కోల్‌కాతా వైద్య కళాశాల
నినాదం | మానవత్వం ఉన్న శాస్త్ర విజ్ఞానం |
---|---|
రకం | వైద్య కళాశాల, ఆసుపత్రి |
స్థాపితం | 1835 |
వ్యవస్థాపకుడు | లార్డ్ విలియం బెంటింక్ |
ప్రధానాధ్యాపకుడు | మంజుశ్రీ రే |
స్థానం | కోల్‌కాతా, పశ్చిమ బెంగాల్, భారతదేశం 22°34′25″N 88°21′43″E / 22.5736°N 88.3619°E |
కాంపస్ | పట్టణ 26 ఎకరాలు (0.11 కి.మీ2) |
అనుబంధాలు | పశ్చిమ బెంగాల్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ |
జాలగూడు | medicalcollegekolkata.in |
కోల్‌కాతా వైద్య కళాశాల (కలకత్తా మెడికల్ కాలేజ్) అనేది భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ లోని కోల్‌కాతాలో ఉన్న ఒక వైద్య కళాశాల, ఆసుపత్రి. ఈ ప్రతిష్టాత్మక వైద్య పాఠశాల 1835 లో లార్డ్ విలియం బెంటింక్ చేత స్థాపించబడింది. ఇది బ్రిటిష్ రాజ్ కాలంలో బెంగాల్ మెడికల్ కాలేజీగా పిలువబడింది. ఇది ఎకోల్ డి మెడిసిన్ డి పాండిచేరి తరువాత ఆసియాలో యూరోపియన్ మెడిసిన్ విద్య బోధించిన రెండవ వైద్య కళాశాల, ఆంగ్ల భాషలో బోధించిన మొదటిది.[1] ఈ కళాశాలతో సంబంధం ఉన్న ఆసుపత్రి పశ్చిమ బెంగాల్‌లోని అతిపెద్ద ఆసుపత్రి. ఐదున్నర సంవత్సరాల వైద్య శిక్షణ పూర్తయిన తరువాత ఈ కళాశాల బ్యాచిలర్ ఆఫ్ మెడిసన్, బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ (ఎంబిబిఎస్) డిగ్రీలను ఇస్తుంది. అలాగే ఈ కళాశాల స్పెషలైజేషన్ డిగ్రీలైన ఎంఎస్/ఎండి, పోస్ట్ డాక్టోరల్ ఎంసిహెచ్/డిఎం డిగ్రీలు కూడా ఇస్తుంది. అంతేకాకుండా నర్సింగ్, అనేక పారా మెడికల్ కోర్సులు ఉన్నాయి.
మూలాలు
- ↑ "Heritage". Medical College and Hospital Kolkata. Archived from the original on 2007-10-09. Retrieved 2007-11-20.