ధార్వాడ్ (కర్ణాటక)
Dharwad
Dharwar | |
---|---|
City | |
Karnatak University SDM College of Medical Sciences SDM Hospital Inpatient Block Karnatak College (KCD) University of Agricultural Sciences CSI Hebich Memorial Church Indian Institute of Information Technology, Dharwad Kumaraswamiji Tapovan Indian Institute of Technology Dharwad | |
Nickname(s): Pedha Nagari, Hubli-Dharwad City, Dharanagari, Vidya Kashi, Sanskratika nagari, Education Hub of Karnataka, Oxford of Karnataka.[1] | |
Coordinates: 15°27′30″N 75°00′30″E / 15.45833°N 75.00833°E | |
Country | India |
State | Karnataka |
District | Dharwad |
Region | Bayaluseeme |
Established | 1403 |
Founded by | Chalukya dynasty[2] |
Government | |
• Type | Municipal Corporation |
• Body |
|
• Mayor | Veena Baradwad [3] |
• MP | Pralhad Joshi |
• MLA (Hubli Dharwad West) | Arvind Bellad |
• MLA (Dharwad) | Vinay Kulkarni |
• MLA (Hubli Dharwad East) | Abbayya Prasad |
విస్తీర్ణం | |
• City | 462 కి.మీ2 (178 చ. మై) |
Elevation | 750.0 మీ (2,460.6 అ.) |
జనాభా | |
• Rank | 52nd India, 2nd Karnataka |
• జనసాంద్రత | 434/కి.మీ2 (1,120/చ. మై.) |
• Metro | 11,37,000 |
Demonym(s) | Dharwadians, Dharawadadavra. |
Languages | |
• Official | Kannada |
Time zone | UTC+5:30 (IST) |
Pincode(s) | 580 xxx |
Vehicle registration | KA-25, KA-63 |
Planning agency | Hubballi-Dharwad Urban Development Authority |
Airport | Hubli Airport(HBX) |
Rapid Transit | Hubballi-Dharwad Bus Rapid Transit System |
ధార్వాడ్, ఇది భారతదేశం, కర్ణాటక రాష్ట్రం, వాయువ్య భాగంలో ఉన్న ఒక నగరం. దీనిని ధార్వార్ అని కూడా పిలుస్తారు.ఇది ధార్వాడ్ జిల్లాకు ప్రధాన కార్యాలయం. హుబ్లీ నగరంతో కలిసి పట్టణ ప్రాంతంగా ఏర్పడింది. 1962లో హుబ్లీతో కలిసి హుబ్లీ - ధార్వాడ్ జంట నగరాలుగా ఏర్పడింది. ధార్వాడ్ నగరం 213 చ.కి.మీ (82 చ.మైళ్లు) విస్తీర్ణంలో విస్తరించి ఉంది.ఈ నగరం 430 కి.మీ. (270 మైళ్లు) విస్తీర్ణంలో విస్తరించి ఉంది. బెంగళూరుకు వాయువ్యంగా, జాతీయ రహదారి -48 లో బెంగళూరు, పూణే మధ్య 430 కి.మీ (270 మైళ్లు) దూరంలో ఉంది. 2016లో హుబ్లీ-ధార్వాడ్ నగరం సోలార్ సిటీ/గ్రీన్ సిటీ మాస్టర్ ప్లాన్‌లకు ఎంపికైంది.[4] 2017లో భారత ప్రభుత్వం హుబ్లీ-ధార్వాడ్ నగరాన్ని స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కోసం చేర్చింది, జంట నగరాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఇది ఒక ప్రధాన పథకం. [5]
