ఎస్. సోమనాథ్
ఎస్. సోమనాథ్ | |
---|---|
ఛైర్మన్, భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ | |
Incumbent | |
Assumed office 15 జనవరి 2022 | |
అంతకు ముందు వారు | శివన్ |
వ్యక్తిగత వివరాలు | |
చదువు | ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ |
ఎస్. సోమనాథ్ ఒక భారతీయ ఏరోస్పేస్ ఇంజనీర్, రాకెట్ సాంకేతిక నిపుణుడు. జనవరి 2022లో, కె. శివన్ తర్వాత భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఛైర్మన్‌గా ఎంపికయ్యాడు. లాంచ్ వెహికల్ సిస్టమ్స్ ఇంజినీరింగ్, స్ట్రక్చరల్ డిజైన్, స్ట్రక్చరల్ డైనమిక్స్, పైరోటెక్నిక్‌ల రంగాలలో అతని కృషికి మంచి పేరు వచ్చింది. అతను కమ్యూనికేషన్ ఉపగ్రహాల కోసం GSAT-MKII (F09), రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాల కోసం GSAT-6A, PSLV-C41 ప్రయోగ వాహనాలను చేయడంపై కృషి చేశాడు.
విద్య, వృత్తి
సోమనాథ్ ఎర్నాకులంలోని మహారాజా కళాశాలలో తన ప్రీ డిగ్రీ ప్రోగ్రామ్‌ను, TKM కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, క్విలాన్, కేరళ యూనివర్శిటీ నుండి గ్రాడ్యుయేట్ డిగ్రీని, బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుండి ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీని డైనమిక్స్,కంట్రోల్‌లో స్పెషలైజేషన్‌తో పొందాడు.
సోమనాథ్ 1985లో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్‌లో చేరాడు. అతను పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV) ప్రాజెక్ట్ తొలిదశలో పనిచేశాడు. 2010లో GSLV Mk-III లాంచ్ వెహికల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అయ్యాడు. అతను నవంబర్ 2014 వరకు ప్రొపల్షన్,స్పేస్ ఆర్డినెన్స్ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ గా వున్నాడు [1] జూన్ 2015లో, తిరువనంతపురంలోని వలియమలలోని లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ (LPSC) డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించాడు.[2] తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) డైరెక్టర్‌గా జనవరి 2018 లో VSSC డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించాడు. [3]
2022 జనవరి 15 నాడు భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ అధ్యక్షుడిగా నియమించబడ్డాడు. [4]
మూలాలు
- ↑ "New Directors for Three Major ISRO Centres: Three major ISRO Centres have new Directors from today". www.isro.gov.in. 1 June 2015. Archived from the original on 23 జనవరి 2018. Retrieved 22 January 2018.
- ↑ "Somanath takes charge as VSSC director". www.business-standard.com. 22 January 2018. Retrieved 22 January 2018.
- ↑ "Somanath takes charge as VSSC director". www.indiatoday.in. 22 January 2018. Retrieved 22 January 2018.
- ↑ "ఇస్రో కొత్త ఛైర్మన్‌గా రాకెట్ సైంటిస్ట్ సోమనాథ్". సమయం. 2022-01-13. Retrieved 2022-01-18.