దోడా

దోడా (దోడా జిల్లా)
దోడా (దోడా జిల్లా) is located in Jammu and Kashmir
దోడా (దోడా జిల్లా)
దోడా (దోడా జిల్లా)
జమ్మూ కాశ్మీరులో దోడా స్థానం
దోడా (దోడా జిల్లా) is located in India
దోడా (దోడా జిల్లా)
దోడా (దోడా జిల్లా)
దోడా (దోడా జిల్లా) (India)
Coordinates: 33°08′N 75°34′E / 33.13°N 75.57°E / 33.13; 75.57
దేశం భారతదేశం
రాష్ట్రంజమ్మూ కాశ్మీరు
జిల్లాదోడా
విస్తీర్ణం
 • Total2,625 కి.మీ2 (1,014 చ. మై)
Elevation
1,107 మీ (3,632 అ.)
జనాభా
 (2011)
 • Total21,605
 • జనసాంద్రత8.2/కి.మీ2 (21/చ. మై.)
Time zoneUTC+5:30
పిన్‌కోడ్
182202
Vehicle registrationJK06

దోడా అనేది భారత కేంద్రపాలిత భూభాగమైన జమ్మూ కాశ్మీరు‌ రాష్ట్రంలోని దోడా జిల్లాకు చెందిన ఒక పట్టణం, నగరపంచాయితీ. దోడా 33°08′N 75°34′E / 33.13°N 75.57°E / 33.13; 75.57 వద్ద ఉంది.[1] సముద్రమట్టానికి 1,107 మీటర్లు (3631 అడుగులు) సగటు ఎత్తులో ఉంది. దోడా నగరాన్ని 13 వార్డులుగా విభజించారు. వీటికి ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి.[2]

వాతావరణం

దోడా ప్రాంత వాతావరణం ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి విస్తృత వైవిధ్యాల కారణంగా ఏకరీతిగా ఉండదు.ఈ ప్రాంతం, సాధారణంగా ఉప ఉష్ణమండల వాతావరణంతో సమశీతోష్ణతను కలిగి ఉంటుంది.వాతావరణం దాదాపుగా పొడిగానే ఉంటుంది.వర్షపాతం చాలా తక్కువ.దోడాజిల్లా ఉష్ణోగ్రతలు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మారుతుంటాయి.రాంబాన్,దోడా తాలూకాలు చాలా వేడిగా ఉంటాయి.అయితే పాడర్,మార్వా,వార్వాన్ ప్రాంతాలలో వాతావరణం సంవత్సరంలో ఐదు ఆరు నెలలు మంచుతో నిండుకుని ఉంటాయి.

సాధారణంగా వేసవి,వర్షం అవపాతం లేకుండా ఉంటుంది.ఈ ప్రాంతాలు శీతాకాలంలో హిమపాతంతో కప్పబడిఉంటాయి.వేసవి నెలల్లో ఏప్రిల్ నుండి జూలై వరకు చాలా వేడిగా ఉంటుంది.కాని శీతాకాలం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.అవపాతం అధిక ప్రాంతాలలో హిమపాతం రూపంలో,దిగువ ప్రాంతాలలో వర్షపాతంలాగా సంభవిస్తుంది. జూలై నుండి సెప్టెంబరు వరకు వర్షాకాలం ఉంటుంది.దోడా జిల్లాలో జూలై, సెప్టెంబర్ నెలల్లో వర్షపాతం చాలా ఎక్కువుగా ఉంటుంది.సగటు వార్షిక వర్షపాతం 926 మి.మీ.,హిమపాతం 135 మి.మీ. ఉంటుంది.