వ్యుత్పత్తి శాస్త్రం
"ధార్వాడ్" అనే పదం సంస్కృత పదం 'ద్వారావత' నుండి వచ్చింది, 'ద్వార' అంటే "తలుపు", 'వాత' లేదా 'వాడ' అంటే "పట్టణం". ఇది సుదీర్ఘ ప్రయాణంలో విశ్రాంతి స్థలం లేదా చిన్న నివాసం అని అర్థం. శతాబ్దాలుగా, ధార్వాడ్ ప్రయాణీకులకు విశ్రాంతి స్థలంగా, మలెనాడు (పశ్చిమ పర్వతాలు), బయలు సీమ (మైదానాలు) మధ్య ప్రధాన ద్వారంగా ఉంటుంది. [6]
చరిత్ర
సా.శ,12వ శతాబ్దంలో చాళుక్యులు ధార్వాడను పాలించారు.సా.శ. 1117లో భాస్కరదేవ అనే పేరుతో ఒక పాలకుడు ఉండేవాడని ఒక రాతి శాసనం సూచిస్తుంది. సా.శ.14వ శతాబ్దంలో, జిల్లా మొదట బహమనీ సుల్తానేట్‌చే ఆక్రమించబడింది. ఆ తర్వాత ఇది కొత్తగా స్థాపించబడిన హిందూ రాజ్యమైన విజయనగరంలో విలీనమైంది.స్థానిక సంప్రదాయం ప్రకారం "ధర్ రావు" అనే అధికారి ధార్వాడ్ పట్టణంలో సా.శ. కోటను1403లో. నిర్మించాడు.తళ్ళికోట యుద్ధం (1565) లో విజయనగర రాజు ఓడిపోయిన తర్వాత, ధార్వాడ్ కొన్ని సంవత్సరాల పాటు దాని హిందూ గవర్నర్ ఆధ్వర్యంలో ఆచరణాత్మకంగా స్వతంత్రంగా ఉంది; కానీ 1573లో బీజాపూర్ సుల్తాన్ ఆదిల్ షా ఈ కోటను స్వాధీనం చేసుకున్నాడు. ధార్వాడ్ అతని ఆధిపత్యంలోకి చేరింది.ఆదిల్ షా తరువాత మన్నా కిల్లా, నజ్రతాబాద్ అనే ప్రాంతంలో తరువాత కోటను నిర్మించాడు.ఈ కోటతో, ధార్వాడ్ వ్యూహాత్మక ప్రాముఖ్యత పెరిగింది. ఇది ఔరంగజేబ్, శివాజీ, ఔరంగజేబ్ కుమారుడు బహదూర్ షా I, పీష్వా బాలాజీ బాజీ రావు, హైదర్ అలీ, టిప్పు సుల్తాన్, చివరకు బ్రిటిష్ వలసవాదులతో సహా తదుపరి విజేతల దృష్టిని ఆకర్షించింది. [2]
సా.శ.1685లో, కోటను మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు స్వాధీనమైంది. మొఘల్ సామ్రాజ్యం విచ్ఛిన్నమైన తర్వాత ధార్వాడ్ పూణేలోని మరాఠా పీష్వా ఆధీనంలోకి వచ్చింది. సా.శ. 1764లో,మైసూర్‌కు చెందిన హైదర్ అలీ ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు. అతను సా.శ.1778లో ధార్వాడ్ కోటను స్వాధీనం చేసుకున్నాడు. [7]ఈ కోటను సా.శ. 1791లో మరాఠాలు తిరిగి స్వాధీనం చేసుకున్నారు.సా.