ఒటో వాన్ బిస్మార్క్
ఒటో ఎడ్వార్డ్ లియోపాల్డ్, బిస్మార్క్ రాకుమారుడు, లాయెన్ బర్గ్ డ్యూక్ (1 ఏప్రిల్ 1815 – 30 జూలై 1898), ఒటో వాన్ బిస్మార్క్గా ప్రసిద్ధుడైన (German: [ˈɔtoː fɔn ˈbɪsmark] ( listen)German: [ˈɔtoː fɔn ˈbɪsmark] ( listen)), 1860ల నుంచి 1890ల వరకూ జర్మనీ, యూరప్ ల రాజకీయ వ్యవహారాల్లో ఆధిపత్యం వహించిన సంప్రదాయ ప్రష్యన్ రాజనీతివేత్త, 1871 నుంచి 1890 వరకూ పనిచేసిన తొలి జర్మన్ సామ్రాజ్య ఛాన్సలర్.
1862లో ప్రష్యన్ రాజు విల్ హెల్మ్ I ప్రష్యా మినిస్టర్ ప్రెసిడెంట్ గా బిస్మార్క్ ను నియమించాడు, ఆ పదవిలో 1873లో కొద్దికాలం విరామాన్ని మినహాయించి 1890 వరకూ బిస్మార్క్ కొనసాగాడు. డెన్మార్క్, ఆస్ట్రియా, ఫ్రాన్స్ లతో మూడు చిన్న, నిర్ణయాత్మకమైన యుద్ధాలకు కారణమయ్యాడు. ఆస్ట్రియాపై సాధించిన విజయం అనంతరం పలు జాతులతో కూడిన జర్మన్ కాన్ఫెడరేషన్ ను రద్దుచేసి, బదులుగా తొలి జర్మన్ జాతీయ రాజ్యంగా ఉత్తర జర్మన్ సమాఖ్యను 1867లో ఏర్పాటుచేసి దానికి ఫెడరల్ ఛాన్సలర్ గా నాయకత్వం వహించాడు. ఈ పరిణామం ప్రష్యా వెనుక చిన్న ఉత్తర జర్మన్ రాజ్యాలు కూడేలా చేసింది. తర్వాత కాన్ఫడరేషన్ ఫ్రాన్స్ ఓటమి తర్వాత స్వతంత్ర దక్షిణ జర్మన్ రాజ్యాల మద్దతుతో 1871లో జర్మనీని ఏకీకరించి జర్మన్ సామ్రాజ్యాన్ని ఏర్పరిచి దానికి తొలి ఇంపీరియల్ ఛాన్సలర్ గా వ్యవహరించారు. అదే సమయంలో ప్రష్యా మీద ఆధిపత్యాన్ని కొనసాగించాడు. కొత్త జర్మన్ జాతి ప్రష్యా ఆధిపత్యం నిలబడడానికి ప్రధాన ప్రత్యర్థి ఆస్ట్రియాను చేర్చలేదు.
1871 నాటికి దీన్ని సాధించాకా, అనేక వివాదాలు, యుద్ధాలు ఉన్నా వీలైనంత శాంతితో అధికార సమతుల్యత దౌత్యంతో ఐరోపాలో జర్మనీ స్థానాన్ని నిలబెడుతూ వచ్చారు. చరిత్రకారుడు ఎరిక్ హాబ్స్ బామ్ "బహుపాక్షిక దౌత్య చదరంగం ఆటలో 1871 నుంచి ఇరవై ఏళ్ళపాటు నిస్సందేహంగా ప్రపంచ ఛాంపియన్ గా నిలిచి, విజయవంతంగా అధికార కేంద్రాల నడుమ శాంతిని నిలబెట్టింది" బిస్మార్కే.[1] అయితే బిస్మార్క్ అల్సేక్-లారైన్ ను ఆక్రమించడంతో ఫ్రెంచ్ జాతీయవాదానికి ఊపిరిపోసింది, అలానే ఫ్రాన్సులో జర్మనోఫోబియాకు కూడా కారణమైంది.[2] ఇది మొదటి ప్రపంచ యుద్ధానికి రంగం సిద్ధం చేసింది.
- ↑ Eric Hobsbawm, The Age of Empire: 1875–1914 (1987), p. 312.
- ↑ Hopel, Thomas (23 August 2012) "The French-German Borderlands: Borderlands and Nation-Building in the 19th and 20th Centuries"