కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం
కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం | |||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
సంగ్రహం | |||||||||||
విమానాశ్రయ రకం | సార్వజనికం | ||||||||||
యజమాని/కార్యనిర్వాహకుడు | బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ జివికె గ్రూపు[1] | ||||||||||
సేవలు | బెంగళూరు | ||||||||||
ప్రదేశం | దేవనహళ్ళి, కర్ణాటక, భారతదేశం | ||||||||||
ప్రారంభం | 24 మే 2008 | ||||||||||
ఎయిర్ హబ్ | |||||||||||
ఎత్తు AMSL | 915 m / 3,002 ft | ||||||||||
అక్షాంశరేఖాంశాలు | 13°12′25″N 077°42′15″E / 13.20694°N 77.70417°E | ||||||||||
వెబ్‌సైటు | www.bengaluruairport.com | ||||||||||
పటం | |||||||||||
రన్‌వే | |||||||||||
| |||||||||||
గణాంకాలు (ఏప్రిల్ '13 – మార్చి '14) | |||||||||||
| |||||||||||
కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం బెంగుళూరులో గల అంతర్జాతీయ విమానాశ్రయము.
2008, మే 23వ తేదీన కర్ణాటక రాష్ట్రపు మొట్టమొదటి అంతర్జాతీయ విమానాశ్రయం ఇక్కడ ప్రారంభించబడింది. బెంగళూరు నగరం నుండి సుమారు 32 కి.మీ.దూరంలో ఉన్న ఈ విమానాశ్రయానికి రహదారి మార్గాలు అనుసంధానమై ఉన్నాయి. "హైస్పీడ్ రైలు", "ఎక్స్‌ప్రెస్ వే" మార్గాల బ్లూప్రింట్ తయారు చేయబడింది. టాక్సీ సౌకర్యం, ప్రతి 15 నిమిషాలకొక కె.ఎస్.ఆర్.టి.సి.బస్ సౌకర్యం ఏర్పాటు చేయబడింది. బెంగళూరు ఏ మూల నుండి ఐనా గంట, గంటన్నరలోపు విమానాశ్రయానికి చేరుకోవచ్చు. ప్రయాణీకుల సౌకర్యం కొరకు "బి.ఐ.ఎ.ఎల్ సహాయవాణి" సౌలభ్యం ఉంది. సహాయవాణి సంఖ్య:40581111 ద్వారా విమానాశ్రయానికి రవాణా సౌకర్యాల వివరాలు, ఇతర సాధారణ విషయాలు ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు. విమానాశ్రయంలో 53 చెక్-ఇన్ కౌంటర్లు, 18 స్వయం పరిశీలన యంత్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. పిల్లల సౌకర్యం కొరకు ఔషధాలయం, డయాపర్లు మార్చుటకు, పిల్లలకు పాలుత్రాగించడానికి ప్రత్యేక స్థలాలు ఉన్నాయి.
మూలాలు
- ↑ "GVK | Our Business – Airports – GVK KIA Bengaluru". Archived from the original on 2014-10-13. Retrieved 2014-11-26.
- ↑ "March 2013 Traffic Statistics" (PDF). Archived from the original (PDF) on 2014-06-06. Retrieved 2014-11-26.
- ↑ "Airports Authority of India". Aai.aero. Archived from the original on 17 జూన్ 2014. Retrieved 22 October 2013.