ఎంతవరకు ఈ ప్రేమ
ఎంతవరకు ఈ ప్రేమ | |
---|---|
దర్శకత్వం | డీకే |
నిర్మాత | డి. వెంకటేష్ |
తారాగణం | జీవా కాజల్ అగర్వాల్ బాబీ సింహ |
ఛాయాగ్రహణం | అబినందన్ రామానుజన్ |
కూర్పు | టి.ఎస్.సురేష్ |
సంగీతం | లియోన్ జేమ్స్ |
నిర్మాణ సంస్థ | డి.వి క్రియేషన్స్ |
విడుదల తేదీ | 7 ఏప్రిల్ 2017 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఎంతవరకు ఈ ప్రేమ 2017లో విడుదలైన తెలుగు సినిమా. తమిళంలో 2016లో 'కావలై వెండం' పేరుతో విడుదలైన ఈ సినిమాను తెలుగులో డి.వి క్రియేషన్స్ బ్యానర్‌పై డి. వెంకటేష్ డబ్బింగ్ చేసి విడుదల చేశాడు. జీవా, కాజల్ అగర్వాల్, బాబీ సింహ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 7 ఏప్రిల్ 2017న విడుదలైంది.[1]
కథ
అరవింద్(జీవా), దివ్య (కాజల్) ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. పెళ్లి తర్వాత ఓ చిన్న గొడవ కారణంగా ఇద్దరూ విడిపోతారు. దివ్య తల్లి (రాశి) దివ్యకు ఫారిన్ నుండి వచ్చిన అర్జున్ (బాబీ సింహా)తో పెళ్లి చేయాలని అనుకుంటుంది, దివ్య దీనికి ఒప్పుకుంటుంది. ఈ పెళ్లి జరుగాలంటే అరవింద్ నుండి దివ్య విడాకులు కావాలి. ఈ క్రమంలో విడాకుల పేపర్లపై సంతకం పెట్టించుకోవాలని దివ్య అరవింద్ వద్దకు వెలుతుంది. కానీ అరవుండ్ మాత్రం విడాకులు ఇవ్వాలంటే ఒక కండిషన్ పెడతాడు. ఆ కండిషన్ ఏంటి ? చివరికి దివ్యకు అరవింద్ విడాకులిచ్చాడా ? లేదా అనేదే మిగతా సినిమా కథ.[2]
నటీనటులు
- జీవా
- కాజల్ అగర్వాల్
- రాశి
- బాబీ సింహ
- శృతి రామకృష్ణన్
- సునయన
- మంత్ర
- జంగిరి మధుమిత
- మయిల్సామి
సాంకేతిక నిపుణులు
- బ్యానర్: డి.వి క్రియేషన్స్
- నిర్మాత: డి. వెంకటేష్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: డీకే
- సంగీతం: లియోన్ జేమ్స్
- సినిమాటోగ్రఫీ:
- ఎడిటింగ్: టి.ఎస్.సురేష్
మూలాలు
- ↑ Filmy Focus (5 April 2017). "ఈనెల 7న జీవా- కాజల్ `ఎంతవరకు ఈ ప్రేమ` FilmyFocus". Archived from the original on 21 November 2021. Retrieved 21 November 2021.
- ↑ The Times of India (7 April 2017). "Enthavaraku E Prema Review {2.5/5}: The movie pasess off as a non-exciting one-time watch this weekend". Archived from the original on 21 November 2021. Retrieved 21 November 2021.