నిశ్శబ్దం

నిశ్శబ్దం
దర్శకత్వంహేమంత్ మధుకర్
స్క్రీన్ ప్లేకోన వెంకట్
కథహేమంత్ మధుకర్
డైలాగ్స్కోన వెంకట్ (తెలుగు)
మని సెయోన్ (తమిళ్)
నిర్మాతకోన వెంకట్
టీజీ. విశ్వా ప్రసాద్
తారాగణంఆర్. మాధవన్,
అనుష్క,
మైఖేల్ మ్యాడ్‌సన్,
అంజలి,
సుబ్బరాజు,
షాలిని పాండే
ఛాయాగ్రహణంషనీల్ దేవ్
కూర్పుప్రవీణ్ పూడి
సంగీతంబ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ :
గిరీష్ గోపాలక్రిష్ణన్
పాటలు:
గోపీ సుందర్
నిర్మాణ
సంస్థలు
కోన ఫిలిం కార్పొరేషన్
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
పంపిణీదార్లుఅమెజాన్ ప్రైమ్ వీడియో
విడుదల తేదీ
2 అక్టోబరు 2020 (2020-10-02)
సినిమా నిడివి
125 నిముషాలు
దేశం భారతదేశం
భాషలు
  • తెలుగు
  • తమిళ్
బడ్జెట్30 కోట్లు [1]

నిశ్శబ్దం 2021లో విడుదలైన క్రైమ్ థిల్లర్ సినిమా. ఈ సినిమా తెలుగు, తమిళంలో నిర్మించి మలయాళం, కన్నడ భాషల్లో దుబ్బింగ్ చేసి విడుదల చేశారు.

కథ

అమెరికాలోని ఒక అనాథ శరణాలయంలో పెరిగిన బదిరురాలు(చెవిటి, మూగ). మాటలు రాకున్నా వినిపించకున్నా తన చిత్ర కళతో గొప్ప పేరు సంపాదిస్తుంది. ప్రఖ్యాత మ్యుజీషియన్ ఆంథోనీ (మాధవన్) ఆమె కళకు ముగ్ధుడవుతాడు. వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడి, అది ప్రేమగా మారుతుంది. సాక్షితో నిశ్చితార్థం కూడా చేసుకుని పెళ్లికి కూడా సిద్ధమైన ఆంథోనీ తను వేయాలనుకున్న ఒక ఆర్ట్ కు సంబంధించిన మెటీరియల్ కోసమని ఎన్నో ఏళ్ల కిందట ఓ జంట అనుమానాస్పద స్థితిలో చనిపోయిన ఓ భవంతికి తీసుకెళ్తాడు. కానీ ఆ భవంతిలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుని ఆంథోనీ హత్యకు గురవుతాడు. సాక్షి త‌ప్పించుకుని గాయాల‌తో బ‌య‌ట‌ప‌డుతుంది. పోలీస్ కెప్టెన్ రిచ‌ర్డ్ ‌(మైఖేల్ మ్యాడ్‌సన్), డిటెక్టివ్ మ‌హాల‌క్ష్మి(అంజ‌లి) కేసును టేక‌ప్ చేస్తారు. మరి ఆంథోనీని చంపిందెవరు?? ఈ హత్యకూ సోనాలి(షాలినీ పాండే), వివేక్‌(సుబ్బరాజు)లకు ఉన్న సంబంధం ఏంటి? అనేదే మిగతా సినిమా కథ.[2]

పాటలు

తెలుగు
సం.పాటపాట రచయితSinger(s)పాట నిడివి
1."నిన్నే నిన్నే"భాస్కరభట్లసిద్ శ్రీరామ్5:35
2."మధురమైతే"శ్రీజోనజీమ్ అర్షద్ , హరిణి4:30
మొత్తం నిడివి:10:05

. 3:నీ కనుపాప, రచన: రామజోగయ్య శాస్త్రి, గానం. చిన్మయి , భద్ర రాజిన్

4: సెల్లో సాంగ్ ప్రేమంటే ఇంతే , రచన: కృష్ణకాంత్, గానం.విజయ్ ఏసుదాస్ .

నటీనటులు

సాంకేతిక నిపుణులు

  • బ్యానర్‍: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్
  • నిర్మాత: టి.జి. విశ్వప్రసాద్‍
  • కథ, దర్శకత్వం: హేమంత్‍ మధుకర్‍
  • కథనం: కోన వెంకట్
  • సంగీతం: గోపి సుందర్‍
  • నేపథ్య సంగీతం: గిరీష్‍ జి.
  • కూర్పు: ప్రవీణ్‍ పూడి
  • ఛాయాగ్రహణం: షానీల్‍ దేవ్

మూలాలు

  1. Sara, Nissy (8 May 2020). "'Nishabdham' starring Anushka Shetty to have an OTT release? Details here". Republic World. Retrieved 22 September 2020.{cite web}: CS1 maint: url-status (link)
  2. BBC News తెలుగు (3 October 2020). "నిశ్శబ్దం.. సస్పెన్స్ థ్రిల్లరూ కాదు కుటుంబ కథాచిత్రమూ కాదు". BBC News తెలుగు. Archived from the original on 29 జూన్ 2021. Retrieved 29 June 2021.