ఆమ్ ఆద్మీ పార్టీ

ఆమ్ ఆద్మీ పార్టీ
నాయకత్వంఅరవింద్ కేజ్రివాల్
స్థాపననవంబర్ 26, 2012
ప్రధాన కార్యాలయంగ్రౌండ్ ఫ్లోర్, A-119,
కుశామ్భి,ఘాజియాబాద్ -201010
సిద్ధాంతంస్వరాజ్యం[1]
రంగు
ఢిల్లీ అసెంబ్లీ
67 / 70
లోక్ సభ
4 / 545
ఓటు గుర్తు

ఆమ్ ఆద్మీ పార్టీ 2012 నవంబర్ 26 న సామాజిక కార్యకర్త అరవింద్ కేజ్రివాల్ చేత స్థాపించబడిన ఒక భారతీయ రాజకీయ పార్టీ. అవినీతికి వ్యతిరేకంగా జనలోక్ పాల్ బిల్లు కోసం జరిగిన ప్రజాపోరాటం నుంచి పుట్టిన పార్టీ. ఈ పోరాటాన్ని కేజ్రివాల్ రాజకీయ పార్టీగా కొనసాగించాలిని ప్రతిపాదించగా, ఈ పోరాటానికి నాయకత్వం వహించిన అన్నా హజారే వ్యతిరేకించారు. పార్టీ స్థాపించిన వెంటనే ఢిల్లీలో విద్యుత్, నీటి ధరలపై పోరాటాలు చేసారు. మహిళలపై అగాయత్యాలపై ప్రత్యేక చట్టం కోసం పోరాటాలు చేసారు.[2][3][4] పార్టీ పాల్గొన్న మొదటి ఎన్నికలు 2013 ఢిల్లీ శాసనసభ ఎన్నికలు. ఈ ఎన్నికలలో పార్టీ మొత్తం 70 సీట్లలో 28 సీట్లు సాధించి రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 8 సీట్లు సాధించిన కాంగ్రెస్ బయటి మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. 2015 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో కనీవిని ఎరుగని రీతిలో అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలో మొత్తం 70 శాసనసభ స్థానాల్లో 67 సీట్లను సాధించి తిరిగి అధికారంలోకి వచ్చింది.[5]

కేంద్ర ఎన్నికల సంఘం 2023 ఏప్రిల్ 09న ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ పార్టీ హోదాను ప్రకటించింది.[6]

బెంగుళూరులో అరవింద్ కేజ్రివాల్ ప్రసంగం
( జూలై 2013)

ఎన్నికలు

ఢిల్లీ శాసనసభ ఎన్నికలు 2013

ఢిల్లీ 2013 శాసనసభ ఎన్నికలు ఆమ్ ఆద్మీ పార్టీ పాల్గొనిన ప్రథమ ఎన్నికలు. ఎన్నికల కమిషన్ నుంచి పొందిన "చీపురు కట్ట" గుర్తు పై పోటిచేసారు. ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక హామీలు ప్రకటించారు. ఈ ఎన్నికలలో 70 సీట్లకు గాను 28 సీట్లు సాధించి సంచలనం సృష్టించారు. 32 స్థానాలు సాధించిన బిజెపి కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు నిరాకరించటంతో, లెఫ్టినెంట్ గవర్నర్ పిలుపు మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజాభిప్రాయ సేకరణ తరువాత ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. 8 స్థానాలున్న కాంగ్రెస్ పార్టీ బయటి నుంచి మద్దతు ఇచ్చింది.

సాధారణ ఎన్నికలు 2014

2014 లోక్ సభ ఎన్నికలలో పార్టీ పలు రాష్రాలలో 300 పైగా సీట్లలో పోటిచేయాలని నిర్ణయించింది. [7][8][9] ఆమ్ ఆద్మీ ఈ సార్వత్రిక ఎన్నికల్లో 443 స్థానాల్లో పోటీ చేసి 4 స్థానాల్లో గెలుపు సాధించింది.[10]

ఢిల్లీ శాసనసభ ఎన్నికలు 2015

కనీవిని ఎరుగని రీతిలో అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ అఖండ విజయం దక్కించుకుంది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మొత్తం 70 శాసనసభ స్థానాల్లో 67 సీట్లను ఆ పార్టీ కైవసం చేసుకుంది. 2013 శాసనసభ ఎన్నికలతో పోల్చుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీ తన ఓటు బ్యాంకును భారీగా పెంచుకుంది. గత ఎన్నికల్లో ఆ పార్టీకి 29.5 శాతం ఓట్లు పోలవగా ఈసారి అనూహ్యంగా 54.3 శాతానికి పెరిగింది.[5]

