ఇనుప యుగం
రాతియుగం (పాలియోలిథికు, మెసోలిథికు, నియోలిథికు, చాల్‌కోలిథికు), కాంస్య యుగం తరువాత ఇనుపయుగానికి ప్రారంభం అయింది. ఈ యుగం అధికంగా ఐరోపా, ప్రాచీన నియరు ఈస్టు వంటి పురాతన ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు వర్తించబడింది.
ఇనుప యుగం వ్యవధి ప్రాంతాన్ని అనుసరించి మారుతుందని పురావస్తు సమావేశాలలో నిర్వచించబడింది. ఇనుప యుగం సంస్కృతిని సూచించడానికి జ్యోతిష ఆధారాలు, ఇనుప ఉపకరణాలు ఉండడం సరిపోదు. కంచు వస్తువుల కంటే విస్తృతంగా ఇనుము లేదా ఉక్కు ఉపకరణాలు, ఆయుధాలు ఉపయోగించినట్లు ఆధారాలు లభించిన ప్రాంతంలో స్థానికంగా "ఇనుప యుగం" ప్రారంభం అయిందని భావించబడుతుంది.[1] ఉదాహరణకు " టుతంఖామును ఇనుప బాకు " కాంస్య యుగానికి చెందినదని భావించబడుతుంది. క్రీ.పూ 12 వ శతాబ్దంలో పురాతన నియర్ ఈస్టులో సంభవించిన ఈ పరివర్తన కాంస్య యుగం పతనం అని భావించబడుతుంది. ఈ సాంకేతికత మధ్యధరా బేసిను ప్రాంతం, దక్షిణ ఆసియా వరకు వేగంగా వ్యాపించింది.
ఇది మధ్య ఆసియా, తూర్పు ఐరోపా, మధ్య ఐరోపాకు మరింత విస్తరించడం కొంత ఆలస్యంగా జరిగింది. క్రీ.పూ 500 నాటికి ఉత్తర ఐరోపా చేరుకుంది.
నమోదిత చరిత్రకాలం ప్రారంభంతో ఇనుప యుగం ముగిసింది. సాధారణంగా వ్రాతపూర్వ పురావస్తు ఆధారాలలో రెండింటి మద్య స్పష్టమైన విరామం ఉన్నట్లు సూచించదు. ప్రాచీన నియర్ ఈస్టు అచెమెనిదు సామ్రాజ్యం స్థాపన c. క్రీ.పూ. 550 (హెరోడోటసు నమోదుచేసిన ఆధారాలు చారిత్రాత్మకంగా పరిగణించబడుతుంది) రెండింటినీ విభజించే తేదీగా తీసుకోబడుతుంది. మధ్య, పశ్చిమ ఐరోపాలో క్రీస్తుపూర్వం మొదటి శతాబ్దంలో రోమను విజయాలు ఇనుప యుగం ముగింపుకు గుర్తుగా పనిచేస్తాయి. స్కాండినేవియా, జర్మనీ ఇనుప యుగం c. సా.శ. 800 లో వైకింగు యుగంతో ప్రారంభం ఔతుంది.
దక్షిణ ఆసియాలో ఇనుప యుగంలో ఇనుప పనిచేయబడిన పెయింటెడు గ్రే వేరు సంస్కృతితో ప్రారంభించబడి అశోకచక్రవర్తి (క్రీ.పూ. 3 వ శతాబ్దం) పాలనతో ముగుస్తుంది. దక్షిణ, తూర్పు, ఆగ్నేయాసియా పురావస్తు శాస్త్రంలో "ఇనుప యుగం" పశ్చిమ యురేషియా కంటే చాలా కాలం తరువాత ప్రాంరంభం అయింది. చైనాలో ఇనుము ఉపకరణాల ఉపయోగం రాకముందే కనీసం చైనాలో చరిత్రపూర్వ కాలం ముగిసింది. కనుక ఈ పదాన్ని చాలా అరుదుగా ఉపయోగిస్తారు. సహెలు (సుడాను ప్రాంతం), ఉప-సహారా ఆఫ్రికా ఈ మూడు-యుగ వ్యవస్థలకు వెలుపల ఉన్నాయి. అక్కడ కాంస్య యుగం లేదు, కానీ "ఇనుప యుగం" అనే పదాన్ని కొన్నిసార్లు నైజీరియా నోకు సంస్కృతిలో ఇనుప ఉపకరణాలను ఉపయోగించిన ప్రారంభ సంస్కృతుల గురించి సూచించబడింది.
చరిత్ర
19 వ శతాబ్దం మొదటి భాగంలో ఐరోపా పురావస్తు శాస్త్రంలో మూడు-యుగాల వ్యవస్థ ప్రవేశపెట్టబడింది. 19 వ శతాబ్దం తరువాత పురాతన నియరు ఈస్టు పురావస్తు శాస్త్రానికి ఇది విస్తరించబడింది. దీని పేరు తిరిగి హేసియోడు పౌరాణిక "యుగపురుషుడు"కి ఇవ్వబడింది. దీనిని 1830 లలో " క్రిస్టియను జుర్గెన్సెన్ థామ్సెన్ " స్కాండినేవియా పురావస్తు యుగంగా ప్రవేశపెట్టారు. 1860 ల నాటికి ఇది "మానవజాతి తొలి చరిత్ర" విభాగంగా స్వీకరించబడింది.[2] తరువాత ఇది అస్సిరియాలజీలో ఉపయోగించడం ప్రారంభమైంది. పురాతన నియరు ఈస్టు పురావస్తు శాస్త్రంలో ఇది 1920 - 1930 వరకు అభివృద్ధి చేయబడింది.[3] దాని పేరులో సూచించినట్లుగా ఇనుప యుగం సాంకేతిక పరిజ్ఞానం ఫెర్రసు మెటలర్జీ (ఇనుము ఉపకరణాలు) సాధనాలు, ఆయుధాల ఉత్పత్తి చేయబడిన కాలంగా వర్గీకరించబడుతుంది.
