పలక
పలక అనగా చదునుగా వుండే దృఢమైన రాయి. పిల్లలు పాఠశాలకు వెళ్ళునప్పుడు మొదటిసారిగా ఉపయోగించే ఇలాంటి మెత్తటి రాయి మీద బలపంతో రాసుకుంటారు. మొదలు మట్టి పలకలు వచ్చినా, తరువాత రేకు పలకలు వాడకంలోకి వచ్చాయి. పలకలకు సాధారణంగా ఒక చెక్క చట్రం ఉంటుంది. పలకల మీద రాస్తూ చెఋపుతూ ఎన్ని సార్లైనా రాయవచ్చు కాబట్టి అభ్యాసానికి అనుకూలంగా ఉంటాయి, క్రమేణా కాగితం పుస్తకాల వాడకం ఎక్కువవడంతో పలకల వాడకం తగ్గు ముఖం పట్టింది.
భాషా విశేషాలు
పలక [ palaka ] palaka. తెలుగు Any flat surface of face. స్తంభము. మొదలైనవాని యొక్క ఒకవైపు. ఎనిమిది పలకల కంబము an eight sided pillar. A plank, board, table, బల్ల. A board used as a slate in schools. A writing tablet, వ్రాయు పలక. A slab or flat stone. One side of any polygon, as of a lantern. A gambling table. జూదమాడుబల్ల. The bar of wood in a loom that strikes the weft close after the shuttle has passed. A tom-tom. A shield, డాలు. "ఆనిశిత భల్లములు తన మేనికి రాకుండ బలక మెరయ డిరుండు భీముండు తృంచె మదంబారగ వాలునుంబలకయున్ శీఘ్ర సందీప్తుడే." M. IX. i. 154 "బలదుర్వారుండు భీముండు తృంచె మదంబారగవాలునుంబలకయు." ib. IX. i. 304. తామ్రశాసనాల పలకలు మూడు three inscriptions on plates of copper. పలకమాగిన palaka-māgina. adj. Over ripe, dropping to pieces. పలకలు gleanings, corn picked up. "చోడ, సరపతి యారోగణము నెమ్మిసలుప, పలక నేరినంప్రాసంగు బ్రాలు." BD. v. 1228. adj. Flat, as a board. పలకరొమ్ము a flat breast. పలకరాయి a slate-stone; a sort of rock, like slate, that splits into plates. పలకము palakamu. n. A small cot, చిన్నమంచము, పలకసరి palaka-sari. n. A kind of neck ornament worn by men.