తెన్నేటి పార్కు

తెన్నేటి పార్క్
తెన్నేటి పార్క్
రకంపట్టణ పార్క్
స్థానంబీచ్ రోడ్
సమీప పట్టణంవిశాఖపట్నం, భారతదేశం
అక్షాంశరేఖాంశాలు17°44′53″N 83°21′00″E / 17.747944°N 83.349915°E / 17.747944; 83.349915
నవీకరణ10 జనవరి 1991; 34 సంవత్సరాల క్రితం (1991-01-10)

తెన్నేటి పార్క్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగరంలోని జోడుగుళ్ళపాలెం, బీచ్ రోడ్‌లో ఉన్న అర్బన్ పార్క్.[1][2]

చరిత్ర

రాజకీయ నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు తెన్నేటి విశ్వనాధం పేరుమీద ఈ పార్క్ పేరు పెట్టారు. పార్క్ ప్రాంగణంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.ఇది నగరంలోని తొలి పిల్లల పార్క్, పురాతన ఉద్యానవనాలలో ఒకటి. నగరంలో పర్యాటకాన్ని పెంచడానికి జివిఎంసి ( గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ )ఈ పార్కులో ఎల్‌ఇడి స్క్రీన్‌లను ఏర్పాటు చేసింది.[3][4]

ఇతర వివరాలు

పర్యాటక ప్రయోజనాల కోసం తెనేటి పార్క్ ను ఇటీవల పునరుద్ధరించారు. ఇక్కడినుండి పార్క్ వెనుక ఉన్న కైలాసగిరి కొండలకు కూడా వెళ్ళవచ్చు. పార్క్ లో ఉన్న రైలు ప్రయాణం ద్వారా సమీప కొండ సహజ దృశ్యాలు చూడవచ్చు. వారంలోని అన్ని రోజులలో పార్క్ ఉదయం 6:00 నుండి రాత్రి 9:00 వరకు తెరిచి ఉంటుంది. పార్కులోకి ప్రవేశించడానికి ప్రవేశ రుసుము అవసరం లేదు.

హుధుద్ తుఫాను కారణంగా ధ్వంసమైన ఈ పార్క్ ను పునరుద్ధరించడానికి ఉత్తర అమెరికాకు చెందిన గీతం పూర్వ విద్యార్థులు కలిసి సుమారు 60 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు.[5]

బంగాళాఖాతం తీర సమీపంలో ఈ పార్క్ ఉండడంవల్ల ఇక్కడ వేడి, తేమతో కూడిన వాతావరణం ఉంటుంది. వేసవికాలంలో నలభై ఐదు డిగ్రీల కంటే ఎక్కువ, శీతాకాలంలో పద్దెనిమిది నుండి ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత ఉంటుంది. వర్షాకాలంలో బీచ్‌లో సగటున తొమ్మిది వందల నలభై ఐదు మిల్లీమీటర్ల వర్షపాతంతో భారీ వర్షాలు కురుస్తాయి.

తెన్నెట్టి విశ్వనాధం విశాఖపట్నంలో ప్రసిద్ధ రాజకీయ నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు,, ఈ పార్కుకుకి అతని పేరు పెట్టబడింది. తెన్నేటి బీచ్ పార్క్‌లో రాజకీయ నాయకుడి విగ్రహం ఉంది, మీరు ప్రధాన ద్వారం గుండా ప్రవేశించిన వెంటనే చూడవచ్చు.[6]

మూలాలు