కొలనుపాక
కొలనుపాక | |
— రెవిన్యూ గ్రామం — | |
కొలనుపాక జైన ఆలయం | |
తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 17°41′58″N 79°02′04″E / 17.699374°N 79.034462°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | యాదాద్రి |
మండలం | ఆలేరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | ఆరుట్ల లక్ష్మీ ప్రసాద్ రెడ్డి |
జనాభా (2011) | |
- మొత్తం | 8,860 |
- పురుషుల సంఖ్య | 4,431 |
- స్త్రీల సంఖ్య | 4,429 |
- గృహాల సంఖ్య | 2,289 |
పిన్ కోడ్ | 508102 |
ఎస్.టి.డి కోడ్ | 08685 |
కొలనుపాక (Kolanupaka),తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, ఆలేరు మండలంలోని గ్రామం.[1] ఇది జిల్లా కేంద్రమైన భువనగిరి నుండి 28 కీ. మీ, ఆలేరు నుండి 7 కి. మీ. దూరం లోను, జనగామ జిల్లా జనగాం పట్టణం నుండి 22 కి. మీ. దూరంలోనూ ఉంది. కొలనుపాక గ్రామం భువనగిరి జిల్లాలో ఒక మేజరు గ్రామ పంచాయితి. వరంగల్ - హైదరాబాదు మార్గంలో హైదరాబాదు నుండి కొలనుపాక 65 కి.మీ దూరంలో ఉంది[2][3]. ఈ గ్రామంలో అనేక చారిత్రక వివిధ మతాల మందిరాలు, మఠాలు, పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలోని కొలనుపాక మ్యూజియం ఉంది.[4] పల్లెల్లోని కుల, మత భేదా లేని లౌకిక, మత సామరస్యతకు ప్రతీక ఈ గ్రామం.
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో
2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత నల్గొండ జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[5]
గ్రామ జనాభా
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2289 ఇళ్లతో, 8860 జనాభాతో 4219 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 4431, ఆడవారి సంఖ్య 4429. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1934 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 67. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 576532.[6] పిన్ కోడ్: 508101.
విద్యా సౌకర్యాలు
కొలనుపాక గ్రామ ప్రజలకు విద్యా చాలా అందుబాటులో ఉంది. ఈ గ్రామంలో విద్య అనేది రజాకార్ల హయాం కంటే ముందే ప్రారంభించబడింది. మొదట్లో భోగం బడి అని, తరువాత ప్రాథమిక స్థాయి, ఆ తరువాత ప్రాథమికోన్నత, సెకండరీ విద్య ఇలా కాలానుగుణంగా గ్రామ ప్రజలకు ఊరి పాలకులు అందుబాటులోకి తీసుకువచ్చారు. గ్రామంలో నాలుగు (4) ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు అవి మండల ప్రాథమిక పాఠశాల, కొలనుపాక, మండల ప్రాథమిక పాఠశాల, ఉప్పుగడ్డ, మండల ప్రాథమిక పాఠశాల, ఎ.ఆర్. కాలనీ, మండల ప్రాథమిక పాఠశాల, సోమేశ్వర వీధి అలాగే ఒక ప్రైవేటు ప్రాథమిక పాఠశాల, ప్రతిభ పాఠశాల ఒకటి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కొలనుపాకలో ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల, రెండు ప్రైవేటు జూనియర్ కళాశాలలు, ఒక ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్, ప్రైవేటు డిగ్రీ కళాశాల ఆలేరు మండల కేంద్రంలో ఉన్నాయి. ఇంజనీరింగ్ కళాశాల జనగాంలోనూ, భువనగిరి చుట్టూ పరిసర ప్రాంతాలలో అందుబాటులో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల హైదరాబాదులోను, పాలీటెక్నిక్ యాదగిరిగుట్టలోను, మేనేజిమెంటు కళాశాల జనగామలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం ఆలేరులోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల హైదరాబాదు లోనూ ఉన్నాయి.
వైద్య సౌకర్యం
ప్రభుత్వ వైద్య సౌకర్యం
కొలనుపాకలో ఒక హోమియోపతి ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం
గ్రామంలో ప్రైవేటు వైద్య సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఒక ఎంబిబిఎస్ డాక్టరు, ఇతర డిగ్రీ, ఆర్.ఎం.పి ప్రాక్టీస్ చేసిన డాక్టర్లు 5 గురు, కొంతమంది నాటు, ప్రైవేటు ఆయుర్వేద వైద్యులు ఉన్నారు. అంతేకాకుండా 5 చిన్న చిన్న మెడికల్ షాప్స్ కూడా ఉన్నాయి.