శ.1818లో బ్రిటీష్ వారిచే పీష్వా వరి ఓటమి తరువాత, ధార్వార్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, బొంబాయి ప్రెసిడెన్సీ భూభాగంలో విలీనం మైంది.సా.శ19వ శతాబ్దం ప్రారంభంలో, బ్రిటీష్ వారు తమ రాజ్యాలను విస్తరింపజేసినప్పుడు, వారు స్థానిక పాలకుల నుండి చాలా వ్యతిరేకతను ఎదుర్కొన్నారు.వారిలో నార్గుండ్‌లోని బాబా సాహెబ్, కిత్తూరు చెన్నమ్మ ఉన్నారు. [8]
సంస్కృతి
ధార్వాడ 'కర్ణాటక సాంస్కృతిక రాజధాని'గా పేరు పొందింది. ధార్వాడ్ ప్రాంత సాంస్కృతిక జీవితం 20వ శతాబ్దం ప్రారంభంలో అత్యుత్తమ కవులు, రచయితలు, ఆలోచనాపరులతో వికసించింది. హిందుస్థానీ సంప్రదాయ సంగీతం ఈ ప్రాంతంలోని ప్రజలలో స్వాధీన భక్తిని ప్రేరేపించే ఒక శైలి. [9] ధార్వాడ్ నగరం కర్ణాటక సంగీతం, కళా సంస్కృతి, సంగీతకారులు, కవులు, రచయితలు, వంటకాలకు ప్రసిద్ధి చెందింది. [10]
సాహిత్యం
ధార్వాడ్ కన్నడలో కొంతమంది ఉత్తమ రచయితలను పోషించింది.భాష, రాష్ట్ర సంస్కృతితో అనుబంధాన్ని కలిగి ఉన్న అనేక ప్రసిద్ధ ప్రదేశాలు ఉన్నాయి.సాహిత్యాభిమానులను ఒక్కతాటిపైకి తీసుకురావడంలో కర్ణాటక విద్యావర్ధక సంఘం కీలక పాత్ర పోషించింది.
వరకవి డిఆర్ బింద్రే ఇంటి ముందు ఉన్న సాధనకేరి వంటి ప్రదేశాలు,ఆ ప్రశాంతమైన ప్రదేశంనుండి కవి తనపద్యాలు రాయడానికి ప్రేరణ పొందాడు.
కర్నాటకకు జ్ఞానపీఠ పురస్కారం సంపాదించిన ఎనిమిది మందిలో డి.ఆర్. బేంద్రే, వి.కె.గోకాక్, గిరీష్ కర్నాడ్ ఈ ముగ్గురు జ్ఞానపీఠ పురస్కారం పొందిన ఖ్యాతి ధార్వాడ్‌కు ఉంది.
- దత్తాత్రేయ రామచంద్ర బెంద్రేను ద రా బేంద్రే అని పిలుస్తారు, సాధారణంగా 20వ శతాబ్దపు గొప్ప కన్నడ గేయ కవులలో ఒకరిగా పరిగణించుతారు. ద రా బేంద్రే 'అంబికాతనయదత్త' కలం పేరుతో రాశారు. ప్రకృతి అందాలను కీర్తిస్తూ రాసిన కవితలకు సాధనకేరి స్ఫూర్తిదాయకమని ద రా బేంద్రే అభివర్ణించారు. అతనిని 1968లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించారు. అతని 'నాకు తంతి' అనే కవితా సంపుటి అతనికి జ్ఞానపీఠ పురస్కారం సంపాదించిపెట్టింది.
- వినాయక కృష్ణ గోకాక్ (వికె గోకాక్) కన్నడ భాషలో ప్రధాన రచయిత. ఆంగ్లం, కన్నడ సాహిత్యాలలో పండితుడు. అతని ఇతిహాసం 'భారత సింధు రష్మి' అతనికి 1990లో జ్ఞానపీఠ పురస్కారం సంపాదించింది. అతను సవనూర్‌లోని మాజిద్ ఉన్నత పాఠశాల తన విద్యను పూర్తి చేశాడు. ధార్వాడ్‌లోని కర్ణాటక కళాశాలలో చేరాడు.అక్కడ అతను సాహిత్యాన్ని అభ్యసించాడు.
