పంజాబ్ ఆర్థిక వ్యవస్థ

పంజాబ్ లో ముఖ్య ప్రదేశాలు

పంజాబ్ లో అన్ని ప్రాంతాల మధ్య రోడ్డు, రైలు, విమాన మార్గం లాంటి రవాణా సౌకర్యాలున్నాయి. 1999-2000 గణాంకాల ప్రకారం అతి తక్కువ పేదరికం కలిగిఉన్న రాష్ట్రంగా భారత ప్రభుత్వం యొక్క పురస్కారాన్ని పొందింది.[1] ఎకనామిక్ అండ్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ (ESO) పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వపు గణాంకాలను నమోదు చేస్తుంటుంది. వివిధ ఆర్థిక, సాంఘిక గణాంకాలను అవసరమైన వారికి అందజేస్తుంటుంది.

2008 లో ప్రపంచ వ్యాప్తంగా చేపట్టిన సర్వే ప్రకారం పంజాబ్ భారతదేశంలో అతి తక్కువ ఆహార కొరత కలిగిన రాష్ట్రం.[2]

వ్యవసాయం

పంజాబ్ అంటే ఐదు నదుల సంగమం అని అర్థం. ఇక్కడి నేలలు మంచి సారవంతమైనవి కావడంతో గోధుమలు బాగా పండిస్తారు. ఇంకా వరి, చెరకు, పండ్లు, కూరగాయలు కూడా బాగా పండిస్తారు. వ్యవసాయ రంగం పంజాబ్ యొక్క ఆర్థిక వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషిస్తున్నది.

పరిశ్రమలు

పంజాబ్ లో పరిశ్రమలు కూడా వ్యవసాయాధారితమైనవి. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడి పారిశ్రామిక ఉత్పత్తి తక్కువగా ఉన్నప్పటికీ చిన్న చిన్న పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్రానికి ప్రముఖ పారిశ్రామిక నగరాలైన జలంధర్, అమృత్ సర్, లూథియానా, పటియాలా, బటిండా మొదలైన నగరాల నుండి ఆదాయం వస్తుంది.

వస్త్ర పరిశ్రమ

పంజాబ్ లో నాణ్యమైన ప్రత్తి ఉత్పత్తి అవుతుంది. అయితే దానిని నూలుగా మార్చడంలో మాత్రం వెనుకబడి ఉంది. అక్కడ నూలు ఉత్పత్తి దేశ ఉత్పత్తిలో 1.5 శాతం మాత్రమే. అబోహర్, మాలౌత్, ఫగ్వారా, అమృత్ సర్, ఖరార్, మొహాలీ లలో నూలు మిల్లులు ఉన్నాయి.

విద్యుత్తు

రాష్ట్రానికి మొత్తం విద్యుత్తును పి.ఎస్.పి.సి.ఎల్ స్వంత థర్మల్ ప్లాంట్లు అందిస్తున్నాయి. అవి: అ.) 1260ఎం.డబ్య్లూ గురు గోబింద్ సింగ్ సూపర్ థర్మల్ ప్లాంట్, రోపర్, ఆ.) 440ఎం.డబ్య్లూ గురు నానక్ దేవ్ థర్మల్ ప్లాంట్, భతిండా, ఇ.) 920ఎం.డబ్ల్యూ గురు హరిగోబింద్ థర్మల్ ప్లాంట్, లెహ్రా మొహొబ్బత్, దాని స్వంత హైడ్రో పవర్ ప్లాంట్లు: 1.)110ఎం.డబ్ల్యూ షనన్ పవర్ హౌస్, జోగిందర్ నగర్, 2.) 600ఎం.డబ్ల్యూ రంజిత్ సాగర్ డ్యాం, షాహ్ పర్ కందీ, 3.)91.35ఎం.డబ్ల్యూ యుబిడిసి పవర్ హౌసెస్, 4.) 207ఎం.డబ్ల్యూ ముకేరియన్ హైడెల్ ప్రాజెక్టు, 5.) 134ఎం.డబ్ల్యూ ఆనంద్ పూర్ సాహిబ్ హైడెల్ చానెల్, 6.) మినీ & మాక్రో హైడ్రో పవర్ ప్లాంట్స్, సిర్హింద్ కెనాల్, మరికొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి.

సాధారణ పూల్ ప్రాజెక్టులు భాక్రానంగల్ కాంప్లెక్స్, దేహర్ పవర్ ప్లాంట్, పోంగ్ పవర్ ప్లాంట్లలో ఉన్నాయి. పంజాబ్ కు 51శాతం విద్యుత్తు భాక్రానంగల్ కాంప్లెక్స్ నుండీ, 48శాతం పోంగ్ ప్రాజెక్ట్ నుండి వస్తున్నాయి.[3]

సాధారణ పూల్ ప్రాజెక్టులు

  • భాక్రానంగల్ కాంప్లెక్స్
  • అప్పర్ బరి డోబ్ కెనాల్ సిస్టం
  • షనాహ్ పవర్ హౌస్

మూలాలు