నీలంబూర్-షొరనూర్ రైలు మార్గం

నీలంబూర్-షొరనూర్ రైలు మార్గం
అంగడిపురం స్టేషను
అవలోకనం
వ్యవస్థదక్షిణ రైల్వే
స్థితిపనిచేస్తోంది
లొకేల్మలప్పురం, పాలక్కాడ్
చివరిస్థానంనీలంబూర్ రోడ్
షొరనూర్ జంక్షన్
స్టేషన్లు11
సేవలు7
ఆపరేషన్
ప్రారంభోత్సవం1927; 98 సంవత్సరాల క్రితం (1927)
యజమానిభారతీయ రైల్వేలు
నిర్వాహకులుదక్షిణ రైల్వే
రోలింగ్ స్టాక్ICF కోచిలు
సాంకేతికం
లైన్ పొడవు66 కిలోమీటర్లు (41 మై.)
ట్రాక్ గేజ్1,676 mm (5 ft 6 in)
ఆపరేటింగ్ వేగం100 kilometres per hour (62 mph)
మార్గ పటం
మూస:Shoranur Nilambur Railway Line

1840లో, బ్రిటీష్ వారు స్థిరమైన కలప సరఫరా కోసం నిలంబూరులో టేకు తోటను పెంచారు. [1] 1923లో, మద్రాసు-షోరనూర్-మంగుళూరు లైన్‌ను నిర్వహించే దక్షిణ భారత రైల్వే కంపెనీ, ఈ అడవుల నుండి మైదాన ప్రాంతాలకు, అక్కడి నుండి ఓడరేవులకూ కలపను సులభంగా రవాణా చేయడానికి నిలంబూరు నుండి షోరనూర్ వరకు రైలును నిర్మించడానికి మద్రాసు ప్రెసిడెన్సీ ద్వారా ఒప్పందం కుదుర్చుకుంది. కంపెనీ దశలవారీగా లైన్‌ను పూర్తి చేసింది. షోరనూర్-అంగడిపురం సెక్షన్ను 1927 ఫిబ్రవరి 3 న, అంగడిప్పురం -వాణియంబలం విభాగాన్ని 1927 ఆగస్టు 3 న ప్రారంభించారు. షోరనూర్ నుండి నిలంబూర్ వరకు మొత్తం మార్గాన్ని 1927 అక్టోబర్ 26 న తెరిచారు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో, బ్రిటీష్ ఇండియా అంతటా ఉన్న అనేక రైల్వే లైన్లతో పాటు షోరనూర్ లైన్ను కూడా తొలగించి, బ్రిటీష్ యుద్ధ ప్రయత్నాలకు సహాయం చేయడానికి మధ్యప్రాచ్యానికి మళ్లించారు. ఈ లైన్ 1941లో నిలిచిపోయింది. స్వాతంత్ర్యం తరువాత, ప్రజల ఒత్తిడిపై, రైల్వే మార్గాన్ని భారతీయ రైల్వేలు దాని పూర్వపు దారి లోనే మళ్ళీ నిర్మించింది. షోర్నూర్ -అంగడిపురం లైన్ను 1953 లోను, [2] అంగడిపురం-నిలంబూర్ మార్గాన్ని 1954 లోనూ పునఃప్రారంభించారు. [3] టేకు తోట నేటికీ ప్రధాన పర్యాటక ఆకర్షణగా నిలుస్తోంది.

మూలాలు

  1. "Nilambur Teak Plantations, Malappuram". Kerala Tourism. Retrieved 2016-12-13.
  2. "Railway Budget speech 1954–55" (PDF). www.indianrailways.gov.in. Government of India, Ministry of Railways. 19 February 1954.
  3. "Railway Budget speech 1955_56" (PDF). www.indianrailways.gov.in. Government of India, Ministry of Railways. 22 February 1955.