తాగు నీరు
గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. చెరువు ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా జరుగుతుంది
రవాణ సదుపాయాలు
తెలంగాణ రాజధాని అయిన హైదరాబాదు నుండి బస్, రైలుబండి సదుపాయాలు ఉన్నాయి. హైదరాబాదు మహాత్మా గాంధీ బస్ స్టాప్/ జూబ్లి బస్ స్టేషను నుండి వరంగల్ లేదా హన్మకొండ, జనగాం వెళ్ళే బస్ ఎక్కి ఆలేర్లో దిగాలి. ఉప్పల్ రింగ్ రోడ్డ్ నుండి, కూకట్ పల్లీ నుండి నేరుగా కొలనుపాకకు సిటీ బస్సుల సదుపాయము కలదు, అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషను నుండి వరంగల్ వెల్లే ట్రేయిన్ ఎక్కి ఆలేర్లో దిగాలి. అక్కడ నుండి బస్ లో కాని ఆటోలో కాని 6 కి.మి ప్రయాణిస్తె కొలనుపాక గ్రామం చేరుకుంటారు.
గ్రామ చరిత్ర
ఈ గ్రామం పేరు అనేక రూపాంతరాలు చెందింది.పూర్వము " కాశీ కొలనుపాక బింభావతి పట్టణం "గా పిలువబడేను, మైసూరు వద్ద లభించిన ఒక శాసనంలో దీని పేరు కొల్లిపాకై. అలాగే సోమేశ్వరస్వామి ఆలయం దగ్గర వాగులో ఇసుక మేటలో దొరకిన గంటపై స్వస్తి శ్రీమతు కందప్పనాయకరు, కొల్లిపాకేయ సకలేశ్వర సోమేశ్వర దేవరిగె కొట్టి పూజ అని ఉంది. కాకతీయ రుద్రదేవుని కాలంనాటి శాసనంలో కూడా కొల్లిపాక అని ప్రస్తావించబడింది. విజయనగర రాజుల కాలంనాటికి కొల్‌పాక్''గా మారింది. ప్రస్తుతం కూల్‌పాక్ లేదా కొలనుపాక అని పిలువబడుతున్నది.
గ్రామం పేరు వెనుక చరిత్ర
గ్రామనామ వివరణ
కొలనుపాక అనే గ్రామనామం కొలను అనే పూర్వపదం, పాక అనే ఉత్తరపదాల కలయికతో ఏర్పడింది. కొలను అనే పదం జలసూచి, చిన్న లేదా మధ్యపాటి చెరువు అన్న అర్థం వస్తోంది. పాక అనేది గృహసూచి.[7]
గ్రామ చరిత్ర, విశేషాలు
- ఈ గ్రామం చాల చరిత్రాత్మక ప్రదేశము, సుప్రసిద్ద పుణ్యక్షేత్రము, కొటొక్క (కొటి ఓక్కటి ) లింగము నూట ఓక్క చెరువు - కుంటలు ఉన్నాయి.ముఖ్యంగా స్వయంభూ లింగము వెలసి, శ్రీ శ్రీ సొమేశ్వరస్వామిగా అవతరించాడు, రేణుకా చార్యుని జన్మ స్థలము (సోమేశ్వర ఆలయం) వీరనారాయణస్వామి దేవాలయము, సాయిబాబా దేవాలయము, శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయం ముఖ్యంగా జైన దేవాలయము (జైన మందిరము, వివిధ కమ్యునిటిలకు (కులాలకు) చెందిన 22 రకాల మఠాలు (వీరశైవ ఆలయాలు) ఉన్నాయి. అదేవిధంగా సకుటుంబ సమేతంగా సందర్శించదగిన ప్రదేశము. 2వేల సంవత్సరాల పురాతనమైన జైన మందిరములో 1.5 మీ. ఎత్తైన మహావీరుని విగ్రహం ఉంది.
కొలనుపాక శ్రీ చండీ సమేత సోమేశ్వర స్వామి క్షేత్రం
నల్గొండజిల్లా ఆలేరుమండలంలోని కొలనుపాక వీరశైవ సిద్ధ క్షేత్రం. శైవమతస్థాపకుడుగా పూజింపబడుచున్న శ్రీ రేణుకాచార్య ఇక్కడే లింగోద్భవం పొంది వేయి సంవత్సరాలు భూమండలం మీద శైవ మతప్రచారము చేసి, మళ్ళీ ఇక్కడే లింగైక్యంపొందినట్టు సిద్ధాంత శిఖామణి అనే గ్రంథంలో వ్రాయబడి వుందని స్థలపురాణం. దేవాలయ ఆవరణనిండా ఎన్నో శిథిలమైన శాసనాలు, ఛిద్రమైన విగ్రహాలు మనకు కన్పిస్తాయి. దేవాలయ ప్రాంగణాన్ని, ప్రాకార మండపాలనే మ్యూజియంగా ఏర్పాటుచేశారు పురావస్తుశాఖ వారు. ఈ ఆలయం సా.శ. 1070 - 1126 మధ్య నిర్మాణం జరిగినట్లు భావించబడుతోంది. పశ్చిమ చాళుక్యుల పాలనలో నిర్మించబడి ఉంటుందని చరిత్ర కారులు భావిస్తున్నారు.
పూర్వచరిత్ర
ఈ కొలనుపాకనే పూర్వం దక్షిణకాశి, బింబావతి పట్నం, పంచకోశ నగరంగా పిలిచేవారట. దీనినే కొలియపాక, కొల్లిపాక, కల్లియపాక, కుల్యపాక, కొల్లిపాకేయ మొదలైన పేర్లతో పిలిచే వారట. ఇప్పడు కొలనుపాక, కుల్పాక్ గా వ్యవహరిస్తున్నారు.
