చెన్నై సెంట్రల్-బెంగళూరు సిటీ రైలు మార్గం
చెన్నై సెంట్రల్-బెంగళూరు సిటీ రైలు మార్గం | |||
---|---|---|---|
అవలోకనం | |||
స్థితి | పనిచేస్తోంది | ||
లొకేల్ | తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక | ||
చివరిస్థానం | చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను బెంగళూరు సిటీ రైల్వే స్టేషను | ||
ఆపరేషన్ | |||
ప్రారంభోత్సవం | 1864 | ||
యజమాని | Indian Railways | ||
నిర్వాహకులు | దక్షిణ రైల్వే, నైరుతి రైల్వే | ||
డిపో (లు) | ఆవడి, అరక్కోణం, కృష్ణరాజపురం, బెంగళూరు కంటోన్మెంటు, బెంగళూరు | ||
రోలింగ్ స్టాక్ | WAP-1, WAP-4, WAP-5, WAP-7, WAG-7, WAG-9 ఎలక్ట్రిక్ లోకోలు; WDS-6, WDM-2, WDM-3A, WDP-4, WDG-3A, WDG-4, WDS-4 డీజిల్ లోకోలు | ||
సాంకేతికం | |||
ట్రాక్ పొడవు | ప్రధాన మార్గం:358 కి.మీ. (222 మై.) శాఖా మార్గాలు: బంగారపేట-కోలార్-బయ్యప్పనహళ్ళి166 కి.మీ. (103 మై.) బంగారపేట-మారికుప్పం16 కి.మీ. (10 మై.) | ||
ట్రాక్ గేజ్ | 5 ft 6 in (1,676 mm) బ్రాడ్ గేజి | ||
ఆపరేటింగ్ వేగం | Up to 110 km/h | ||
|
చెన్నై సెంట్రల్-బెంగళూరు సిటీ లైన్ (అధికారికంగా పురట్చి తలైవర్ డాక్టర్. MG రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్-క్రాంతివీర సంగొల్లి రాయన్న - బెంగళూరు స్టేషన్ లైన్) దక్షిణ భారతదేశంలోని రెండు అతిపెద్ద నగరాలైన చెన్నై. బెంగుళూరులను కలిపే విద్యుదీకరించబడిన డబుల్ లైన్ రైలు మార్గం.
చరిత్ర
1856లో దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి రైలు సేవ, భారతదేశంలో మూడవది మద్రాసు రైల్వే ద్వారా రాయపురం / వేయసరపాడు నుండి వాలాజా రోడ్ (ఆర్కాట్) వరకు నిర్వహించబడింది. మద్రాసు రైల్వే 1861లో దాని ట్రంక్ మార్గాన్ని బేపూర్ / కడలుండి (కాలికట్ సమీపంలో) వరకు విస్తరించింది. మద్రాస్ రైల్వే 1864లో కొత్తగా నిర్మించిన బేపూర్ లైన్‌లో బెంగుళూరు కంటోన్మెంట్‌ను జోలార్‌పేటకు అనుసంధానించింది. అదే సంవత్సరం బెంగుళూరు మెయిల్ రన్ నడవడం మొదలైంది. [1] బెంగుళూరు నగరం 1882లో బెంగుళూరు కంటోన్మెంట్‌తో అనుసంధానించబడింది [2] బౌరింగ్‌పేట్ (తరువాత బంగారుపేట), కోలార్ మధ్య నారో-గేజ్ లైన్ 1913లో మైసూర్ స్టేట్ రైల్వే ద్వారా ప్రారంభించబడింది. నారో-గేజ్ యశ్వంతపూర్-యెలహంక-దేవనహళ్లి-చిక్కబల్లాపూర్-కోలార్ లైన్ 1915లో మొదలై 1918లో బెంగుళూరుకు అనుసంధానించబడింది [3] 2013 నవంబరులో చిక్కబల్లాపూర్-కోలార్ సెక్షన్ను బ్రాడ్ గేజ్‌గా మార్చడం పూర్తవడంతో, బెంగళూరు-కోలార్ సెక్షన్ మొత్తం డైరెక్ట్ బ్రాడ్ గేజ్ రైళ్లకు సిద్ధమైంది. [4] [5] బంగారుపేట-కోలార్ లైన్ గేజ్ మార్పిడి 1997లో పూర్తయింది. అప్పటి నుండి 2016 సెప్టెంబరు 11 వరకు రైల్‌బస్ నడిచింది. ఎనిమిది బోగీల డీజిల్-ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (DEMU) మొదలవడంతో రైల్‌బస్ సర్వీసును ఆపేసారు. [6] [7]
