జి. మునిరత్నం నాయుడు

గుత్తా మునిరత్నం నాయుడు
జి. మునిరత్నం నాయుడు
జననంగుత్తా మునిరత్నం నాయుడు
1936, జనవరి 6
తమిళనాడులోని తిరుత్తణి కి సమీపంలోని కనకమ్మసత్రం
ఇతర పేర్లుజి. మునిరత్నం నాయుడు
ప్రసిద్ధిసామాజిక కార్యకర్త
తండ్రిరంగయ్య నాయుడు
తల్లిమంగమ్మ

గుత్తా మునిరత్నం నాయుడు చిత్తూరు జిల్లాకు చెందిన సామాజిక కార్యకర్త. పద్మశ్రీ పురస్కార గ్రహీత.

జీవిత విశేషాలు

మునిరత్నం తమిళనాడులోని తిరుత్తణికి సమీపంలోని కనకమ్మసత్రంలో రంగయ్య నాయుడు, మంగమ్మ దంపతులకు 1936, జనవరి 6 వ తేదీన జన్మించారు.

1981లో ప్రముఖ కాంగ్రెస్‌ నాయకులు రాజగోపాల్‌నాయుడు, ప్రముఖ సామాజక శాస్త్రవేత్త, రైతు నాయకుదు ఆచార్య ఎన్‌.జి. రంగాతో కలిసి 'రాయలసీమ సేవా సమితి' సంస్థ ఏర్పాటు చేశారు. క్రమేణా ఆ సంస్థ రాయలసీమకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది. దీంతో ఆ సంస్థ పేరును రాష్ట్రీయ సేవా సమితిగా మార్చారు. ప్రస్తుతం ఆ సంస్థ శిశువిహార్‌, బాల విహార్‌, ఛైల్డ్‌ స్పాన్సర్‌షిప్‌ ప్రోగ్రాం, అంగన్‌వాడీ కేంద్రాలు, వయో వృద్ధులకు పునరావాస కేంద్రం, వితంతు పునరావాస కేంద్రం, కృషి విజ్ఞాన కేంద్రం, స్వధార్‌ హోం, మత్తు మందు బానిసల పునరావాస కేంద్రం తదితర సేవల ద్వారా ప్రజలకు చేరువైంది.

మునిరత్నం సేవలను గుర్తించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు అవార్డులను ప్రదానం చేసింది. 1989లో ఇందిరాగాంధీ నేషనల్‌ అవార్డు, 1991లో శిరోమణి, 1992లో జెమ్‌ ఆఫ్‌ ఇండియా, 1993లో బాలబంధు, 1996లో నవాబ్‌ మెహిదీ నవాజ్‌జంగ్‌ బెస్ట్‌ వెల్ఫేర్‌, 1998లో పైడి లక్ష్మయ్య మెమోరియల్‌, 2006లో రాజీవ్‌గాంధీ మానవసేవ, 2010లో హరిజన బంధు అవార్డులను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది.

1981 నుండి రాష్ట్రీయ సేవాసమితి స్వచ్ఛంద సేవా సంస్థ సంస్థాపక గౌరవ కార్యదర్శిగా సేవలందిస్తున్నాడు. బడుగు వర్గాలు, స్త్రీలు, పిల్లలు, వికలాంగులు, వృద్ధుల సంక్షేమం కోసం వివిధ సంస్థలు స్థాపించాడు. వివిధ ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల్లో కీలక పదవులు నిర్వహిస్తున్నాడు. వికలాంగుల జాతీయ కమిషన్‌లో అసోసియేషన్‌ మెంబర్‌, సీఏపీఏఆర్‌టీ సెంట్రల్‌ కమిటీలో ఎగ్జిక్యూటివ్‌ కమిటీ మెంబర్‌గా పనిచేస్తున్నాడు. బాల భారతికి చైర్‌పర్సన్‌గా ఉన్నాడు. ఆయన సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం 2012లో పద్మశ్రీ అవార్డును ప్రదానం చేసింది. ఈయన బ్రహ్మచారి. మరణం గుత్తా మునిరత్నం నాయుదు తన తుది శ్వాస వరకు సమాజ సేవలో గదిపి 2021,మే నెల 5వ తేదిన మరణించారు.

సూచికలు

యితర లింకులు