ఉపాధ్యాయ విద్య
ఉపాధ్యాయ విద్య లేదా ఉపాధ్యాయ శిక్షణ అనేది తరగతి గది, పాఠశాల, విస్తృత సమాజంలో తమ విధులను సమర్థవంతంగా నిర్వహించడానికి కాబోయే ఉపాధ్యాయులకు (ఛాత్రోపాధ్యాయులకు) అవసరమైన జ్ఞానం, వైఖరులు, ప్రవర్తనలు, నైపుణ్యాలను సన్నద్ధం చేయడానికి రూపొందించిన విధానాలు, నిబంధనలను సూచిస్తుంది. ఛాత్రోపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడంలో నిమగ్నమైన నిపుణులను ఉపాధ్యాయ ఉపాధ్యాయులు (లేదా కొన్ని సందర్భాల్లో ఉపాధ్యాయ శిక్షకులు) అంటారు.[1]
ఉపాధ్యాయ విద్యను వృత్యంతర ఉపాధ్యాయ శిక్షణగా, వృత్తిపూర్వ ఉపాధ్యాయ శిక్షణగా విభజించారు.
తెలుగు రాష్ట్రాల్లో
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఉపాధ్యాయ విద్యను అందించడానికి అనేక ప్రభుత్వ, ప్రవేటు విద్యాలయాలు ఉన్నాయి. ప్రభుత్వాలు జిల్లా విద్యా శిక్షణా సంస్థ (డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రేనింగ్ (DIET)) పేరుతో ప్రతి జిల్లాకు ఒక ఉపాధ్యాయ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేశాయి.
వివిధ కోర్సులు
డిఎల్ఎడ్
ఇంటర్మీడియట్ అర్హతతో డైట్ సెట్ ఎంట్రన్స్ పరీక్ష ద్వారా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డి ఎల్ ఎడ్) కోర్సులో అడ్మిషన్ పొందవచ్చు. ఇది ఎలిమెంటరీ స్థాయి విద్యార్థుల బోధనకు కావాల్సిన శిక్షణను అందిస్తుంది.
బిఎడ్
డిగ్రీ అర్హతతో ఎడ్ సెట్ ఎంట్రన్స్ పరీక్ష ద్వారా బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) కోర్సులో అడ్మిషన్ పొందవచ్చు. ఇది ఉన్నత స్థాయి విద్యార్థుల బోధనకు కావాల్సిన శిక్షణను అందిస్తుంది.
ఎంఎడ్
డిగ్రీ, బీఎడ్ అర్హతతో మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఎం ఎడ్) కోర్సులో అడ్మిషన్ పొందవచ్చు. ఇది ఉన్నత స్థాయి విద్యార్థులకు, డీఎడ్, బిఎడ్ విద్యార్థుల బోధనకు కావాల్సిన శిక్షణను అందిస్తుంది.
సిలబస్
మనోవిజ్ఞానశాస్త్రం, తత్వశాస్త్రం, వివిధ బోధనా పద్ధతులు, ఆయా సబ్జెక్టులకు చెందిన లోతైన విషయాలు ఉపాధ్యాయ విద్య సిలబస్ లో ఉంటాయి.
బోధనా అభ్యాసం
ఉపాధ్యాయ శిక్షణలో భాగంగా ఛాత్రోపాధ్యాయులు వివిధ పాఠశాలలు లేదా కళాశాలకు వెళ్లి భోధనాభ్యాసం చేస్తారు. ఈ ప్రక్రియను టీచింగ్ ప్రాక్టీస్ అంటారు.
మూలాలు
- ↑ see for example Cecil H. Allen, In-Service Training of Teachers in Review of Educational Research. 1940; 10: 210–215. In the UK, however, the term 'teacher training' is still in general use: see for instance the UK government's information on tda.gov.uk Archived 2011-04-04 at the Wayback Machine