నీలం ఎరుపు లోరీ, ఇయోస్ హిస్ట్రియో అనేది ఇండోనేషియాకు చెందిన చెట్లలో నివసించే చిలుక. ఇది అంతర్జాతీయంగా ప్రమాదస్థాయిలో ఉన్న ప్రజాతి. దీన్ని పెంపకంకోసం వేటాడడం వలన, వాటి సహజ సిద్ధ నివాసాలు అంతరించడం వలన వాటి జాతి ప్రమాదంలో పడింది. నీలం ఎరుపు లోరీ ఇప్పుడు ఇండోనేషియా లోని ఉత్తర సులవేసికి చెందిన తలౌద్ దీవులకు మాత్రమే పరిమితమైంది. ఇతర చోట్ల ప్రవేశపెట్టబడినా అవికూడా 20వ శతాబ్దంలో సాంగిహే, సియావు, తగులాండాంగ్ ల నుండి అంతరించి పోయాయి. వీటి జనాభా ప్రస్తుతం 5000 నుండి 10000 లోపే. అతి త్వరగా జనాభా తగ్గుతున్న జాతులలో ఇవి కూడా ఒకటి.
మూలాలు
↑BirdLife International (2013). "Eos histrio". IUCN Red List of Threatened Species. Version 2013.2. International Union for Conservation of Nature. Retrieved 26 November 2013.
BirdLife International (2008). Eos histrio. 2006. IUCN Red List of Threatened Species. IUCN 2006. www.iucnredlist.org. Retrieved on 20 February 2009.
జాతులు
(వర్గీకరణను గమనిక: * రెయిన్బో లోరీకీట్ యొక్క ఉపజాతి వలె వర్గీకరించబడ్డాయి అయి ఉండవచ్చు లేదా ఒక ప్రత్యేక జాతులు స్థలం సూచిస్తుంది)) (విలుప్తతలు: † అంతరించిన ఒక జాతి ఉన్నట్లు ధృవీకరించబడింది అని సూచిస్తుంది, ₴ ఉప శిలాజాలు నుండి సాక్ష్యం సూచిస్తుంది)