చింతల కనకారెడ్డి
చింతల కనకారెడ్డి | |||
చింతల కనకారెడ్డి | |||
శాసనసభ సభ్యుడు
| |||
పదవీ కాలం 2014 – 2018 | |||
నియోజకవర్గం | మల్కాజ్‌గిరి శాసనసభ నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ఫిబ్రవరి 10, 1951 సికింద్రాబాదు, తెలంగాణ, భారతదేశం | ||
మరణం | మే 11, 2019 | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత్ రాష్ట్ర సమితి | ||
జీవిత భాగస్వామి | ప్రమీల | ||
సంతానం | శ్రీనివాస్‌రెడ్డి, శ్రీపాల్‌రెడ్డి, శాలిని | ||
నివాసం | సికింద్రాబాదు, తెలంగాణ, భారతదేశం |
చింతల కనకారెడ్డి (ఫిబ్రవరి 10, 1951 - మే 11, 2019) తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు. 2014లో తెలంగాణ రాష్ట్ర సమితి నుండి మల్కాజ్‌గిరి శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేశాడు.
జననం - కుటుంబం
కనకారెడ్డి 1951, ఫిబ్రవరి 10న ముత్యంరెడ్డి, సత్తెమ్మ దంపతులకు అల్వాల్‌లో జన్మించాడు. 2005 నుంచి ఏపీ గ్రేప్స్ అసోషియేషన్ అధ్యక్షుడిగా కొనసాగాడు. కనకారెడ్డికి భార్య ప్రమీల, కుమారులు శ్రీనివాస్‌రెడ్డి, శ్రీపాల్‌రెడ్డి, కూతురు షాలిని ఉన్నారు. కోడలు శాంతి శ్రీనివాస్‌రెడ్డి అల్వాల్ డివిజన్ కార్పొరేటర్‌గా పనిచేసింది.[1]
రాజకీయ ప్రస్థానం
2009 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా రాజ్యం పార్టీ తరపున మల్కాజ్‌గిరి శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయాడు. 2013లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేసి, 2014లో ఎమ్మెల్యేగా గెలుపొందాడు.[2][3]
మరణం
గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కనకారెడ్డి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2019, మే 11 శనివారంరోజున మరణించాడు.[4]
మూలాలు
- ↑ ఈనాడు, రాష్ట్ర వార్తలు (12 May 2019). "మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి కన్నుమూత". Archived from the original on 12 May 2019. Retrieved 30 May 2019.
- ↑ Sakshi (16 May 2014). "తెలంగాణలో విజేతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
- ↑ నమస్తే తెలంగాణ (12 May 2019). "మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి మృతి". Archived from the original on 30 May 2019. Retrieved 30 May 2019.
- ↑ ఆంధ్రజ్యోతి, తెలంగాణ ముఖ్యాంశాలు (12 May 2019). "మల్కాజ్‌గిరి మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి మృతి". Archived from the original on 30 May 2019. Retrieved 30 May 2019.