ఇంద్రగంటి శ్రీకాంత శర్మ

ఇంద్రగంటి శ్రీకాంతశర్మ
ఇంద్రగంటి శ్రీకాంతశర్మ
జననంఇంద్రగంటి శ్రీకాంతశర్మ
( 1944-05-29)1944 మే 29
తూర్పుగోదావరి జిల్లా, రామచంద్రాపురం గ్రామం
మరణం2019 జూలై 25(2019-07-25) (వయసు 75)
హైదరాబాద్
ప్రసిద్ధిప్రముఖ కవి, రచయిత,ఆకాశవాణి కళాకారుడు
మతంహిందూ
భార్య / భర్తఇంద్రగంటి జానకీబాల
పిల్లలుఇంద్రగంటి మోహనకృష్ణ
తండ్రిఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి

ఇంద్రగంటి శ్రీకాంత శర్మ తెలుగు కవి.

జీవిత విశేషాలు

తూర్పు గోదావరి జిల్లా, రామచంద్రపురంలో ఇంద్రగంటి శ్రీకాంత శర్మ[1] మే 29 1944 న జన్మించాడు. కవి ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి ఇతని తండ్రి కావడంతో చిన్ననాటి నుండే సాహిత్యవాతావరణంలో పెరిగి విద్యార్థి దశలోనే రచనావ్యాసంగం చేపట్టాడు. తెలుగులో ఎం. ఏ. పట్టభద్రుడై ఆంధ్రజ్యోతి వారపత్రికలో (విజయవాడ) సబ్-ఎడిటర్ గా 1969-76 మధ్య పనిచేశాడు. అభ్యుదయ కవిగా శర్మ పేరొందాడు.

1976లో ఆకాశవాణి విజయవాడ కేంద్రంలొ అసిస్టెంట్ ఎడిటర్ (Scripts) గా శర్మ చేరాడు. తెలుగు ప్రసంగాల శాఖకు ఉషశ్రీకి సహాయకునిగా సంస్కృత కార్యక్రమాలు నిర్వహించాడు. శర్మ వివిధ పత్రికలలో గేయాలు, కవితలు, సాహిత్యవ్యాసాలు వ్రాశాడు. అనేక రేడియో నాటికలు, నాటకాలు, డాక్యుమెంటరీలు, సంగీతరూపకాలు రచించాడు. రేడియో ప్రసంగాలు చేశాడు. 1994లో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా నిజామాబాద్ కేంద్రంలో పనిచేశాడు. 1995లో స్వచ్ఛంద పదవీ విరమణ చేసి ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక సంపాదకులుగా చేరాడు. కృష్ణావతారం (1982), నెలవంక (1983), రావు - గోపాలరావు (1984) మొదలైన చిత్రాలకు గీతరచన చేశాడు.

రచనలు

రచనలన్నీ రెండు సంపుటాలుగా 2014లో వెలువడ్డాయి.[2]

  1. అనుభూతి గీతాలు (కవితాసంకలనం)
  2. శిలామురళి (వచన కావ్యం)
  3. ఏకాంతకోకిల (ఏకాంత కోకిల)
  4. నిశ్శబ్దగమ్యం (కవితాసంకలనం)
  5. పొగడపూలు (గేయాలు)
  6. తూర్పున వాలిన సూర్యుడు (నవల)
  7. క్షణికం (నవల)
  8. సాహిత్యపరిచయం (సాహిత్యవిమర్శ)
  9. ఆలోచన (సాహిత్యవ్యాసాలు)
  10. శ్రీపద పారిజాతం (యక్షగానం)
  11. కిరాతార్జునీయం (యక్షగానం)
  12. శ్రీ ఆండాల్ కల్యాణం (యక్షగానం)
  13. గంగావతరణం (యక్షగానం)
  14. ఆకుపచ్చని కోరికలు (నాటకం)
  15. అవతార సమాప్తి (నాటిక)
  16. మహర్షి ప్రస్థానం (నాటిక)
  17. గాథావాహిని

పురస్కారాలు,సత్కారాలు

  1. 1977లో అనుభూతిగీతాలు కవితాసంపుటికి ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం
  2. 1979లో నూతలపాటి సాహితీపురస్కారం
  3. 1981లో ఆకాశవాణి వార్షిక పోటీలలో అమరామరం డాక్యుమెంటరీకి ప్రథమ బహుమతి
  4. 1981లో ఆకాశవాణి వార్షిక పోటీలలో వర్షానందిని సంగీత రూపకానికి ప్రథమ బహుమతి
  5. 1986లో ఆకాశవాణి వార్షిక పోటీలలో నేనుకాని నేను సృజనాత్మక రూపకానికి ప్రథమ బహుమతి
  6. 1988లో ఆకాశవాణి వార్షిక పోటీలలో మాటా - మౌనం సంగీత రూపకానికి ప్రథమ బహుమతి
  7. 1988లో ఆకాశవాణి వార్షిక పోటీలలో నిశ్శబ్దగమ్యానికి ద్వితీయబహుమతి
  8. 1990లో ఆకాశవాణి వార్షిక పోటీలలో మెట్లకు ద్వితీయబహుమతి

మూలాలు

  1. పాతికేళ్ళ ఫ్రీవర్స్ ఫ్రంట్ బహుమతులు కరపుస్తకం నుండి
  2. "శ్రీకాంత శర్మ సాహితీ సర్వస్వం/ రెండు సంపుటాలు". Archived from the original on 2016-07-11.

ఇతర లింకులు