్తుల మీద దాడిచేసి లేఖరి నావల్ రాయ్‌ను చంపి సఫ్దర్ జంగ్‌ను గాయపరిచాడు. సఫ్దర్ జంగ్ ప్రతీకారంగా తన ఆధీనంలో ఉన్న మొఘల్ సైన్యాలను మొహరించి రోహిల్‌ఖండ్ మీద దాడిచేసాడు. తరువాత మొఘల్ చక్రవర్తి వెంటనే ఈ ప్రతీకారాలకు ముగింపు చేయాలని నిర్బంధించాడు. చక్రవర్తి ఆదేశాలకు ప్రధాన వజీరు విధేయత ప్రదర్శించాడు. 1752లో ఫలితంగా జావేద్ ఖాన్‌ను హత్యచేయడానికి సఫ్దర్ జంగ్ తన టర్కీ సేనలను పంపాడు.

సఫ్దర్‌జంగ్ పలుకుబడి అధికం ఔతున్నందున దానిని తగ్గించడానికి 1753 మే మాసంలో అహ్మద్ షా బహదూర్ తరువాత 18సంవత్సరాల " నాల్గవ ఘజీ - ఉద్- దీన్ ఖాన్ జంగ్ " (ఇమాద్ - ఉల్- ముల్క్) (మరణించిన మూడవ ఘజీ ఉద్- దౌలా - ఖాన్ ఫెరోజ్ జంగ్ కుమారుడు)ను సైనికాధికారిగా ఎన్నుకున్నాడు.

సఫ్దర్‌జంగ్‌కు వ్యతిరేకంగా ఇమాద్ - ఉల్ - ముల్క్ సైన్యాలను సమీకరించాడు. తరువాత మొఘల్ సామ్రాజ్యంలో ఉన్న షియా సున్ని, ఆఫ్ఘన్ - ఇరానీ - తురానీ మొదలైన ముస్లిం ప్రజల మద్య ఉన్న భేదాలను తగ్గించడానికి ప్రయత్నించాడు. సఫ్దర్ జంగ్ ఓడిపోయాడు. అయినప్పటికీ సఫ్దర్ జంగ్ మద్దతుదారు సలాబత్ ఖాన్ బహదూర్ మన్నించి అవధ్‌ను వదిలి వెళ్ళాలని షరతు విధించాడు.

నాల్గవ ఘాజీ ఉద్ - దిన్ ఖాన్ ఫెరోజ్ జంగ్ (ఇమాద్ - ఉల్- ముల్క్) మొఘల్ సామ్రాజ్యానికి ప్రధాన వజీరుగా నియమించబడ్డాడు. నాల్గవ ఘాజీ ఉద్ - దిన్ ఖాన్ ఫెరోజ్ జంగ్ పరాక్రమం చక్రవర్తి అహ్మద్ షా బహదూరుకు వెరుపు కలిగించింది. మొఘల్ చక్రవర్తి నాల్గవ ఘాజీ ఉద్ - దిన్ ఖాన్ ఫెరోజ్ జంగ్ వసూలు చేసిన 15,00,000 దాం లను తీసుకుని మొఘల్ సామ్రాజ్యానికి చెందిన 80,000 సైన్యాలకు వేతనం చెల్లించడానికి నిరాకరించాడు. మొఘల్ సైనికాధికారులు 32 మాసాల వేతనం కావాలని నిర్బంధించారు. అహ్మద్ షా బహదూర్ ఇమాద్ -ఉల్- ముల్క్‌ను అధికారం నుండి తొలగించాలని ప్రయత్నించాడు. ఇమాద్- ఉల్- ముల్క్ అక్విబత్ ముహమ్మద్‌ను పంపి చక్రర్తి అహమ్మద్ షాను ఖైదుచేయమని చెప్పాడు. తరువాత మరాఠీ సైనికాధికారి సదాశివరావు భౌతో కూటమిని ఏర్పరచుకుని 1754లో అహమ్మద్ షా బహదూర్‌ను పదవి నుండి తొలగించాడు.