షెడ్లు, వర్క్‌షాప్‌లు
అరక్కోణంలో ఇంతకుముందు స్టీమ్ లోకో షెడ్ ఉండేది. ఇప్పుడు 230+ లోకోలు ఉండే ఎలక్ట్రిక్ లోకో షెడ్ ఉంది. ఇందులో WAP-1 WAP-4 WAG-7, WAM-4, WAG-5 లోకోమోటివ్‌లు ఉన్నాయి. [8]
1983లో ప్రారంభించిన కృష్ణరాజపురం డీజిల్ లోకో షెడ్‌లో 125 ఇంజన్లు ఉంటాయి. వీటిలో: WDS-6, WDM-2, WDM-3A, WDP-4, WDG-3A, WDG-4 ఉన్నాయి. డీజిల్ ఎలక్ట్రిక్ లోకో షెడ్‌గా మార్చడంలో భాగంగా ఇటీవల, రోయపురం షెడ్ నుండి బదిలీ చేయబడిన 5 WAP-7 లోకోమోటివ్‌లు కూడా ఇక్కడ ఉన్నాయి. [9]
జోలార్‌పేటైలో ఎలక్ట్రిక్/డీజిల్ ట్రిప్ షెడ్ ఉంది. [10] పెరంబూర్‌లోని క్యారేజ్, వ్యాగన్ వర్క్‌షాప్‌లు కోచ్‌లు, వ్యాగన్‌లను రిపేర్ చేస్తాయి. పెరంబూర్‌లోని లోకోమోటివ్ వర్క్‌షాప్‌లు దక్షిణాన ప్రధాన బ్రాడ్-గేజ్ స్టీమ్ లోకో రిపేర్ షాప్. ఇప్పుడు కూడా ఫెయిరీ క్వీన్ కు వార్షిక మరమ్మతులు చేస్తుంది. వర్క్‌షాప్ ఇప్పుడు ప్రధానంగా దక్షిణాది నుండి, బయటి నుండీ వచ్చే ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌లకు మరమ్మత్తులు, నిర్వహణ పనులు చేస్తుంది. [11]
బేసిన్ బ్రిడ్జిలో క్యారేజ్ నిర్వహణ వసతులు ఉన్నాయి. అవడిలో బ్రాడ్-గేజ్ EMU నిర్వహణ, కార్ షెడ్ ఉన్నాయి. అరక్కోణంలో ఇంజనీరింగ్ వర్క్‌షాప్‌లు ఉన్నాయి. [12]
మూలాలు
- ↑ "IR History – Early days". 1832–1869. IRFCA. Retrieved 19 December 2013.
- ↑ "IR History: Early days II". 1870–1899. IRFCA. Retrieved 19 December 2013.
- ↑ "IR History: Part III (1900–1947)". IRFCA. Retrieved 19 December 2013.
- ↑ "76552/Kolar – Bangalore City DEMU (via Chik Ballapur)". India Rail Info. Retrieved 19 December 2013.
- ↑ "Railway line proposed by Indira". The New Indian Express. 2 November 2013. Archived from the original on 23 డిసెంబరు 2013. Retrieved 19 December 2013.
- ↑ Satish, Shalini. "Railcar's last stop". Deccan Herald. Retrieved 19 December 2013.
- ↑ TNN, TNN. "Curtains come down on state's single-bogie rail bus". Times of India. Retrieved 15 October 2017.
- ↑ "Sheds and Workshops". IRFCA. Retrieved 18 December 2013.
- ↑ "Sheds and Workshops". IRFCA. Retrieved 18 December 2013.
- ↑ "Sheds and Workshops". IRFCA. Retrieved 18 December 2013.
- ↑ "Sheds and Workshops". IRFCA. Retrieved 18 December 2013.
- ↑ "Sheds and Workshops". IRFCA. Retrieved 18 December 2013.