- గిరీష్ కర్నాడ్ భారతీయ నటుడు, చలనచిత్ర దర్శకుడు, కన్నడ రచయిత. 1998లో కన్నడ సాహిత్యం, నాటక రంగానికి అతను చేసిన అపారమైన కృషికి జ్ఞానపీఠ పురస్కారం లభించింది. గిరీష్ కర్నాడ్ ధార్వాడ్‌లోని కర్నాటక చిత్రకళ కళాశాల (కర్ణాటక విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉంది) నుండి గణితం, గణాంకాలలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (బిఎ) పట్టా పొందాడు. [11]
వంటకాలు
- జోలాడ రొట్టి ధార్వాడ్ నగరంలో చాలా ప్రజాదరణ పొందిన, చాలా సాధారణమైన ఆహారం.ఇది ఉత్తర కర్ణాటకలోని చాలా జిల్లాల ప్రధాన ఆహారంలో భాగం.ఇక్కడ దీనిని జుంకా, యెంగై, శెంగా చట్నీ లేదా ఇతర రకాల చట్నీల వంటి పప్పు కూరలతో తింటారు. పొరుగున ఉన్న మహారాష్ట్రలో జోవర్ రొట్టీని జవరిచి భక్రి అని కూడా అంటారు.
- ధార్వాడ్ పెడా అనేది పాలు, పంచదారతో తయారు చేయబడిన ఒక తీపి రుచికరమైన పిండివంట, ఇది భౌగోళిక గుర్తింపు పొందింది. [12]
హుబ్లీ-ధార్వాడ్ నగరపాలక సంస్థ
20 కిలోమీటర్ల దూరంలో ఉన్న రెండు నగరాలను కలిపి 1962లో హుబ్లీ-ధార్వాడ్ నగరపాలక సంస్థగా (హెచ్.డి.ఎం.సి) ఏర్పడింది.నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న ప్రాంతం 45 రెవెన్యూ గ్రామాలలో విస్తరించి ఉంది. ఇది కర్ణాటక రాష్ట్రంలో రెండవ అతిపెద్ద నగర పాలకసంస్థ.1991 జనాభా లెక్కల ప్రకారం నగర జనాభా 7,00,000. హుబ్లీ-ధార్వాడ్ జనాభా 2020 నాటికి 11,58,000 చేరుకుంది. [13] హుబ్లీ పురపాలక సంఘం 1850 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఏర్పడింది.ధార్వాడ్ పురపాలక సంఘం మొదట 1856 జనవరి 1న ఉనికిలోకి వచ్చింది.తరువాత రెండూ కలిసి హుబ్లీ-ధార్వాడ్ నగరపాలక సంస్థగా (హెచ్.డి.ఎం.సి)గా ఏర్పడింది [14] హుబ్లీ-ధార్వాడ్ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం హుబ్లీలో ఉంది. హుబ్లీ-ధార్వాడ్ నాలుగు విధానసభ నియోజకవర్గాలను కలిగి ఉంది.ధార్వాడ్ ప్రజలు ప్రత్యేక పౌర సంస్థను సృష్టించి, హెచ్‌డిఎంసి ద్వారా వేరుచేయాలని వత్తిడి చేశారు. ఎక్కువ నిధులు హుబ్లీకే కేటాయిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. [15]
రవాణా
త్రోవ
