కొలాసిబ్
కొలాసిబ్ | |
---|---|
పట్టణం | |
Coordinates: 24°13′52″N 92°40′34″E / 24.23111°N 92.67611°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మిజోరాం |
జిల్లా | కొలాసిబ్ |
Elevation | 888 మీ (2,913 అ.) |
Population (2011) | |
• Total | 24,272 |
భాషలు | |
• అధికారిక | మిజో |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్‌కోడ్ | 796081[1] |
Vehicle registration | ఎంజెడ్ 05 |
వాతావరణం | Cwa |
కొలాసిబ్, మిజోరాం రాష్ట్రంలోని కొలాసిబ్ జిల్లా జిల్లా ముఖ్య పట్టణం.
జనాభా
2011 భారత జనాభా లెక్కల ప్రకారం,[2] కొలాసిబ్ జిల్లాలో 83,955 జనాభా ఉంది. జనాభాలో పురుషులు 51.12% కాగా, మహిళలు 48.88% గా ఉంది. కొలాసిబ్ సగటు అక్షరాస్యత 93.50% కాగా, జాతీయ సగటు 74.04% కంటే ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 94.57% కాగా, స్త్రీల అక్షరాస్యత 92.38% గా ఉంది. దశాబ్దంలో కొలాసిబ్ జిల్లా జనాభా వృద్ధిరేటు 27.28%గా ఉంది.
ఆర్థిక వ్యవస్థ
కొలాసిబ్ పట్టణంలో వ్యవసాయం ప్రధాన వృత్తి కాగా ఇక్కడ ఎక్కువగా బీటిల్ గింజలు, నూనె గింజలు, వరి, గోధుమలు పండిస్తారు. ఇవన్నీ మిజోరాం లోని ఇతర జిల్లాలకు కూడా ఎగుమతి చేయబడతాయి.[3]
రవాణా
ఇక్కడ పవన్ హన్స్[4] (హెలికాప్టర్ సర్వీస్ సంస్థ) ఆధ్వర్యంలో హెలికాప్టర్ సేవలు ప్రారంభించబడ్డాయి.[5] 54వ జాతీయ రహదారి ద్వారా ఈ పట్టణం, ఐజాల్ నగరంతో కలుపబడుతోంది. కొబాసిల్, ఐజాల్ మధ్య 83 కి.మీ.ల దూరం ఉంది. ఇక్కడినుండి బస్సు, మాక్సి క్యాబ్ లతో రవాణా సౌకర్యం ఉంది.[6]
మీడియా
కొలాసిబ్ పట్టణంలోని ప్రధాన వార్తాపత్రికలు:[7]
- దుహ్లై డైలీ
- రామ్నుయం
- కోలాసిబ్ టైమ్స్
- కోలాసిబ్ టుడే
- టర్నిపుయి
- చువాహ్లాంగ్ డైలీ
- వైరెంగ్టే ఆవ్[8][9]
- కోలాసిబ్ ఆవ్
- జింగ్టియన్ డైలీ
- రెంఖావ్‌పుయి
- జోరం కనన్
కొలాసిబ్ పట్టణంలోని ప్రధాన టెలివిజన్ కేబుల్ నెట్‌వర్క్:
- కోలాసిబ్ కేబుల్ నెట్‌వర్క్ (కెసిఎన్)
- సి.జాఖుమా కేబుల్ నెట్‌వర్క్ (సిజెడ్ఎస్)
మూలాలు
- ↑ "Kolasib PIN Code Number, India". askkaka.in. Archived from the original on 7 November 2017. Retrieved 28 December 2020.
- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 16 June 2004. Retrieved 28 December 2020.
- ↑ "Economic activity gains momentum in Mizoram's Kolasib District". Yahoo News. Retrieved 28 December 2020.
- ↑ "MIZORAMA HELICOPTER SERVICE TUR CHIEF MINISTER IN HAWNG". Mizoram DIPR. Archived from the original on 12 December 2013. Retrieved 28 December 2020.
- ↑ "Nilaini atangin 'Helicopter Service". The Zozam Times. Archived from the original on 23 September 2015. Retrieved 28 December 2020.
- ↑ "Aizawl to Shillong". Mizoram NIC. Retrieved 28 December 2020.
- ↑ "Accredited Journalists". DIPR Mizoram. Archived from the original on 19 June 2013. Retrieved 28 December 2020.
- ↑ "Accredited Journalists". DIPR Mizoram. Archived from the original on 19 జూన్ 2013. Retrieved 28 December 2020.
- ↑ "RNI Registration". Archived from the original on 3 June 2016. Retrieved 28 December 2020.
ఇతర లంకెలు
- కొలాసిబ్ అధికారిక వెబ్సైట్ Archived 2018-06-01 at the Wayback Machine