చిచోరే

చిచోరే
దర్శకత్వంనితేష్ తివారీ
రచననితేష్ తివారీ
పీయూష్ గుప్తా
నిఖిల్ మెహ్రోత్రా
నిర్మాతసాజిద్ నడియాద్వాలా
తారాగణంసుశాంత్ సింగ్ రాజ్‌పుత్
శ్రద్ధా కపూర్
వరుణ్ శర్మ
నవీన్ పోలిశెట్టి
ఛాయాగ్రహణంఅమలెందు చౌదరి
కూర్పుచారు శ్రీ రాయ్
నిర్మాణ
సంస్థ
నడియాద్వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్
పంపిణీదార్లుఫాక్స్ స్టార్ స్టూడియోస్
విడుదల తేదీ
6 సెప్టెంబరు 2019 (2019-09-06)
సినిమా నిడివి
143 నిమిషాలు [1]
దేశంభారతదేశము
భాషహిందీ
బడ్జెట్50 crore (US$6.3 million)[2]
బాక్సాఫీసుest. 215 crore (US$27 million) [3]

చిచోరే 2019 లో విడుదల అయిన హిందీ సినిమా. గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సాజిద్ నడియాద్వాలా నిర్మించిన ఈ చిత్రానికి నితేష్ తివారీ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, శ్రద్ధా కపూర్, వరుణ్ శర్మ, ప్రతీక్ బబ్బర్ నటించారు. ఈ చిత్రం ఉత్తమ హిందీ చిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది.[4]

నటవర్గం

కథ

అనిరుధ్ పాఠక్, మాయ భార్య భర్తలు. వీరు విడాకులు తీసుకుంటారు. వీరికి ఒక కొడుకు రాఘవ్ ఉంటాడు. అనిరుధ్ తన కొడుకు రాఘవ్ ఇంజనీర్ కావాలనే ఆకాంక్షతో ఐఐటీలో ప్రవేశ పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూస్తాడు. ఫలితాలు వచ్చే రోజు తన కొడుకుకు షాంపైన్ బాటిల్‌ను బహుమతిగా ఇచ్చి మనం పార్టీ చేసుకుందాం అని చెపుతాడు. రాఘవ్ ఐఐటీలో సీటు రాలేదని తన అపార్ట్‌మెంట్‌లోని బాల్కనీ నుండి కిందికి దూకుతాడు. హాస్పిటల్లో అనిరుధ్ మాయని కలుస్తాడు. రాఘవ్‌కి బతకడం ఇష్టం లేదని అతని పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్ ఇద్దరికీ చెప్తాడు. తన కొడుకులో జీవించాలనే కోరిక కలగడానికి అనిరుధ్ తన కళాశాల రోజుల గురుంచి చెపుతాడు. రాఘవ ఇది నిజంగా జరిగిందా లేక అబద్దమా అని తెలుసుకోవడానికి అనిరుధ్ స్నేహితులని కలుస్తాడు. రాఘవ్ అన్ని విషయాలు తెలుసుకొని మళ్ళి సంవత్సరం తరువాత పరీక్షలు రాసి మంచి కాలేజ్ లో సీటు సాధిస్తాడు.

పాటలు

సంఖ్య పాట గాయకుడు(లు) నిడివి
1. వో దిన్ అరిజిత్ సింగ్ 4:18
2. ఖైరియత్ అరిజిత్ సింగ్ 4:40
3. కల్ కీ హై బాత్ హై కేకే 4:00
4. ఫికర్ నాట్ నకాష్ అజీజ్, దేవ్ నేగి, అంతరా మిత్ర, అమిత్ మిశ్రా, శ్రీరామ చంద్ర, అమితాబ్ భట్టాచార్య 3:09
5. కంట్రోల్ నకాష్ అజీజ్, మనీష్ జె. టిప్పు, గీత్ సాగర్, శ్రీరామ చంద్ర, అమితాబ్ భట్టాచార్య 3:36
6. వో దిన్ (సినిమా వెర్షన్) తుషార్ జోషి 5:12
7. ఖైరియత్ (బోనస్ ట్రాక్) అరిజిత్ సింగ్ 4:30

మూలాలు

  1. Chhichhore, British Board of Film Classification, retrieved 3 September 2019
  2. "Chhichhore box office collection prediction: Lowest advance booking for Sushant Singh Rajput, Shraddha Kapoor starrer ,India News, Business News | Zee Business". www.zeebiz.com.
  3. "Chhichhore Box Office". Bollywood Hungama. Retrieved 26 October 2019.
  4. "National Film Awards 2019: सुशांत सिंह राजपूत की 'छिछोरे' को सर्वश्रेष्ठ हिन्दी फिल्म का राष्ट्रीय पुरस्कार, कंगना रनौत बेस्ट एक्ट्रेस". NDTVIndia. Retrieved 2022-05-13.
  5. "Sushant Singh Rajput, Shraddha Kapoor wrap up first schedule of Chhichhore shoot. See pic". Hindustan Times. 2018-10-31. Retrieved 2022-05-13.