ఉజ్జయిని జిల్లా

ఉజ్జయిని జిల్లా
మహకల్ దేవాలయం, ఉజ్జయిని
మహకల్ దేవాలయం, ఉజ్జయిని
మధ్య ప్రదేశ్ పటంలో జిల్లా స్థానం
మధ్య ప్రదేశ్ పటంలో జిల్లా స్థానం
దేశంభారతదేసం
రాష్ట్రంమధ్య ప్రదేశ్
డివిజనుఉజ్జయిని
ముఖ్యపట్టణంఉజ్జయిని
విస్తీర్ణం
 • మొత్తం6,091 కి.మీ2 (2,352 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం19,86,864
 • జనసాంద్రత330/కి.మీ2 (840/చ. మై.)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత73.55%
Time zoneUTC+05:30 (IST)
Websitehttp://ujjain.nic.in

ఉజ్జయిని జిల్లా మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాల్లో ఒకటి. చారిత్రిక నగరం ఉజ్జయిని, ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. కర్కట రేఖ ఉజ్జయిని గుండా వెళుతుంది. జిల్లా విస్తీర్ణం 6,091 చ.కి.మీ.  2011 లో జనాభా 19,86,864, 2001 లో 17,10,982 గా ఉన్న జనాభా దశాబ్ద కాలంలో 16.12% పెరిగింది.

జనాభా

చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±%
19012,95,312—    
19113,40,132+15.2%
19213,37,554−0.8%
19313,96,894+17.6%
19414,54,370+14.5%
19515,43,325+19.6%
19616,61,720+21.8%
19718,62,516+30.3%
198111,17,002+29.5%
199113,83,086+23.8%
200117,10,982+23.7%
201119,86,864+16.1%

2011 జనాభా లెక్కల ప్రకారం ఉజ్జయిని జిల్లా జనాభా 19,86,864. [1] ఇది స్లోవేనియా దేశానికి [2] లేదా యుఎస్ రాష్ట్రమైన న్యూ మెక్సికోకు సమానం. [3] జనాభా పరంగా ఇది భారతదేశ జిల్లాల్లో 233 వ స్థానంలో ఉంది. జిల్లాలో జనసాంద్రత 326. 2001-2011 దశాబ్దంలో దాని జనాభా వృద్ధి రేటు 16.11%. ఉజ్జయినీ జిల్లాలో లింగ నిష్పత్తి 954. అక్షరాస్యత రేటు 73,55%.

2011 జనగణన ప్రకారం, జిల్లా జనాభాలో 95,21% మంది హిందీ మాట్లాడేవారు. 2.83% మంది ఉర్దూ, 0.58% గుజరాతీ, 0.56% మరాఠీ0.40% సింధీ మాట్లేడ్వారు ఉన్నారు. [4]

భౌగోళికం

ఈ జిల్లాకు ఈశాన్యాన, తూర్పున షాజాపూర్, ఆగ్నేయంలో దేవాస్, దక్షిణాన ఇండోర్, నైరుతి దిశలో ధార్, పశ్చిమ, వాయువ్య దిశల్లో రత్లాం జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. ఈ జిల్లా ఉజ్జయిని డివిజన్‌లో భాగం.

నదులు, సరస్సులు

చంబల్ నదికి ఉపనది అయిన షిప్రా నది జిల్లాలో ప్రధానమైన నది. ఇతర నదులలో గంభీర్ నది, కాహ్న్ నది ఉన్నాయి. ఈ రెండూ షిప్రాకు ఉపనదులు

వివిధ విభాగాలు

2008 లో పార్లమెంటరీ, శాసనసభ నియోజకవర్గాల డీలిమిటేషన్ తరువాత, ఈ జిల్లాలో ఎనిమిది శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి: నాగడ-ఖాక్రోడ్, మహీద్పూర్, తరానా, ఘాటియా, ఉజ్జయిని దక్షిణ, ఉజ్జయిని ఉత్తర, బద్నగర్. [5] జిల్లా లోని లోక్‌సభ నియోజకవర్గం ఉజ్జయిని.

మూలాలు

  1. "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Slovenia 2,000,092 July 2011 est.
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. New Mexico - 2,059,179
  4. 2011 Census of India, Population By Mother Tongue
  5. "Parliamentary & Assembly Constituency-Wise Report of Electors in the Final Roll-2009" (PDF). Archived from the original (PDF) on 2011-07-21. Retrieved 2021-01-10.