జాట్ తిరుగుబాటు, 1754

సఫ్దర్‌జంగ్ అవధ్‌కు పారిపోయాడు. తరువాత మొఘల్ సైనికాధికారి జాట్ తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న భుర్త్పోర్ సూరజ్ మాల్ మీద దాడి చేసాడు. నాల్గవ ఘాజి ఉద్- దీన్ ఖాన్ ఫెరోజ్ జంగ్ (ఇమాద్ - ఉల్- ముల్క్) ను తిరిగి మొఘల్ సామ్రాజ్యానికి ప్రధాన వజీరుగా నియమించిన తరువాత ఆయన తన సరికొత్త ఆయుధ సంపదతో తన సహాయ సైనికాధికారికి మద్దతుగా ఢిల్లీకి వెళ్ళాడు.[5] ఇమాద్ - ఉల్ - ముల్క్ మీద దండయాత్ర చేయమని అహ్మద్ షా బహదూర్, జావిద్ ఖాన్ సూరజ్ మాల్‌కు పంపిన రహస్య లేఖలు ఇమాద్ - ఉల్ - ముల్క్‌ చేతికి చిక్కాయి. ఆ లేఖలు ఇమాద్ - ఉల్ - ముల్క్, సూరజ్ మాల్ మద్య అశాంతికి దారితీసింది. ఈ అశాంతి తరువాత జావేద్ ఖాన్ నవాబ్ బహదూర్‌కు మరణశిక్ష విధిపుకు, మొఘల్ చక్రవర్తి అహమ్మద్ ఖాన్ బహదూరును అంధుని చేయడానికి దారి తీసింది. ఈ సమాచారం విన్న తరువాత సఫ్దర్ జంగ్ జబ్బునపడి మరణించాడు. [5]

తతువాత పాలన

Sunehri Masjid, outside the southwestern corner of Delhi Gate of Red Fort was constructed under the supervision of Qudsiya Begum, the wife of the Mughal Emperor Ahmad Shah Bahadur, in 1751.[12]
Silver rupee of Ahamad Shah Bahadur

మొఘల్ చక్రవర్తి అహమ్మద్ షా బహదూర్ రాజ్యాంగపరంగా బలహీనపడినప్పటికీ రాజకీయ ప్రాముఖ్యత కలిగిఉన్నందున దూరంగా ఉన్న విశ్వసనీయమైన సామంతులు చందా సాహెబ్, ముజాఫర్ జంగ్‌లతో సత్సంబంధాలు కొనసాగించాడు.

అహమ్మద్ షా బహదూర్ తన చివరి పాలనలో ప్రముఘులు వారిలో వారు కలహించుకున్నారు. ఈ కలహాలు చక్రవర్తిని విసిగించాయి. ఆయన వాటి నుండి బయటపడడానికి ప్రయత్నించాడు. చక్రవర్తి కొందరు ప్రముఖుల పక్షం వహించి వారిసాయంతో మిగిలిన వారి మీద యుద్ధం ప్రకటించాడు. ఇందు వలన రాజ్యంలో చెలరేగిన కల్లోలం ఆరు మాసాల కాలం కొనసాగింది. నాల్గవ ఘాజీ ఉద్- దీన్- ఖాన్ ఫెరోజ్ జంగ్ మరాఠీల సాయంతో సఫ్దర్ జంగ్‌ను ఓడించాడు. తరువాత చక్రవర్తి పెద్ద సైన్యాలను సమీకరించి సికిందర్‌బాదు వద్ద నిలిపాడు. మరొక వైపు ఘాజీ ఉద్- దీన్- ఖాన్ ఫెరోజ్ జంగ్ మరాఠీ సైన్యాలతో మొఘల్ చక్రవర్తి అహమ్మద్ షా సైన్యాలను సికిందరాబాదు యుద్ధంలో మట్టుపెట్టాడు. చక్రవర్తి తన భార్యలు, 8,000 సైన్యాలను వెంటపెట్టుకుని ఢిల్లికి పారిపోయాడు. ఘజీ ఉద్- దీన్- ఖాన్ ఫెరోజ్ జంగ్ కూడా ఢిల్లీకి వెళ్ళి చక్రవర్తిని ఆయన తల్లిని 1754 జూన్ 25న ఖైదు చేసాడు. తరువాత అహ్మద్ షా బహదూర్ అంధునిగా చేయబడ్డాడు.

మరణం

అహమ్మద్ షా బహదూరు పదవి నుండి తొలగించబడిన తరువాత సలీంఘర్ కోటలో బంధించబడ్డాడు. ఆయన అక్కడ తన మిగిలిన జీవితం గడిపి 1775లో తన 50వ సంవత్సరంలో రెండవ షా ఆలం పాలనా కాలంలో మరణించాడు. 1788 లో ఆయన కుమారుడు బీదర్ బక్ష్ స్వల్పకాలం మొఘల్ సామ్రాజ్య పాలన చేసాడు.

ఇవి కూడా చూడండి

మూలాలు

వెలుపలి లింకులు