కాల్షియం ఆక్సాలేట్

కాల్సియం ఆక్సాలేట్
Calcium oxalate
పేర్లు
IUPAC నామము
calcium ethanedioate
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [25454-23-3]
పబ్ కెమ్ 16212978
సి.హెచ్.ఇ.బి.ఐ CHEBI:60579
SMILES C(=O)(C(=O)[O-])[O-].[Ca+2]
  • InChI=1/C2H2O4.Ca/c3-1(4)2(5)6;/h(H,3,4)(H,5,6);/q;+2/p-2

ధర్మములు
CaC2O4
మోలార్ ద్రవ్యరాశి 128.097 g/mol, anhydrous
146.112 g/mol, monohydrate
స్వరూపం white solid
సాంద్రత 2.12 g/cm3, anhydrous
2.12 g/cm3, monohydrate
ద్రవీభవన స్థానం 200 °C (392 °F; 473 K) decomposes (monohydrate)
నీటిలో ద్రావణీయత
6.7 mg/L (20 °C)
సంబంధిత సమ్మేళనాలు
ఇతర కాటయాన్లు
Beryllium oxalate
Magnesium oxalate
Strontium oxalate
Barium oxalate
Radium oxalate
Iron(II) oxalate
Iron(III) oxalate
సంబంధిత సమ్మేళనాలు
Oxalic acid
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
☒N verify (what is checkY☒N ?)
Infobox references

కాల్సియం ఆక్సాలేట్అనునది ఒక రసాయన సమ్మేళన పదార్థం.ఇది ఒక కర్బనయుత రసాయన సంయోగ పదార్థం. కాల్సియం ఆక్సాలేట్ ను ఆక్సాలిక్ ఆమ్లం యొక్క కాల్సియం లవణం అనికూడా వ్యవహరిస్తారు.కాల్సియం ఆక్సాలేట్ రసాయన ఫార్ములా CaC2O4.కాల్సియం, ఆక్సిజన్, కార్బన్పరమాణువుల రసాయన సమ్మేళనం వలన కాల్సియం ఆక్సాలేట్ సంయోగ పదార్థము ఏర్పడినది.మొక్కలలో గవిసెన/ కవరు ఆకార స్పటిక రూపంలో ఏర్పడి ఉండును.మానవదేహ వ్యవస్థలోమూత్రపిండాలలో ఏర్పడు మూత్రపిండరాళ్ళలో కాల్సియం ఆక్సాలేట్ ఒక భాగం.

భౌతిక ధర్మాలు

కాల్సియం ఆక్సాలేట్ తెల్లని ఘన పదార్థం.నిర్జల/అనార్ ద్ర కాల్సియం ఆక్సాలేట్ అణుభారం 128.097 గ్రాములు/మోల్. ఏకజలాణుయుత (monohydrate) కాల్సియం ఆక్సాలేట్ అణుభారం 146.112 గ్రాములు/మోల్.సాధారణ ఉష్ణోగ్రత(25 °C) వద్ద నిర్జల కాల్సియం ఆక్సాలేట్ సాంద్రత 2.12గ్రాములు/సెం.మీ3.కాల్సియం ఆక్సాలేట్ ద్రవీభవన స్థానం 200 °C (392 °F; 473K), ఈ ఉష్ణోగ్రత దగ్గర ఏకజలాణుయుత (monohydrate) కాల్సియం ఆక్సాలేట్ వియోగం చెందును.

ద్రావణీయత

కాల్సియం ఆక్సాలేట్ నీటిలో కరుగును. 20 °C వద్ద ఒక లీటరు నీటిలో 6.7 మి.గ్రాముల కాల్సియం ఆక్సాలేట్ కరుగును.

లభ్యత

కాల్సియం ఆక్సాలేట్ విషపూరితమైన పదార్థం.కడుపులోకి వెళ్ళిన లోపల పుళ్ళను/వ్రణాలను(sores) ఏర్పరచును.కొన్ని సార్లు ప్రాణాంతకమైనది కూడా.చాలా మొక్కలు,1000కి మించిన మొక్క జాతులు కాల్సియం ఆక్సాలేట్ ను సమీకరణ (accumulate) చేయును. మొక్కలలో కాల్సియం(Ca2+) ను తొలగించు చర్య (detoxification ) వలన కాల్సియం ఆక్సాలేట్ మొక్కలలో సమీకరించ బడుచున్నది.

విష పూరితమైన డంబ్ కేన్(Dieffenbachia) అధిక ప్రమాణంలో కాల్సియం ఆక్సాలేట్ ను కలిగి ఉండి, అన్నకోశం చేరిన మాటలాడలేకపోవడం, గొంతు పట్టుకొను, ఊపిరాడకుండ చేయుట, ఉపిరిసరిగా ఆడక పోవడం వంటి లక్షణాలు కన్పించును.రుబార్బ్(rhubarb ) మొక్కలో( ఆకులలోఎక్కువ మోతాదులో ఉండును) పలుజాతిమొక్కలలో, ఉదాహరణకు అక్సాలిస్(Oxalis), అరెసియే( Araceae), టారో(taro), కివిఫ్రూట్(kiwifruit), తేయాకు మొక్కల ఆకు లలో,, విర్జీనియాక్రిపర్ (Parthenocissus quinquefolia) మొక్కలు కాల్సియం ఆక్సాలేట్ ను తగు ప్రమాణంలో కల్గి ఉన్నాయి.