కాలనిర్ణయం
|
పురాతన నియరు ఈస్టు, ప్రాచీన భారతదేశం (ఋగ్వేద వేద నాగరికత), పురాతన ఇరాను, పురాతన గ్రీసు (గ్రీకు చీకటి యుగాలు) ప్రాంతాలలో కాంస్య యుగం పతనం తరువాత ఐరోపాలో ఇనుప యుగం అభివృద్ధి చెందినదని భావిస్తున్నారు. మధ్య ఐరోపాలో క్రీస్తుపూర్వం 8 వ శతాబ్దంలో, ఉత్తర ఐరోపాలో 6 వ శతాబ్దం ఇనుపయుగం ప్రారంభమైంది. నియరు ఈస్టు ఇనుప యుగం మొదటి ఇనుపయుగం, రెండవ ఇనుపయుగం అనే రెండు ఉపవిభాగాలుగా విభజించబడింది. కాంస్య యుగం ముగింపులో మొదటి ఇనుపయుగం (క్రీ.పూ. 1200-1000) మొదలైంది. మొత్తం ప్రాంతంలో క్రీ.పూ 13 - 12 వ శతాబ్దాల మధ్య కచ్చితమైన సాంస్కృతిక విరామం లేదు. అయినప్పటికీ కొండ దేశం, ట్రాంసుజోర్డాను తీరప్రాంతంలో కొన్ని కొత్త లక్షణాలు కలిగిన అరామియా, సీ పీపులు (సముద్ర ప్రజలు) సమూహాల ఉనికిని సూచిస్తుంది. ఈ ప్రాంతాలలో కాంస్య యుగ సంస్కృతి కొనసాగింపు జరిగినట్లు బలమైన ఆధారాలు ఉన్నాయి. 2 వ సహస్రాబ్ది చివరి నుండి మొదటి ఇనుపయుగం లోకి ప్రవేశించే సమయంలో సంస్కృతి మరింత భిన్నంగా మారడం ప్రారంభం అయింది.
ఇనుప యుగం ఒక పురావస్తు కాలంగా నిర్వచించబడింది. ఈ సమయం చరిత్ర పూర్వకాలంగా భావించబడింది. ఫెర్రసు లోహశాస్త్ర సంబంధిత లోహపు పని ప్రధాన సాంకేతికతగా అభివృద్ధి చెందింది.
ఇనుప యుగం సంస్కృతిలో ఉక్కుతో తయారు చేసిన సాధనాలు, ఆయుధాల భారీ ఉత్పత్తి మొదలైన అంశాలు అధికంగా ఉంటాయి. మిశ్రిత లోహాలలో సాధారణంగా కార్బను అంశాలు కలిగిన మిశ్రమాల బరువు సుమారు 0.30%, 1.2% మధ్య ఉంటాయి.[ఆధారం చూపాలి]మిశ్రితలోహం సాంకేతికత అభివృద్ధి చేయబడిన ఫలితంగా కాంస్యంతో సమానమైన ఉన్నతమైన సాధనాలు, ఆయుధాలు ఉత్పత్తి చేయడం సాధ్యమైంది. ఆర్థికవిధానం లోహనాణ్యత పురోగతి ఉక్కు వాడకం మీద ఆధారపడింది. ప్రారంభ ఉక్కును ఇనుము కరిగించడం ద్వారా తయారు చేశారు.
ప్రాచీన నియరు ఈస్టులో క్రీ.పూ 1200 (కాంస్య యుగం పతనం) ఇనుప యుగం ప్రారంభం అయింది. సి. క్రీ.పూ. 550 (క్రీ.పూ. 539), హెరోడోటసు నమోదిత చరిత్ర ప్రారంభంతో చరిత్రపూర్వకాలం ముగింపుకు వచ్చింది. ఇనుప యుగం మధ్య, పశ్చిమ ఐరోపాలో క్రీ.పూ. 800, ఉత్తర ఐరోపాలో c.క్రీ.పూ. 500 - సా.శ. 800 వరకు ఉంది.
చైనాలో, ఇనుప పని ద్వారా గుర్తించదగిన చరిత్రపూర్వ కాలం లేదు. ఎందుకంటే కాంస్య యుగం నుండి చైనా నేరుగా ఇంపీరియలు చైనా క్విను రాజవంశంలోకి మారింది; చైనా సందర్భంలో "ఇనుప యుగం" కొన్నిసార్లు పరివర్తన కాలంగా ఉపయోగించబడింది. క్రీ.పూ. 500 - క్రీ.పూ. 100 వరకు ఫెర్రసు లోహశాస్త్రం (ఆధిపత్యం లేకపోయినా) అభివృద్ధి చేయబడింది.
మూలాలు
- ↑ Milisauskas, Sarunas (ed), European Prehistory: A Survey, 2002, Springer, ISBN 0306467933, 9780306467936, google books
- ↑ (Karl von Rotteck, Karl Theodor Welcker, Das Staats-Lexikon (1864), p. 774
- ↑ Oriental Institute Communications, Issues 13–19, Oriental Institute of the University of Chicago, 1922, p. 55.