గిన్‌కోగో వృక్షం
గిన్‌కోగో వృక్షం - అనేది చైనాకు చెందిన ఒక జాతి చెట్టు. సాధారణంగా గిన్‌కోగో గా పిలుచుకునే ఈ వృక్షం పేరు గిన్‌కోగో బిలోబా (ఆంగ్లం: Ginkgo Biloba).[1] [2] దీనిని మెయిడెన్‌హెయిర్ ట్రీ (ఆంగ్లం: Maidenhair Tree)[3] అని కూడా పిలుస్తారు. చైనాలో హోంగన్ మౌంటైన్స్‌లోని గు గునిన్ బుద్ధిస్ట్ టెంపుల్ ఆవరణలో ఉన్న గిన్‌కోగో వృక్షం 1,400 ఏళ్లనాటిది అని చరిత్ర చెప్తోంది. ఆ కాలంలో చైనాను పరిపాలించిన లి షిమిన్ ఈ మొక్కను నాటారని ప్రతీతి.[4]
మెసోజోయిక్ యుగం నాటి జింక్‌గోయేసి కుటుంబంలో మిగిలిన ఏకైక జాతి ఇది కాబట్టి ఈ మొక్క సజీవ శిలాజంగా పరిగణించబడుతుంది. ఇది నిటారుగా ఉండే కాండం, ఫ్యాన్ ఆకారపు ఆకులతో దీర్ఘకాలం జీవించే చెట్టు. వాతావరణ ప్రతికూలతలకు నిలబడడం, పరాన్నజీవులకు రోగనిరోధక శక్తి ఇనుమడింపచేయడమే కాక జపాన్ అణు బాంబు దాడి తర్వాత వసంతకాలంలో హిరోషిమాలో వికసించింది కూడా.
గిన్‌కోగో ఆకు : జపాన్ రాజధాని టోక్యో చిహ్నం
గిన్‌కోగో చెట్టు జపాన్ రాజధాని టోక్యో అధికారిక చెట్టు. టోక్యో చిహ్నం గిన్‌కోగో ఆకు. 1948 నుండి టోక్యో విశ్వవిద్యాలయం బ్యాడ్జ్ లో కూడా రెండు గిన్‌కోగో ఆకులు ఉండేవి. ఆ తరువాత 2004లో పునఃరూపకల్పనతో విశ్వవిద్యాలయ చిహ్నంగా మారింది.[5] ఒసాకా విశ్వవిద్యాలయం లోగో 1991 నుండి గిన్‌కోగో లీఫ్‌గా ఉంది. ఇది విశ్వవిద్యాలయం అరవైవ వార్షికోత్సవం సందర్భంగా డిజైనర్ ఇక్కో తనకా దీనిని రూపొందించారు.[6]
మూలాలు
- ↑ "Definition of GINKGO". www.merriam-webster.com (in ఇంగ్లీష్). Retrieved 2 July 2021.
- ↑ "ginkgo". dictionary.cambridge.org. Retrieved 2 July 2021.
- ↑ మూస:PLANTS
- ↑ "1400 ఏళ్ల నాటి 'బంగారు' వృక్షం ఎక్కడుందో తెలుసా..!". Sakshi. 2021-11-15. Retrieved 2021-11-26.
- ↑ "東大マーク". 東京大学.
- ↑ "The official logo of Osaka University". Retrieved 18 June 2019.