మూత్రంలో కన్పించు కాల్సియం ఆక్సాలేట్ స్పటికాలు, మూత్రపిండాలలోఏర్పడు మూత్రపిండరాళ్లల్లోని పదార్థాలలోఒకటి. కాల్సియం ఆక్సాలేట్ యొక్క స్వాభావికంగా లభ్య మగు మూడు ఆర్ద్ర /సజల(hydrated) ఖనిజాలలో వ్హెవేల్లిట్(whewellite) ఏకజలాణువుయుతం కాగా, వెడ్డేలైట్(weddellite) ద్వి జలాణువుయుతం,, కొక్సైట్(caoxite) త్రి జలాణువుయుతం.

స్పటిక రూపనిర్మాణం , రూపనిర్ణయం

కాల్సియం ఆక్సాలేట్ ఏకజలబిందువు(monohydrate), ద్విజలబిందు(dihydrate ) లను కలిగిన రూపాలలో లభించును. ఈ రెండు విభిన్నమైన స్పటికసౌష్టవాన్ని కల్గి ఉన్నందున ఆ రెండింటిని వేరుగా గుర్తించవచ్చును.

  • రెండు జలాణువులను కలిగిన కాల్సియం ఆక్సాలేట్ స్పటికాలు అష్టభుజ సౌష్టవాన్ని కల్గి ఉండును. రెండు జలాణువులను కలిగిన కాల్సియం ఆక్సాలేట్ స్పటికాలు అధికంగా మూత్రంలో ఉండును.
  • ఏకజలాణువుకల్గిన కాల్సియం ఆక్సాలేట్ స్పటికాలు భిన్ననిర్మాణాలు కల్గి డంబెల్స్( dumbbells), కదురు(spindles), అండం(ovals ),, పికెట్ ఫెన్సేస్ ఆకారం లోఉండును.

ఆరోగ్యం పై ప్రభావం

మూత్రపిండాలలోని రాళ్ళలో

మూత్రపిండాలరాళ్ళలో 80%కాల్సియం అక్సలేట్ కల్గి ఉండును.ఈ రాళ్ళు ఎక్కువగా, సతతం ఆమ్ల గుణాన్ని కల్గి నపుడు ఏర్పడును. మూత్రంలోని కాల్సియం ఆక్సాలేట్ కొంత వరకు దేహం /శరీర వ్యవస్థ ఉత్పత్తి చేయును.కొంత కాల్సియం ఆక్సాలేట్ తీసుకొన్న ఆహారంలో ఉండటం వలన ఏర్పడును.ఎముకలలో ఉండు కాల్సియం ఆక్సాలేట్ కొంత వరకు మూత్రపిండాలలలో రాళ్ళు ఏర్పడటానికి కారణం.తీసుకొన్న ఆహారంలోని, కూరగాయలు, పండ్లు,, పైపెంకులు గల కాయలు(నట్స్) లోని ఆక్సాలేట్ వలన మూత్రంలో కాల్సియం ఆక్సాలేట్ పరిమాణం పెరుగును.

అంతర్గ్రహణం(Ingestion)-జీర్ణ వ్యవస్థ పై ప్రభావం

కడుపు లోకి వెళ్ళినచో అతి తక్కువ మోతాదులో కూడా కాల్సియం ఆక్సాలేట్ ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపించును. నోరు, గొంతులో మంటగా ఉండును. అలాగే గొంతు, నోటిలో వాపు వచ్చును. ఒక్కోసారి ఊపిరి యాడకుండ ఉండి (choking) రెండు వారాలవరకు దాని ప్రభావం ఉండును. ఆధిక మోతాదులో తీసుకొన్నలేదా జీర్ణవ్యవస్థలో చేరిన ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు ఏర్పడును. శ్వాసకు ఇబ్బంది ఏర్పడును, కొన్నిసార్లు కోమాలోకి వెళ్ళడం, మరణం సంభవించును.

కాల్సియం ఆక్సాలేట్ యొక్క తీవ్రమైన ప్రభావానికి లోనయినప్పటికి, తిరిగి స్వస్థత పొందే అవకాశమున్నప్పటికి, మూత్రపిండాలు, కాలేయం శాశ్వితంగా పాడైఅవకాశం మెండుగా ఉంది.

చికిత్స

కాల్సియం ఆక్సాలేట్ విష ప్రభావానికి లోనైనపుడు అత్యవసర స్థితిలో డైఫెన్ హైడ్రామిన్(diphenhydramine), ఎపిన్ఫ్రిన్(epinephrine) లేదా ఫామోటైడైన్(famotidine) ఔషదాలను నరాల ద్వారా ఎక్కిస్తారు.

పారిశ్రామిక వినియోగం

కాల్సియం ఆక్సాలేట్ ను పింగాణివస్తువుల తయారీలో మెరుపును కల్గించుటలో(ceramic glazes) ఉపయోగిస్తారు.

ఇవికూడా చూడండి

మూలాలు/ఆధారాలు