ఐతరేయ బ్రాహ్మణం (సంస్కృతం: ऐतरेय ब्राह्मण) బ్రాహ్మణాలలో ఒకటి. ఇది ఋగ్వేద శాఖకి చెందినది. ఈ బ్రాహ్మణం సంప్రదాయం ప్రకారం మహీదాస ఐతరేయుడు నకు సంబంధించింది.[1][2]
బ్రాహ్మణాలు నిర్వచనము
బ్రాహ్మణాలు, లో పురాణాలు, తత్వశాస్త్రం, వేదాల ఆచారాలు గురించి వ్యాఖ్యానాలు ఉంటాయి. వేదసంహితలు తదుపరి మహోన్నత స్థానం బ్రాహ్మణాలు కలిగి ఉన్నాయి. ఇవి వేదాలలోని అంతర్భాము. చతుర్వేదాలలోని సంహిత (శ్లోక, మంత్ర) భాగములకు బ్రహ్మ పదాన్ని, వ్యాఖ్యాన రూపంగా ఉన్నదానికి బ్రాహ్మణం అని చెప్పబడు తున్నది. ఈ నాలుగు వేదాలలో గల మంత్రాలను, ఎక్కడెక్కడ, ఏఏ యజ్ఞములకు ఈ మంత్రాలను ఎలా వినియోగించాలి, ఆయా వాటిని అవసరమైన చోట వ్యాఖ్యానిస్తూ ఉన్నటువంటి గ్రంథాలకు బ్రాహ్మణాలు అని అంటారు. బ్రాహ్మణాల గ్రంథాలందు సంహితలలోని శ్లోకాల నిగూఢ అర్థాన్ని చెబుతూ అనేక వివరణలతో పాటుగా, ఉపాఖ్యానలు కూడా తెలియజేస్తాయి.[3]
ఐతరేయ మహర్షి (ఐతరేయుడు) చరిత్ర
ఐతరేయము అనగా ఇతరము అని అర్ధము. పూర్వము ఎంతో మంది భార్యలు కలిగి ఉన్న కాత్యాయనుడికి "'ఇతర"' అనే పేరు గల భార్య ( మొదటి భార్య కాదు) కూడా ఉంది. వీరిద్దరి కుమారుడు మహీదాస ఐతరేయుడు.
విభాగము
ఐతరేయ బ్రాహ్మణంలో 40 అధ్యాయాలు ఉన్నాయి. ఈ అధ్యాయాలు తిరిగి ఖండాలు గా విభజింపబడ్డాయి. ఐదు అధ్యాయాలను పంచిక అని అంటారు. ఈ బ్రాహ్మణం ఎనిమిది పంచికలుగా విభజింపబడింది. ఈ క్రింద సూచించిన పట్టిక ద్వారా వాటికి సంబంధించిన విషయాలను తెలియజేస్తుంది.[4]
అష్టక విభాగం
సంచికలు
అధ్యాయాలు
ఖండాలు
సంచికలు
అధ్యాయాలు
ఖండాలు
I
1
6
V
21
5
2
5
22
10
3
6
23
4
4
9
24
6
5
4
25
9
మొత్తం:
30
మొత్తం:
34
II
6
10
VI
26
3
7
8
27
5
8
6
28
8
9
8
29
10
10
9
30
10
మొత్తం:
41
మొత్తం:
36
III
11
11
VII
31
1
12
13
32
11
13
14
33
6
14
6
34
8
15
6
35
8
మొత్తం:
50
మొత్తం:
34
IV
16
6
VIII
36
4
17
8
37
7
18
8
38
3
19
6
39
9
20
4
40
5
మొత్తం:
32
మొత్తం:
28
మొత్తం ఖండాలు
153 +
మొత్తం ఖండాలు
132 = 285
బ్రాహ్మణాలు (ఋక్సంహిత)
సంహిత యొక్క ప్రతి ప్రధాన శాఖకు ఒక బ్రాహ్మణం ఉండాలి/ఉండేది.
ఋక్సంహితకు 21 శాఖలు ఉన్నట్లుగా తెలియుచున్నది. ఆ విధముగా 21 బ్రాహ్మణాలు తప్పకుండా ఉండాలి.
ఋగ్వేదానికి కౌషీతకి బ్రాహ్మణం, ఐతరేయ బ్రాహ్మణం, అశ్వలాయన బ్రాహ్మణం గాలవ బ్రాహ్మణం బహ్వృచ బ్రాహ్మణం పైంగి బ్రాహ్మణం అని ఆరు బ్రాహ్మణములు మాత్రమే దృశ్యించినారని తెలుస్తున్నది.
ఈ ఆరింటిలోనూ, ప్రస్తుతము ఐతరేయ బ్రాహ్మణం, కౌషీతకి బ్రాహ్మణం అను రెండు బ్రాహ్మణములు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మిగతావన్నీ చరిత్రలో కలసి పోయి నామమాత్రంగానే మిగిలిపోయాయి.
ఐతరేయ బ్రాహ్మణాన్ని బహ్వృచ బ్రాహ్మణం అని కూడా కొందరి వాదన, అభిప్రాయము ఉంది.[3]