కార్తీక్ రాజా
కార్తీక్ రాజా | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జననం | 1973 జూన్ 29 |
మూలం | చెన్నై, తమిళనాడు, భారతదేశం |
వృత్తి | సంగీత స్వరకర్త, నిర్వాహకుడు |
క్రియాశీల కాలం | 1992–ప్రస్తుతం |
బంధువులు | వెంకట్ ప్రభు |
కార్తీక్ రాజా (జననం 1973 జూన్ 29) భారతీయ స్వరకర్త. ఆయన తమిళ చిత్రం పాండియన్ (1992)లో స్వరకర్తగా అరంగేట్రం చేసాడు. అనేక ప్రశంసలు పొందిన, వాణిజ్యపరంగా విజయవంతమైన చిత్రాలకు ఆయన సంగీతాన్ని అందించాడు.[1][2][3]
వ్యక్తిగత జీవితం
కార్తీక్ రాజా సంగీత స్వరకర్త ఇళయరాజా పెద్ద కుమారుడు. అతని సోదరుడు యువన్ శంకర్ రాజా, సోదరి భవతారిణి (మ.2024) ఇద్దరూ కూడా తమిళ సినీ సంగీత దర్శకులు, నేపథ్య గాయకులే. ఆయన చెన్నైలోని సెయింట్ బెడెస్ స్కూల్, బోస్టన్ మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ పాఠశాలల్లో చదువుకున్నాడు.
2000 జూన్ 8న, కార్తీక్ రాజా ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో రాజ రాజేశ్వరిని వివాహం చేసుకున్నాడు.
ఆల్బమ్‌లు
సంవత్సరం | ఆల్బమ్ | భాష | నోట్స్ |
---|---|---|---|
1997 | మేరీ జాన్ హిందుస్థాన్ | హిందీ | వన్ ట్రాక్ |
2000 | స్ప్లిట్ వైడ్ ఓపెన్ - ఆల్బమ్ | హిందీ | వన్ ట్రాక్ |
2000 | కాతలై గౌరవిక్కుం నేరమ్ | తమిళం | |
2000 | ఇండియా అన్ లిమిటెడ్ | హిందీ | |
2000 | హౌలే హౌలే | హిందీ | మూడు ట్రాక్‌లు |
అవార్డులు
- 1998: కొత్త సంగీత ప్రతిభకు ఫిల్మ్‌ఫేర్ ఆర్ డి బర్మన్ అవార్డు - గ్రహన్
- 2001: ఉత్తమ సంగీత దర్శకుడిగా సినిమా ఎక్స్‌ప్రెస్ అవార్డు – డమ్ డమ్ డమ్
మూలాలు
మూలాల మునుజూపు
- ↑ Krithika Reddy, T (23 October 2009). "Yuvan Unplugged". The Hindu. Retrieved 21 January 2010.
- ↑ Krithika Reddy, T (3 April 2009). "Karthik Raja croons for Yuvan". www.indiaglitz.com. Archived from the original on 5 April 2009. Retrieved 21 January 2010.
- ↑ Ashok Kumar, S. R (7 November 2008). "On a creative trip". The Hindu. Archived from the original on 8 November 2012. Retrieved 21 January 2010.