ఖూనీ దర్వాజా
ఖూనీ దర్వాజా (ఆంగ్లం :Khooni Darwaza (హిందీ : खूनी दरवाज़ा, ఉర్దూ خونی دروازہసాహిత్య పరంగా "రక్తసిక్త తలుపు"), ఇంకనూ దీనికి లాల్ దర్వాజా (Red Gate) (హిందీ : लाल दरवाज़ा ) అనీ వ్యవహరిస్తారు. ఢిల్లీగేట్ బహాదుర్ షా మార్గ్ లో ఉండే ఈ దర్వాజా (ద్వారం) ను ఢిల్లీ రాజు షేర్షా సూరి నిర్మించాడు. అప్పట్లో ఏర్రకోట దారుల్లో ఇది ప్రధాన దర్వాజాగా పేరు పొందింది. మొదటి స్వాతంత్ర్య సంగ్రామం సమయంలో చివరి మొగల్ రాజు బహాదుర్ షా జఫర్ ఇద్దరు కుమారులు మిర్జాముగల్, ఖిజ్ సుల్తాన్, కూతరు మిర్జా అబుక్వర్‌లను కూడా కెప్టెన్ విలియం హడ్సన్ ఇక్కడే అరెస్టు చేశాడు. అనంతరం 1857, సెప్టెంబరు 22న అంగ్లేయుల సైనిక బెటాలియన్ బెల్‌గాడి నుంచి ఏర్రకోటకు రాజకుమారులతోపాటు యువరాణిని తీసుకుని వస్తుండగా. వీరిని చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చారు. వారు రాజకుటుంబీకులను విడిపిస్తారని భావించిన కెప్టెన్ హడ్సన్ ముగ్గురిని తుపాకీలతో కాల్చి దర్వాజాకు వేలాడతీయించాడు. అప్పటి నుంచి ఈ గేట్‌కు ఖూనీ దర్వాజా అని పేరు వచ్చినట్టు చరిత్ర చెబుతోంది. ఖూనీ దర్వాజా (రక్తంతో కూడిన తలుపు) కామన్వెల్త్ క్రీడల సందర్భంలో సందర్శకులను ఆకట్టుకునే క్రమంలో ముందు వరుసలో ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. విదేశీ పర్యటకులను పూర్తిస్థాయిలో ఆకర్షించేందుకు ఖూనీ దర్వాజాకు మెరుగులు దిద్దాలని పురాతత్వ విభాగం నిర్ణయించింది. ఈ ఖూనీ దర్వాజా ఢిల్లీ గేట్ ప్రాంతంలోని అంబేద్కర్ స్టేడియం, మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీ మధ్యలోని బహదూర్ షా మార్గ్ లో రెండతస్తుల కట్టడం. ఇందులో కొన్నేళ్ల కిందట ఓ మెడికల్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆ తర్వాత ఈ కట్టడానికి గేట్లుమూసి తాళం వేశారు.
మూలాలు
- The Last Mughal, by William Dalrymple, Viking Penguin, 2006, ISBN 0-67099-925-3
- [1]