హుబ్బల్లి-ధార్వాడ్ బిఆర్‌టిఎస్ (హెచ్‌డిబిఆర్‌టిఎస్ అని కూడా పిలుస్తారు) అనేది భారతదేశంలోని కర్నాటక రాష్ట్రంలోని వాయువ్య భాగంలో ఉన్న జంట నగరాలైన హుబ్లీ, ధార్వాడ్‌లకు సేవలను అందించడానికి నిర్మించిన వేగవంతమైన బస్ రవాణా సంస్థ.హుబ్లీ-ధార్వాడ్ బిఆర్‌టిఎస్ (హెచ్‌డిబిఆర్‌టిఎస్) ప్రాజెక్ట్ ఈ ప్రాంతంలో దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి కర్ణాటక ప్రభుత్వ చొరవతీసుకుంది. ఈ ప్రాజెక్ట్ జంట నగరాల మధ్య వేగవంతమైన, సురక్షితమైన, సౌకర్యవంతమైన, సరసమైన ప్రజా రవాణాను ప్రోత్సహిస్తుంది.ఈ ప్రాంతంలో రద్దీ, వాయు కాలుష్యాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది.కానీ ఇది దారులను పరిమితం చేయడం ద్వారా వ్యక్తల సంస్థలకు చెందిన వాహనాల సేవలను తీవ్రంగా ప్రభావితం చేసింది.భారతదేశంలోని అనేక నగరాల్లో బిఆర్‌టిఎస్ వ్యవస్థ విఫలమైనందున చాలా మంది ఈ ప్రణాళికను ఆమోదించలేదు. ఉదాహరణకు పూణే, ఢిల్లీ.[16]
వాయుమార్గం
హుబ్లీ విమానాశ్రయం భారతదేశంలోని కర్నాటక రాష్ట్రంలోని జంట నగరాలైన హుబ్లీ-ధార్వాడ్,ఉత్తరకర్ణాటకలకు సేవలను అందించే సమీప విమానాశ్రయం.ఇది హుభ్లీ నుండి 8 కిలోమీటర్లు,ధార్వాడ్ నుండి 20 కి.మీ . దూరంలో గోకుల్ మార్గంలో ఉంది.ఇది కర్ణాటకలో మూడవ అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం.భారతదేశంలో 45వ రద్దీగాఉండే విమానాశ్రయం. 2020 మార్చిలో భారతప్రభుత్వ ప్రాంతీయ అనుసంధానం పథకం కింద హుబ్లీ విమానాశ్రయం,ఉత్తమ విమానాశ్రయ పురస్కారం అందుకుంది. [17] హుబ్లీ విమానాశ్రయం దేశంలోని 10 గమ్యస్థానాలకు అనుసంధానించబడి ఉంది.హుబ్లీ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. [18] [19]
మాధ్యమం
మంగళూరు సమాచార్, ఉత్తర కెనరా ప్రాంతంతో పాటు ధార్వాడలో పంపిణీ చేయబడిన మొట్టమొదటి కన్నడభాషా వార్తాపత్రిక. [20] ప్రస్తుత కాలంలో వార్తాపత్రికలు కన్నడలో విజయ కర్ణాటక, విజయవాణి, కన్నడ ప్రభ, ప్రజావాణి, సంయుక్త కర్ణాటక అనేవి ఉన్నాయి. ఆంగ్లంలో ది హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా, డెక్కన్ హెరాల్డ్, ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పంపిణిలో ఉన్నాయి.
క్రీడలు
క్రికెట్ , ఫుట్‌బాల్ ధార్వాడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడలు. తరచుగా నగరంలోని మైదానాలు, వీధుల్లో ఆడతారు.
