తాడూరి బాలాగౌడ్

తాడూరి బాలాగౌడ్ ఎం.పీ

నిజామాబాదు లోక్‌సభ సభ్యుడు

వ్యక్తిగత వివరాలు

జననం (1931-10-02)1931 అక్టోబరు 2
ఐలాపురం, నిజామాబాదు జిల్లా, ఆంధ్రప్రదేశ్
మరణం 1 మార్చి 2010(2010-03-01) (aged 78)
హైదరాబాదు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రేసు
జీవిత భాగస్వామి లక్ష్మీదేవి
సంతానం 1 కొడుకు
నివాసం హైదరాబాదు
జూలై 18, 2013నాటికి

తాడూరి బాలాగౌడ్ (అక్టోబర్ 2, 1931 - మార్చి 1, 2010) భారత జాతీయ కాంగ్రేస్ నాయకుడు, నిజామాబాదు జిల్లా లోక‌సభ సభ్యుడు. టి.అంజయ్య, భవనం వెంకట్రామ్ మంత్రివర్గాల్లో రాష్ట్ర మంత్రిగా పనిచేశాడు. గ్రామస్థాయి నుండి ఢిల్లీ రాజకీయాల వరకు ఎదిగిన బాలాగౌడ్‌ ఎమ్మెల్యేగా, మంత్రిగా, జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా ఎంపి పదవులు చేపట్టడంతో పాటు పలు వ్యాపార రంగాల్లో అభివృద్ధి సాధించడంతోపాటు వందలాది మందికి ఉపాధి కల్పించాడు.[1] "వెనుకబడిన వర్గాల్లో తిరుగులేని నాయకునిగా బాలాగౌడ్‌ ఎదిగారని, ఆయన తన జీవితాంతం బలహీనవర్గాల హక్కులకోసం శ్రమించారని" బాలాగౌడ్ సంతాప సభలో అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.రోశయ్య అన్నాడు[2]

జననం

బాలాగౌడ్ 1931, అక్టోబర్ 2నిజామాబాదు జిల్లా, లింగంపేట మండలంలోని ఐలాపురం గ్రామంలో జన్మించాడు. ఈయన భార్య లక్ష్మీదేవి. సంపన్న కుటుంబంలో పుట్టినా అట్టడుగు వర్గాలకోసం జీవితం చివరి అంకం వరకు బాలాగౌడ్‌ పోరాడాడు. గౌడ ఉపకులాలను ఒకే తాటిపైకి తెచ్చి వెనుకబడిన కులాల అభ్యున్నతికోసం, గీత వృత్తి పరిరక్షణ కోసం కృషిచేశాడు.

బాలాగౌడ్ మాజీ లోక్సభ సభ్యుడు ముదుగంటి రాంగోపాలరెడ్డి అనుయాయిగా రాష్ట్ర స్థాయి రాజకీయాల్లోకి ప్రవేశించాడు. 1978లో యెల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రేసు అభ్యర్థిగా శాసనసభ ఎన్నికై టి.అంజయ్య, భవనం వెంకట్రామ్ మంత్రివర్గాల్లో 1982 వరకు రాష్ట్ర మంత్రిగా పనిచేశాడు. అయితే ఈయన 1983లో అదే నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయాడు. బాలాగౌడ్ 1984లో, 1989లో రెండు పర్యాయాలు నిజామాబాదు నియోజకవర్గం నుండి పార్లమెంటుకు ఎన్నికయ్యాడు కానీ 1991 ఎన్నికలలో లోక్సభకు పోటీచేసి ఓడిపోయాడు.

మరణం

2010, మార్చి 1 న మరణించారు.

మూలాలు