ఈ సోమేశ్వర లింగం పంచ పీఠాలలో మొదటిదిగా వీరశైవులు పూజిస్తారు. 1. సోమేశ్వరస్వామి – కొలనుపాక 2. సిద్దేశ్వర స్వామి - ఉజ్జయిని 3. భీమనాథస్వామి - కేదారనాథ్ 4. మల్లికార్జునస్వామి – శ్రీశైలమ్ 5. విశ్వేశ్వరస్వామి – కాశి
- సా.శ. 11వ శతాబ్దంలో ఇది కళ్యాణి చాళుక్యుల రాజధాని. ఆ కాలంలో ఇది జైన సంప్రదాయానికీ, శైవ సంప్రదాయానికీ కూడా ప్రముఖ కేంద్రము. ప్రసిద్ధ శైవాచార్యుడైన రేణుకాచార్యుడు ఇక్కడే జన్మించాడని సాహిత్యం ఆధారాలు చెబుతున్నాయి. తరువాత ఈ పట్టణం చోళుల అధీనంలోకి, తరువాత కాకతీయుల అధీనంలోకి వెళ్ళింది.
- సా.శ.11వ శతాబ్దం నాటికి ఇది ఎల్లోరా, పటాన్‌చెరువు, కొబ్బల్ వంటి జైన మహా పుణ్య క్షేత్రాల స్థాయిలో వెలుగొందింది. కొద్దికాలం క్రితమే ఒక జైన శ్వేతాంబరాలయం పునరుద్ధరించబడింది.
- మధ్య యుగం - సా.శ. 1008 - 1015 అయిదవ విక్రమాదిత్యుని కాలం - నాటికి కొలనుపాక ఒక దుర్భేద్యమైన కోటగా విలసిల్లింది. చోళరాజులు (రాజేంద్ర చోళుడు సా.శ. 1013-1014) తాత్కాలికంగా దీనిని జయించినా మళ్ళీ ఇది చాళుక్యుల అధీనంలోకి వచ్చింది. కళ్యాణీ చాళుక్యుల పాలన క్షీణించిన తరువాత ఇది కాకతీయుల పాలనలోకి వచ్చింది. కాకతీయుల రాజధాని ఓరుగల్లు దీనికి సమీపంలోనే ఉన్నందున ఈ కాలంనుండి కొలనుపాక ప్రాముఖ్యత పలుచబడింది.
పారిశుధ్యం
మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
సమాచార సౌకర్యాలు
కొలనుపాకలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. పోస్టాఫీసు సౌకర్యం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.
మార్కెటింగు, బ్యాంకింగు
గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. వారం వారం సంత గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో పబ్లిక్ రీడింగ్ రూం ఉంది. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. శాసనసభ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం, ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సినిమా హాలు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ఒక గ్రంథాలయం గ్రామంలో కలదు
విద్యుత్ సరఫరా
తెలంగాణరాష్ట్ర వేర్పాటు తరువాత వ్యవసాయ, వాణిజ్య అవసరరాలకు 24 గంటల విద్యుత్ సరఫరా జరుగుతున్నది.
భూమి వినియోగం
కొలనుపాకలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
- వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 166 హెక్టార్లు
- వ్యవసాయం సాగని, బంజరు భూమి: 88 హెక్టార్లు
- శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 33 హెక్టార్లు
- తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 12 హెక్టార్లు
- వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 932 హెక్టార్లు
- సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 1594 హెక్టార్లు
- బంజరు భూమి: 908 హెక్టార్లు
- నికరంగా విత్తిన భూమి: 486 హెక్టార్లు
- నీటి సౌకర్యం లేని భూమి: 2566 హెక్టార్లు
- వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 422 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
కొలనుపాకలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
- బావులు/బోరు బావులు: 422 హెక్టార్లు
ఉత్పత్తి
కొలనుపాకలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రధాన పంటలు
ముఖ్యమైన వ్యక్తులు
ఆరుట్ల రాంచంద్రా రెడ్డి - కమలాదేవి (రజాకర్ల వ్యతిరేఖ ఉద్యమ పోరాట యోధులు,
బి.మాధవులు
ఇవి కూడా చూడండి
మూలాలు
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 247 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "The Hindu : Andhra Pradesh / Hyderabad News : Kolanupaka temple to be re-opened". Archived from the original on 2013-12-21. Retrieved 2014-01-05.
- ↑ "The Hindu : Andhra Pradesh / Hyderabad News : School toppers feted". Archived from the original on 2010-07-24. Retrieved 2014-01-05.
- ↑ Department of Heritage Telangana, Museums. "District Museum Kolanupaka". www.heritage.telangana.gov.in. Archived from the original on 8 March 2021. Retrieved 18 September 2021.
- ↑ "యాదాద్రి భువనగిరి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
- ↑ ఉగ్రాణం, చంద్రశేఖరరెడ్డి (1989). నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన. తిరుపతి: శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం. p. 251. Retrieved 10 March 2015.