ధర్మయోగి

ధర్మయోగి
దర్శకత్వంఆర్.ఎస్. దురై సెంథిల్ కుమార్
రచనఅమృతరాజ్ (డైలాగ్స్)
స్క్రీన్ ప్లేఆర్.ఎస్. దురై సెంథిల్ కుమార్
కథఆర్.ఎస్. దురై సెంథిల్ కుమార్
నిర్మాతవెట్రిమారన్
తారాగణంధనుష్
ఛాయాగ్రహణంవెంకటేష్ ఎస్
కూర్పుప్రకాష్ మబ్బు
సంగీతంసంతోష్ నారాయణన్
నిర్మాణ
సంస్థ
గ్రాస్ రూట్ ఫిల్మ్ కంపెనీ
పంపిణీదార్లుఎస్కేప్ ఆర్టిస్ట్స్ మోషన్ పిక్చర్స్
విడుదల తేదీ
28 అక్టోబరు 2016 (2016-10-28)
దేశంభారతదేశము
భాషతెలుగు
బాక్సాఫీసు₹33 crore[1]

ధర్మయోగి 2016 లో విడుదల అయిన తెలుగు సినిమా. గ్రాస్ రూట్ ఫిల్మ్ కంపెనీ బ్యానర్ పై వెట్రిమారన్ నిర్మించిన ఈ చిత్రానికి ఆర్ఎస్ దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ధనుష్, అనుపమ పరమేశ్వరన్, త్రిష నటించారు. ఇది తమిళ సినిమా "కోడి" కి అనువాదం.

నటవర్గం

కథ

ధర్మ, యోగి ఇద్దరు కవల పిల్లలు. యోగికి చిన్నప్పటినుండి రాజకీయాలు అంటే ఇష్టం. ధర్మ కాలేజీలో ప్రొఫెసర్. యోగి రాజకీయాలలో ఉండే రుద్రని ప్రేమిస్తాడు. యోగిని ఎంఎల్ఏ గా పోటీ చేయమని అతని పార్టీ వాళ్ళు ఒత్తిడి తెస్తారు. కానీ యోగి ఒప్పుకోడు. ధర్మ ప్రేమించిన మాలతి వాళ్ళ అక్క కుటుంబం, వాళ్ళ ఊరివాళ్ళు పాదరస ఫ్యాక్టరీ కారణంగా వ్యాధులతో ఇబ్బంది పడతారు. ఈ విషయం యోగి బయటపెడతాడు. దాన్ని బయట పెట్టినందుకు అతని పార్టీ వాళ్ళు యోగిని ఎంఎల్ఏ గా పోటీ చేయిస్తారు. ఒకే నియోజక వర్గంలో రుద్ర, యోగి పోటీచేస్తారు. పదవీ వ్యామోహంతో, ఓడిపోతానని భయంతో రుద్ర యోగిని చంపుతుంది. ఆ తరువాత తన పార్టీ తరపున ధర్మని ఎంఎల్ఏ పోటీ చేయించి గెలిపిస్తుంది. రుద్ర మినిస్టర్ అవుతుంది. ధర్మ వాళ్ళ అన్నని చంపింది ఎవరని ఎంక్వయిరీ చేపిస్తాడు. నిజం ఎక్కడ బయట పడుతుందో అని రుద్ర ధర్మ వాళ్ళ అమ్మని కిడ్నాప్ చేసి ధర్మని అక్కడకి రమ్మని పిలుస్తుంది. ధర్మ వచ్చాక యోగిని చంపింది తానే అని నిజం చెపుతుంది. రౌడీలను కొట్టి రుద్రని ఏమి అనకుండా వాళ్ళ అమ్మని ధర్మ తీసుకోని పోతాడు. కానీ యోగి స్నేహితుడు రుద్రని చంపేస్తాడు.

పాటలు

  • ఏ డింగిరి
  • యోగి[3]
  • లాలి జో జో
  • పువ్వుల మాసం
  • యెర్ర కారం

మూలాలు

  1. "Kodi 7-day box office collection: Dhanush's film successfully completes its first week in theatres". International Business Times. 4 November 2016. Retrieved 4 November 2016.
  2. Davis, Maggie. "dharmayogi movie review: Dhanush & Trisha Krishnan's film gets the BEST political thriller label | India.com". www.india.com. Retrieved 2022-06-03.
  3. "Dharma Yogi Songs". Naa Songs. 2016-10-22. Retrieved 2022-06-03.