కస్తూరి

మోస్కస్ మోస్కిఫెరస్, సైబీరియా కస్తూరి జింక

కస్తూరి, మగ కస్తూరి జింక యొక్క ఉదరము, పురుషాంగాల మధ్యన ఉండే ఒక ప్రత్యేక గ్రంధి నుండి వెలువడే తీవ్రమైన పరిమళము. ప్రాచీన కాలము నుండి దీనిని ప్రసిద్ధ సుగంధ పరిమళముగా ఉపయోగిస్తున్నారు. అత్యంత ఖరీదైన జంతు ఉత్పత్తులలో కస్తూరి ఒకటి. [1] కస్తూరికి ఆంగ్ల నామమైన మస్క్ సంస్కృత పదమైన ముష్క (వృషణాలు) నుండి ఉద్భవించింది [2]

ప్రస్తుతం ఇతర సంబంధిత పరిమళాలను కూడా కస్తూరి అనే పిలుస్తారు. అయితే ఇలాంటివి చాలా అసలైన కస్తూరి కంటే భిన్నమైన రసాయన పదార్ధాలనుండి ఉత్పనమై ఉండవచ్చు కూడా. కస్తూరి జింక కాకుండా ఇతర జంతువుల యొక్క గ్రంధి స్రావకాలు, కస్తూరిని పోలిన పరిమళాన్ని వెదజల్లే అనేక మొక్కల యొక్క స్రావకాలు, ఈ వాసన కలిగిన కృత్తిమ పదార్ధాలను కూడా కస్తూరి అనే ఒకే గాటిన కట్టడం పరిపాటే.

19వ శతాబ్దము చివరివరకు కస్తూరి కేవలం సహజ వనరులనుండే లభ్యమయ్యేది.[3] అయితే ప్రస్తుతం చాలామటుకు కృత్తిమంగా తయారుచేసిన పదార్ధాలనే వాడుతున్నారు. [3] కస్తూరిలో ఆ స్వభావ సిద్ధమైన వాసనకు ప్రధాన కారణమైన ఆర్గానిక్ కాంపౌండు ముస్కోన్.

కస్తూరి మసీదు

1195వ సం.లో మొరాకో సుల్తాన్ మారకేష్‌ కాలంలో వెయ్యి మూటల కస్తూరి కలిపిన సున్నంతో నిర్మించిన మసీదు ఈనాటికి కూడా కస్తూరి సువాసనలు వెదజల్లుతున్నదట.

కస్తూరిపై సామెతలు,పాటలు,పద్యాలు

  • "ఇంటి పేరు కస్తూరి వారు ఇంట్లోగబ్బిలాల కంపు"
  • కస్తూరి రంగ రంగా
  • సువ్వీ కస్తూరి రంగా సువ్వీ
  • కన్నడ కస్తూరి
  • కస్తూరీ తిలకం లలాట ఫలకే
  • మృగమదంబు చూడ మీద నల్లగనుండు
బరిఢవిల్లు దాని పరిమళంబు
గురువులైన వారి గుణము లీలాగురా
విశ్వదాభిరామ వినుర వేమ (కస్తూరి చూసేందుకు నల్లగా కనిపించినప్పటికీ... దాని సువాసన నాలుగు దిక్కులకూ వెదజల్లుతుంది. అలాగే పెద్దలైన వారు బయటికి ఆడంబరంగా కనిపించక పోయినప్పటికీ, వారు గొప్ప గుణాలను కలిగి ఉంటారు.)
  • ఏమొకో చిగురటధరమున యెడనెడ కస్తూరినిండెను
  • తన నాభినుండి బయట పడుతున్న కస్తూరి గంధాన్ని, తెలుసుకొనలేని కస్తూరి మృగం దాన్ని గడ్డిలో వెతుకుతుంది.--కబీర్
    “ సంస్కృతంబులోని చక్కెర పాకంబు
అరవ భాషలోని అమృతరాశి
కన్నడంబులోని కస్తూరి వాసన
కలిసిపోయె తేట తెలుగునందు? ”— మిరియాల రామకృష్ణ

మూలాలు

  1. Rue, Leonard Lee, III (2004). The Encyclopedia of Deer. Voyageur Press. p. 28. ISBN 0896585905.{cite book}: CS1 maint: multiple names: authors list (link)
  2. "Merriam-Webster's Online Dictionary: musk". Merriam-Webster. Retrieved 2007-04-07.
  3. 3.0 3.1 Rimkus, Gerhard G. (Ed.); Cornelia Sommer (2004). "The Role of Musk and Musk Compounds in the Fragrance Industry". Synthetic Musk Fragrances in the Environment (Handbook of Environmental Chemistry). Springer. ISBN 3540437061.