ఢిల్లీ కంటోన్మెంట్
Delhi Cantonment | |
---|---|
District Subdivision | |
Coordinates: 28°35′46″N 77°07′48″E / 28.596°N 77.130°E | |
దేశం | India |
రాష్ట్రం | Delhi |
జిల్లా | New Delhi |
విస్తీర్ణం | |
• Total | 43 కి.మీ2 (17 చ. మై) |
జనాభా (2011) | |
• Total | 1,16,352 |
• జనసాంద్రత | 2,700/కి.మీ2 (7,000/చ. మై.) |
భాషలు | |
• అధికార | హిందీ,ఆంగ్లం |
Time zone | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | 110010 |
టెలిఫోన్ కోడ్ | 91-011 |
District- South West District |
ఢిల్లీ కంటోన్మెంట్, దీనిని ఢిల్లీ కాంట్ అని కూడా పిలుస్తారు. ఇది 1914 లో స్థాపించబడింది.1938 ఫిబ్రవరి వరకు, కంటోన్మెంట్ బోర్డు ఢిల్లీని, కాంట్ అథారిటీ అని పిలుస్తారు.కంటోన్మెంట్ వైశాల్యం సుమారు 4,258 హెక్టార్లు (10,521 ఎకరాలు) లలో విస్తరించి ఉంది. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం కంటోన్మెంట్ పరిధిలో మొత్తం 1,16,352 మంది జనాభాను కలిగి ఉంది. ఇది కంటోన్మెంట్ బోర్డు క్లాస్ I వర్గం కిందకు వస్తుంది.
2006 భారత కంటోన్మెంట్సు చట్టంప్రకారం, కంటోన్మెంట్ బోర్డుచే నిర్వహించబడుతుంది.[2] అయితే ఈ ప్రాంతానికి సంబంధించిన వివిధ విధాన లేఖలు, పరిపాలనకు సంబంధించిన సూచనలు ఎప్పటికప్పుడు రక్షణ మంత్రిత్వ శాఖ ద్వారా జారీ చేయబడతాయి.బోర్డు స్థానిక పురపాలక సంఘంగా పనిచేస్తున్నప్పటికీ, ఇది కొత్త ఢిల్లీ డైరెక్టరేట్ జనరల్ డిఫెన్సు ఎస్టేట్సు , ప్రిన్సిపల్ డైరెక్టర్, డిఫెన్సు ఎస్టేట్సు, వెస్ట్రన్ కమాండ్, చండీగర్ పరిపాలనా నియంత్రణలో ఉంది.[3]
చరిత్ర
ఢిల్లీ, అహ్మదాబాదులో కంటోన్మెంట్లును మొదట బ్రిటిష్ వారు స్థాపించారు.ఢిల్లీ కంటోన్మెంట్, ఇండియన్ ఆర్మీ ప్రధాన కార్యాలయం, ఆర్మీ గోల్ఫ్ కోర్సు; రక్షణ సేవల అధికారుల సంస్థ; సైనిక గృహాలు; ఆర్మీ, వైమానిక దళ ప్రభుత్వ పాఠశాలలు; వివిధ ఇతర రక్షణ సంబంధిత సంస్థాపనలు ఢిల్లీ ప్రాంతంలో ఉన్నాయి
కంటోన్మెంట్లో ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ హాస్పిటల్ ఉంది. ఇది భారతదేశ సాయుధ దళాల తృతీయ సంరక్షణ వైద్య కేంద్రంగా ఉంది.
ఢిల్లీ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్, కంటోన్మెంట్ పరిధి లోపల ఒక రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడ నుండి దేశంలోని వివిధ ప్రాంతాలకు రైళ్లు బయలుదేరుతాయి.
జనాభా
2001 భారత జనాభా లెక్కల ప్రకారం [4] ఢిల్లీ కాంట్ 1,24,452 జనాభాను కలిగి ఉంది. అందులో పురుషులు 61% మంది కాగా, స్త్రీలు 39% మంది ఉన్నారు. ఢిల్లీ కాంట్ సగటు అక్షరాస్యత రేటు 77%గా అంది.ఇది జాతీయ సగటు 74% కంటే ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 83% కాగా, స్త్రీల అక్షరాస్యత 68%గా ఉంది.ఢిల్లీ కాంట్ జనాభాలో 12% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు.
2011 భారత జనాభా లెక్కల ప్రకారం [5] ఢిల్లీ కాంట్ మొత్తం 1,16,352 మంది జనాభాను కలిగి ఉంది.అందులో పురుషులు 58% మంది (67,703) కాగా, స్త్రీలు 42% మంది (48,649) ఉన్నారు. ఢిల్లీ కాంట్ సగటు అక్షరాస్యత 91.11% గా ఉంది.ఇది జాతీయ సగటు 79.9% కంటే ఎక్కువ.పురుషుల అక్షరాస్యత 94.54%, స్త్రీల అక్షరాస్యత 86.26%. ఢిల్లీ కాంట్ జనాభాలో 11.36% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు.
రవాణా
ఢిల్లీ కంటోన్మెంట్ రహదారి, రైల్వే, వాయు మార్గం ద్వారా అనుసంధానించబడి ఉంది.ఢిల్లీ కంటోన్మెంట్ నుండి 5 కి.మీ. దూరంలో ఢిల్లీ విమానాశ్రయం ఉంది.దీనికి సమీపంలో ఢిల్లీ కంటోన్మెంట్ మెట్రో స్టేషనును కలిగి ఉంది.ఢిల్లీ కంటోన్మెంట్‌లో రైల్వే స్టేషన్ ఉంది.ఢిల్లీ నుండి రాజస్థాన్, గుజరాత్ వైపు వెళ్లే దాదాపు అన్ని రైళ్లు ఇక్కడ ఆగుతాయి.
కంటోన్మెంట్ ప్రాంతానికి సమీపంలోని నివాస ప్రాంతాల నివాసితులు, రోడ్డు మార్గం ద్వారా, స్థానిక బస్సులు ద్వారా, సులభంగా చేరుకోవచ్చు. కంటోన్మెంట్ ప్రాంతానికి పాలం, ద్వారకా, ధౌలా కువాన్, తిలక్ నగర్, వసంత్ విహార్, నరియానా జానకపురి, ఢిల్లీ మెట్రో రైలు స్టేషన్లు సమీపంలో ఉన్నాయి.
ఇవి కూడా చూడండి
మూలాలు
- ↑ "About Delhi".
- ↑ Document, http://www.cbdelhi.in/Documents/ca2006.pdf Archived 31 మే 2014 at the Wayback Machine
- ↑ "Delhi Cantonment Board, Ministry of Defence". Archived from the original on 31 May 2014. Retrieved 30 May 2014.
- ↑ https://web.archive.org/web/20040616075334/http://www.censusindia.net/results/town.php?stad=A&state5=999. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01
- ↑ "Delhi Cantonment City Census 2011 data". census2011.co.in. Retrieved 7 July 2018.