ఆరోగ్యకరమైన ఆహారం

బీన్స్, ధాన్యాలు, కాలీఫ్లవర్, పాస్తా, బ్రెడ్, నారింజ పండు, టర్కీ, చేపలు, క్యారట్లు, బఠానీలు, ముల్లంగి, టమోటాలు, బంగాళా దుంపలు మొదలైనవి ఆరోగ్యకరమైన ఆహారానికి కొన్ని ఉదాహరణలు[1]

ఆరోగ్యకరమైన ఆహారం అన్ని రకాల పోషకాహార లోపాలను, మధుమేహం, గుండె జబ్బులు, స్ట్రోక్, క్యాన్సర్ వంటి అసాంక్రమిక వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. అనారోగ్యకరమైన ఆహారం, శారీరక నిష్క్రియాత్మకత ప్రపంచ ఆరోగ్యానికి అపాయకరమైనవి.[2] ఆరోగ్యకరమైన ఆహారం అనేది మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకునే లేదా మెరుగుపరిచే ఆహారం. ద్రవ పదార్థాలు, మాంసకృత్తులు వంటి స్థూల పోషకాలు, విటమిన్లు వంటి సూక్ష్మపోషకాలు, తగినంత పీచుతో కూడుకున్న ఆహారం శరీరానికి అవసరమైన పోషకాహారాన్ని అందిస్తుంది.[3][4]

ఆరోగ్యకరమైన ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఉండవచ్చు. ఎక్కువగా ప్రాసెస్ చేయబడిన ఆహారాలు లేదా తీపి పానీయాలు తక్కువగా ఉండవచ్చు. శాకాహారి ఆహారాన్ని అనుసరించే వారికి విటమిన్ B12 అదనంగా అవసరం అయినప్పటికీ, ఆరోగ్యకరమైన ఆహారం కోసం అవసరాలను వివిధ రకాల మొక్కల ఆధారిత, జంతు-ఆధారిత ఆహారాల నుండి తీర్చవచ్చు.[5] వ్యక్తులు ఆరోగ్యంగా ఉండేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలనే దానిపై అవగాహన కల్పించేందుకు వైద్య, ప్రభుత్వ సంస్థలు వివిధ పోషకాహార మార్గదర్శకాలను ప్రచురించాయి. పోషకాహార వాస్తవాల లేబుల్‌లు కొన్ని దేశాల్లో తప్పనిసర. ఆరోగ్యానికి సంబంధించిన భాగాల ఆధారంగా ఆహార పదార్థాలను ఎంచుకోవడానికి వినియోగదారులను అనుమతిస్తాయి.[6][7]

మూలాలు

  1. "Healthy Food Display: Image Details". NCI Visuals Online. National Cancer Institute. 2001-01-01. Archived from the original on 2021-05-06. Retrieved 2021-10-03.
  2. "Healthy diet". www.who.int (in ఇంగ్లీష్). Retrieved 2024-11-16.
  3. Lean, Michael E.J. (2015). "Principles of Human Nutrition". Medicine. 43 (2): 61–65. doi:10.1016/j.mpmed.2014.11.009. S2CID 220865321.
  4. World Health Organization, Food and Agricultural Organization of the United Nations (2004). Vitamin and mineral requirements in human nutrition (PDF) (2. ed.). Geneva: World Health Organization. ISBN 978-92-4-154612-6.
  5. Melina, Vesanto; Craig, Winston; Levin, Susan (December 2016). "Position of the Academy of Nutrition and Dietetics: Vegetarian Diets". Journal of the Academy of Nutrition and Dietetics. 116 (12): 1970–1980. doi:10.1016/j.jand.2016.09.025. PMID 27886704. S2CID 4984228. Archived from the original on 2016-12-02.
  6. "Food information to consumers – legislation". EU. Retrieved 24 November 2017.
  7. "WHO | Promoting fruit and vegetable consumption around the world" (PDF). WHO.