క్రికెట్
కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎ.ఎస్.సి.ఎ.) కిత్తూరు రాణి చెన్నమ్మ క్రికెట్ స్టేడియం, (కెసిడి), (ఎస్.డి.ఎం)యి క్రికెట్ మ్యాచ్‌లను నిర్వహించింది. [21] [22] 1990లో కర్ణాటక క్రికెట్ జట్టు,హైదరాబాద్ క్రికెట్ జట్టుతో ఆడినప్పుడు ఆర్ ఎన్.శెట్టి స్టేడియం రంజీ ట్రోఫీ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చింది.[23]
కబడ్డీ
ప్రధాన కబడ్డీ మ్యాచ్‌లు సాధారణంగా కర్ణాటక కళాశాల మైదానంలో జరుగుతాయి. [24]
టెన్నిస్
నగరంలోని మిలీనియల్స్‌లో టెన్నిస్ ఒక ప్రసిద్ధ ఎంపిక. 2003, 2006లో ధార్వాడ్ అంతర్జాతీయ పురుషుల టెన్నిస్ టోర్నమెంట్ ఎటిపి ఛాలెంజర్ సిరీస్‌కు ఆతిథ్యం ఇచ్చింది. [25] [26]
ప్రముఖ వ్యక్తులు
- జి.ఎస్. అముర్
- డిఆర్ బింద్రే
- నితిన్ భిల్లే
- లీనా చందావర్కర్
- ప్రవీణ్ గోడ్ఖిండి
- మాధవ్ గుడి
- ఫకీరప్ప గురుబసప్ప హలకట్టి
- గంగూబాయి హంగల్
- సురేష్ హెబ్లీకర్
- సి.ఎన్.ఎస్. అయ్యంగార్
- ప్రహ్లాద్ జోషి
- చెన్నవీర కనవి
- సంగీత కత్తి
- శంకర్ కుంబి
- మల్లికార్జున్ మన్సూర్
- రాజశేఖర్ మన్సూర్
- డి.సి పావటే
- పాటిల్ పుట్టప్ప
- బసవరాజ్ రాజగురు
పౌర పరిపాలన
20 కిలోమీటర్ల దూరంలో ఉన్న రెండు నగరాలను కలిపి 1962లో హుబ్లీ-ధార్వాడ్ నగరపాలకసంస్థగా ఏర్పడింది. [27] [28] కార్పొరేషన్ నగరపాలక సంస్థ ప్రాంతం 213 కి.మీ. (82 చ.మైళ్లు) విస్తీర్ణంతో 45 రెవెన్యూ గ్రామాలలో విస్తరించి ఉంది.1991 జనాభా లెక్కల ప్రకారం నగర జనాభా 7 లక్షలు. 2011 జనాభా లెక్కల ప్రకారం హుబ్లీ-ధార్వాడ్ జనాభా 9,43,857. ధార్వాడ్ ప్రజలు ప్రత్యేక పౌర సంస్థను సృష్టించి, హెచ్‌డిఎంసి ద్వారా వేరుచేయాలని వత్తిడి చేశారు. ఎక్కువ నిధులు హుబ్లీకే కేటాయిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. [29]
- హుబ్లీ : భారత ప్రభుత్వ చట్టం 1850 ప్రకారం, హుబ్లీ-పురపాలక సంఘం 1855 ఆగస్టు 15న ఏర్పడింది.
- ధార్వాడ్ : ధార్వాడ్ పురపాలక సంఘం మొదట 1856 జనవరి 1న ఉనికిలోకి వచ్చింది. కౌన్సిల్ మొదటి నాన్-అఫిషియల్ ప్రెసిడెంటుగా 1907లో ఎస్.కె, రొడ్డా,ఆ తర్వాతి సంవత్సరంలో ఎసె.వి. మెన్సింకై నియామక అయ్యారు. అయితే ఎన్నికైన మొట్టమొదటి అధ్యక్షుడు ఘనత 1920లో బాధ్యతలు స్వీకరించిన ఎస్.జి.కరిగూడారికి చెందుతుంది.
