ఇరుసు

రైలు చక్రాలు ఒక సరళ ఇరుసుకు అతికించబడి ఉంటాయి, అందువలన రెండు చక్రాలు ఒకేతీరున తిరుగుతాయి. దీనిని వీల్ సెట్ (జంట చక్రం) అంటారు.

ఇరుసు అనగా ఒక కేంద్ర షాఫ్ట్, ఇది చక్రం లేదా గేరు భ్రమణం కొరకు అమర్చబడుతుంది. చక్రాలు కలిగిన వాహన చక్రాలకు ఇరుసు బిగించబడి ఉంటుంది, బేరింగ్ వ్యవస్థ లేని ఇరుసు చక్రంతో పాటు తిరుగుతుంది, బేరింగు వ్యవస్థ ఉన్న ఇరుసు చుట్టూ చక్రం భ్రమణం చెందుతుంది. బేరింగు వ్యవస్థ ఉన్న చక్రంలో బేరింగ్లు లేదా బుషింగ్లు ఇరుసుకు అధిక తోడ్పాటునందిస్తాయి. కొన్ని సందర్భాలలో బేరింగ్ లేదా బుషింగ్ చక్రం లోపలి రంధ్రంలో అమర్చబడివుంటుంది, దీని యందు చక్రం లేదా గేర్ ఇరుసు చుట్టూ భ్రమణం చెందుతుంది. కొన్నిసార్లు, ముఖ్యంగా సైకిళ్లలో వాడే మరొక రకపు ఇరుసును స్పిండిల్ గా సూచిస్తారు.