పంజాబ్ శాసనసభ ఎన్నికలు 2022

ఇప్ప‌టికే ఢిల్లీ పాల‌నా ప‌గ్గాల‌ను చేపట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌) 2022 మార్చి 16న పంజాబ్‌లోనూ పాల‌నా ప‌గ్గాల‌ను చేప‌ట్ట‌నుంది. 117 స్థానాలున్న పంజాబ్ అసెంబ్లీలో ఆప్ ఏకంగా 92 సీట్ల‌లో విజ‌య‌కేతనం ఎగుర‌వేసింది. సీఎం అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగి ఎమ్మెల్యేగా విజ‌యం సాధించిన భ‌గ‌వంత్ మాన్ సింగ్ పంజాబ్ సీఎంగా స్వాతంత్ర్య స‌మ‌ర యోధుడు భ‌గ‌త్ సింగ్ స్వ‌గ్రామం ఖ‌త్క‌ర్ క‌లాన్‌లో సీఎంగా ప్ర‌మాణం చేయ‌నున్నారు.[11]

రాష్ట్రం పేరు పదవీకాలం ప్రారంభం పదవీకాలం ముగింపు
ఢిల్లీ సుశీల్ కుమార్ గుప్తా 2018 జనవరి 28 2024 జనవరి 27
సంజయ్ సింగ్ 2018 జనవరి 28 2024 జనవరి 27
2024 జనవరి 28 2030 జనవరి 27
ఎన్.డి. గుప్తా 2018 జనవరి 28 2024 జనవరి 27
2024 జనవరి 28 2030 జనవరి 27
స్వాతి మలివాల్ 2024 జనవరి 28 2030 జనవరి 27
పంజాబ్ హర్భజన్ సింగ్ 10-ఏప్రిల్-2022 04-జూలై-2028
రాఘవ్ చద్దా 10-ఏప్రిల్-2022 04-జూలై-2028
సందీప్ పాఠక్ 10-ఏప్రిల్-2022 09-ఏప్రిల్-2028
అశోక్ కుమార్ మిట్టల్ 10-ఏప్రిల్-2022 09-ఏప్రిల్-2028
సంజీవ్ అరోరా 10-ఏప్రిల్-2022 09-ఏప్రిల్-2028
బల్బీర్ సింగ్ సీచెవాల్ 05-జూలై-2022 09-ఏప్రిల్-2028
విక్రమ్‌జిత్ సింగ్ సాహ్నీ 05-జూలై-2022 09-ఏప్రిల్-2028

లోక్‌సభ సభ్యులు

రాష్ట్రం లోక్ సభ నియోజకవర్గం పేరు ఎన్నికల
పంజాబ్ 16వ ఫతేఘర్ సాహిబ్ (ఎస్.సి) హరీందర్ సింగ్ ఖల్సా 2014
ఫరీద్‌కోట్ (ఎస్.సి) సాధు సింగ్
పాటియాలా ధరమ్వీర్ గాంధీ
సంగ్రూర్ భగవంత్ మాన్
17వ సంగ్రూర్ 2019
జలంధర్ సుశీల్ కుమార్ రింకూ 2023 (ఉప ఎన్నిక)

రాజకీయ నాయకులు

మూలాలు, వనరులు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-06-11. Retrieved 2014-01-01.
  2. PTI (19 May 2013). "AAP workers protest at residences of Delhi CM, MLAs". Times of India. New Delhi.
  3. "Delhi police arrests driver on rape charge after AAP activists protest". India Tv News channel. New Delhi. 24 May 2013.
  4. "Promise to Keep". Frontline Magzine. 15 Dec 2012. p. Volume 29. Archived from the original on 20 డిసెంబరు 2013. Retrieved 3 August 2012.
  5. 5.0 5.1 http://www.prajasakti.com/index.php?srv=10301&id=1289576
  6. V6 Velugu (10 April 2023). "ఆమ్ ఆద్మీ పార్టీకి గుడ్ న్యూస్.... టీఎంసీ, సీపీఐ, ఎన్సీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్". Archived from the original on 10 April 2023. Retrieved 10 April 2023.{cite news}: CS1 maint: numeric names: authors list (link)
  7. "AAP gears for Lok Sabha polls, to contest all seats in Gujarat, Haryana". Indian Express Portal. 5 January 2014. Archived from the original on 7 జనవరి 2014. Retrieved 25 జనవరి 2014.
  8. "AAP to contest all Lok Sabha seats in Maharashtra: Anjali Damania". 8 January 2014. Archived from the original on 2014-01-14. Retrieved 2014-01-25.
  9. "AAP to contest all 39 Lok Sabha seats in Tamil Nadu". 19 January 2014.
  10. http://www.andhraprabha.com/elections/news-analysis/it-was-a-good-start;-could-have-done-better-in-delhi-kejriwal/17411.html[permanent dead link]
  11. "election result 2022: చన్నీ, ధామీ రాజీనామా.. 16న భగవంత్‌ మాన్‌ సీఎంగా ప్రమాణం." EENADU. Retrieved 2022-03-15.

ఇవికూడా చూడండి

బయటి లింకులు