హుబ్లీ ఒక వాణిజ్య, పారిశ్రామిక కేంద్రంగా ప్రసిద్ధి చెందింది.అయితే ధార్వాడ్ అభ్యాస స్థానం. [30] ఈ వైవిధ్యం, భౌగోళిక స్థానాల కారణంగానే రాష్ట్ర ప్రభుత్వం రెండు నగరాలను కలిపిందని ప్రఖ్యాతి గాంచింది. [31] జంట నగరాల పాలకసంస్థ కర్ణాటక రాష్ట్రంలో ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించింది. రాజధాని నగరం బెంగళూరు తర్వాత, ఇది రాష్ట్రంలో అతిపెద్ద నగరపాలక సంస్థగా గుర్తింపుఉంది. [31]
విద్యా సంస్థలు
ధార్వాడ్ అనేక విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, స్వయంప్రతిపత్త సంస్థలకు ఆతిథ్యం ఇస్తుంది, కొన్ని క్రింద ఇవ్వబడ్డాయి. [32]
- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ధార్వాడ్ (ఐ.ఐ.టి.డి.డబ్ల్యు.డి) - 25 ఐఐటిలలో ఒకటి, ఇది 2015లో ఏర్పడింది. [33]
- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ధార్వాడ్ (ఐఐటి ధార్వాడ్) - 23 ఐఐటిలలో ఒకటి, ఇది 2016లో ఏర్పడింది [34]
- కర్నాటక్ విశ్వవిద్యాలయం - 1949లో ఏర్పడింది [35]
- వ్యవసాయ విజ్ఞాన విశ్వవిద్యాలయం ధార్వాడ్ (యు.ఎ.ఎస్.డి) - 1986లో ఏర్పడింది [36]
- దక్షిణ భారత హిందీ ప్రచార సభ, ధార్వాడ్ ప్రాంతీయ శాఖ.- 1964లో, ఈ సంస్థను భారత ప్రభుత్వం జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థలలో ఒకటిగా గుర్తించింది. [37]
- ధార్వాడ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ (డి.ఐ.ఎం.హచ్.ఎ.ఎన్.ఎస్) - [38] లో ఏర్పడింది.
- కర్నాటక కళాశాల - [39] లో ఏర్పడింది.
- జాతీయ ఫోరెన్సిక్ సైన్స్ విశ్వవిద్యాలయం, ధార్వాడ్ - 2023లో ఏర్పడింది.
- శ్రీ ధర్మస్థల మంజునాథేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ధార్వాడ్ -1979లో ఏర్పడింది. [40]
మూలాలు
- ↑ "About the Education hub of Karnataka". IIT Dharwad official website. 2022-05-28. Archived from the original on 2022-12-16. Retrieved 2022-12-16.
{cite web}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ 2.0 2.1 "District Profile" (PDF). University of Agricultural Sciences, Dharwad. Archived from the original (PDF) on 2023-07-07. Retrieved 2023-07-21.
{cite web}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "BJP retains power in Hubballi-Dharwad Municipal Corporation". The Hindu (in Indian English). 2023-06-20. ISSN 0971-751X. Retrieved 2023-06-21.
- ↑ "Ministry of New and Renewable Energy - Solar / Green Cities". mnre.gov.in. Archived from the original on 14 March 2016. Retrieved 14 March 2016.
- ↑ "Constant transfer of MDs, chairpersons hampers execution of Smart City projects in Hubballi-Dharwad". Times of India. Retrieved 23 June 2020.
- ↑ "About District". Government of Karnataka.
- ↑ "Imperial Gazetteer2 of India, Volume 11, page 316 – Imperial Gazetteer of India – Digital South Asia Library". Dsal.uchicago.edu. Retrieved 2009-11-15.
- ↑ "District Profile" (PDF). University of Agricultural Sciences, Dharwad. Archived from the original (PDF) on 2023-07-07. Retrieved 2023-07-21.
{cite web}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "'rural Folk Preserved Kannada'". The Times of India (in ఇంగ్లీష్). January 30, 2023. Retrieved 2023-01-30.
- ↑ "Culture & Heritage | Dharwad District". Retrieved 2023-01-30.
- ↑ "Culture of Dharwad". Hubballi Infra. 2021-02-17. Archived from the original on 2023-01-30. Retrieved 2023-01-30.
- ↑ ""K'taka gets highest number of GI tags"".
- ↑ "Hubli and Dharwad City Population Census 2011-2022 | Karnataka". www.census2011.co.in. Retrieved 2022-08-25.[permanent dead link]
- ↑ "::HDMC::". Archived from the original on 20 April 2012. Retrieved 13 November 2012.