జనాభా గణంకాలు

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం దోడా పట్టణ జనాభా మొత్తం 21,605, ఇందులో 12,506 మంది పురుషులు, 9,099 మంది మహిళలు ఉన్నారు. 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 2726, ఇది దోడా పరిధిలోని మొత్తం జనాభాలో 12.62%గా ఉంది.లింగ నిష్పత్తి రాష్ట్ర సగటు జనాభా 889 కు వ్యతిరేకంగా 728 గా ఉంది.[2][3]

అంతేకాకుండా జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర సగటు జనాభా 862 తో పోలిస్తే దోడాలో బాలల లైంగిక నిష్పత్తి 833 గా ఉంది. దోడా నగర అక్షరాస్యత రాష్ట్ర సగటు 67.16 కన్నా 85.10% ఎక్కువగా గా ఉంది. దోడాలో పురుషుల అక్షరాస్యత 92.15% కాగా, మహిళా అక్షరాస్యత 75.22%.గా ఉంది.

దోడా పట్టణ పరిధిలో మొత్తం 4,597 గృహాలు కలిగి ఉన్నాయి.వీటికి నీటి సరఫరా, మురుగునీరు పారుదల సౌకర్యాల వంటి ప్రాథమిక సౌకర్యాలను స్థానిక పురపాలక సంఘం సమకూర్చింది.పట్టణ పరిధిలో రహదారులను నిర్మించడానికి, నిర్వహించటానికి దాని పరిధిలోకి వచ్చే ఆస్తులపై పన్ను విధించడానికి పురపాలక సంఘానికి అధికారం ఉంది.

దోడా పట్టణ గణాంకాలు

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం దోడా పట్టణ పరిధిలో మతాలు గణాంకాలు ఈ విధంగా ఉన్నాయి.[4]

  • హిందువులు: 32.62%,
  • ముస్లింలు: 66.45%,
  • క్రిస్టియన్సు: 0.12%,
  • సిక్కులు: 0.64%,
  • బౌద్ధులు: 0.00%
  • జైనులు: 0.06%,
  • ఇతరులు: 0.11%

సరాసరి వాతావరణ వివరాలు

శీతోష్ణస్థితి డేటా - దోడా (జమ్మూ కాశ్మీరు), భారతదేశం
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
సగటు అధిక °C (°F) 7.6
(45.7)
10.7
(51.3)
16.1
(61.0)
21.4
(70.5)
25.5
(77.9)
29.3
(84.7)
30.4
(86.7)
29.8
(85.6)
27.8
(82.0)
22.9
(73.2)
16.3
(61.3)
9.9
(49.8)
20.6
(69.1)
సగటు అల్ప °C (°F) −1.9
(28.6)
0.7
(33.3)
4.1
(39.4)
7.8
(46.0)
11.1
(52.0)
15.2
(59.4)
18.5
(65.3)
17.6
(63.7)
12.9
(55.2)
6.1
(43.0)
1
(34)
−1.3
(29.7)
7.7
(45.8)
సగటు అవపాతం mm (inches) 11.8
(0.46)
28.5
(1.12)
39.6
(1.56)
23.3
(0.92)
21
(0.8)
27.3
(1.07)
29.3
(1.15)
29.8
(1.17)
2.5
(0.10)
10.7
(0.42)
9.4
(0.37)
13.4
(0.53)
246.6
(9.67)
Source 1: World Weather Online[5]
Source 2: Meoweather[6]

మూలాలు

  1. Falling Rain Genomics, Inc - Doda
  2. 2.0 2.1 "Doda Municipal Committee City Population Census 2011-2020 | Jammu and Kashmir". www.census2011.co.in. Retrieved 2020-11-13.
  3. https://web.archive.org/web/20040616075334/http://www.censusindia.net/results/town.php?stad=A&state5=999
  4. https://censusindia.gov.in/2011census/dchb/0116_PART_B_DCHB_DODA.pdf
  5. "Doda, India Weather Averages - Monthly Average High and Low Temperature - Average Precipitation and Rainfall days". World Weather Online. Retrieved 5 August 2013.
  6. "Doda weather history. Doda average weather by month. Weather history for Doda, Jammu and Kashmir, India". Meoweather. Retrieved August 4, 2013.

వెలుపలి లంకెలు