{cite web}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "Demand to separate Dharwad from HDMC grows bigger". The Times of India (in ఇంగ్లీష్). 26 August 2018. Retrieved 15 November 2020.
- ↑ "HDBRTS". hdbrts.com. Archived from the original on 28 ఫిబ్రవరి 2021. Retrieved 18 February 2021.
- ↑ "Hubballi Airport bags award under Regional Connectivity Scheme". Times of India. Retrieved 23 June 2020.
- ↑ Kattimani, Basavaraj (30 November 2018). "Get ready to fly abroad from Hubballi airport". The Times of India. Retrieved 7 December 2020.
- ↑ "Hubballi Is Best Choice for International Airport of N-Karnataka: Angadi". Hubballi Times. 10 March 2020. Archived from the original on 23 జూలై 2020. Retrieved 23 July 2020.
{cite web}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "The first Kannada newspaper in Dharwad district". Deccan Herald. 2019-06-29. Retrieved 2022-12-12.
- ↑ "Veeranna Savadi to helm Karnataka State Cricket Association-Dharwad". The Times of India. 2022-12-17. ISSN 0971-8257. Retrieved 2023-02-06.
- ↑ "Cricket tournament on Feb 5 in Hubballi and Dharwad". The Times of India. 2023-02-04. ISSN 0971-8257. Retrieved 2023-02-06.
- ↑ "The Home of CricketArchive". cricketarchive.com. Retrieved 2023-02-06.
- ↑ "ಧಾರವಾಡ: ಬೆಂಗಳೂರು ಆರ್ಮಿ ತಂಡಕ್ಕೆ ಕಬಡ್ಡಿ ಟ್ರೋಫಿ". Prajavani. 2023-01-27. Retrieved 2023-02-06.
- ↑ "Tennis Explorer: Dharwad challenger". www.tennisexplorer.com. Retrieved 2023-02-06.
- ↑ "Tennis Explorer: Dharwad challenger 2006". www.tennisexplorer.com. Retrieved 2023-02-06.
- ↑ "About City Corporation". Hubballi-Dharwad City Corporation. Archived from the original on 2020-07-29. Retrieved 2023-07-21.
{cite web}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "District Profile | Dharwad District | India" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-02-22.
- ↑ "Demand to separate Dharwad from HDMC grows bigger | Hubballi News - Times of India". The Times of India.
- ↑ "about hubli – dharwad" (PDF). Archived from the original (PDF) on 2013-06-13. Retrieved 2023-07-21.
{cite web}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ 31.0 31.1 "HDMC ABOUT TWIN CITY". Archived from the original on 2012-04-20. Retrieved 2023-07-21.
{cite web}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "There is more to Karnataka than just Bengaluru in education". The New Indian Express. Retrieved 2022-02-22.
- ↑ "IIIT Dharwad". iiitdwd.ac.in. Retrieved 2022-02-16.
- ↑ "IIT Dharwad". www.iitdh.ac.in. Retrieved 2022-02-16.
- ↑ "Karnatak University, Dharwad".
- ↑ "Home". www.uasd.edu. Retrieved 2022-02-16.
- ↑ "Dakshina Bharat Hindi Prachar Sabha, (Karnataka) Dharwad". www.dbhpsabhadwd.org. Retrieved 2022-02-16.
- ↑ "Home - DHARWAD INSTITUTE OF MENTAL HEALTH AND NEUROSCIENCES-DHARWAD". dimhans.karnataka.gov.in. Archived from the original on 2022-02-16. Retrieved 2022-02-16.
{cite web}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "Karnatak Arts College Dharwad - One of the Top Arts Colleges in Dharwad". www.kacd.ac.in. Retrieved 2022-02-16.
- ↑ "SDMCET – Engineering college in Dharwad,Karnataka | College for Mba and MTech in Dharwad,Karnataka". www.sdmcet.ac.in. Retrieved 2022-02-16.
వెలుపలి లంకెలు