పలాస రైల్వే స్టేషను
పలాస पलास Palasa | |
---|---|
భారతీయ రైల్వేలు స్టేషను | |
సాధారణ సమాచారం | |
Location | పలాస స్టేషను రోడ్, కాశీబుగ్గ, ఆంధ్ర ప్రదేశ్ భారతదేశం |
Coordinates | 18°45′25″N 84°25′20″E / 18.7569°N 84.4221°E |
Elevation | 31m |
యజమాన్యం | భారతీయ రైల్వేలు |
నిర్వహించువారు | తూర్పు తీర రైల్వే |
లైన్లు | హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము ఖుర్దా రోడ్-విశాఖపట్నం రైలు మార్గము |
ఫ్లాట్ ఫారాలు | 3 |
నిర్మాణం | |
నిర్మాణ రకం | (గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం |
పార్కింగ్ | ఉంది |
Bicycle facilities | లేదు |
ఇతర సమాచారం | |
Status | పనిచేస్తున్నది |
స్టేషను కోడు | PSA |
డివిజన్లు | ఖుర్దా రోడ్ రైల్వే డివిజను |
History | |
Opened | 1893-1896 |
విద్యుత్ లైను | 1998-2000 |
పలాస రైల్వే స్టేషను, భారత దేశము లోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పలాస-కాశీబుగ్గ, శ్రీకాకుళం జిల్లా పరిసరాల్లో ప్రాంతాలలో పనిచేస్తుంది.
చరిత్ర
విజయవాడ జంక్షన్ నుండి కటక్ వరకు ఉన్న 1,288 కిమీ (800 మైళ్ళు) మొత్తం తీరం వెంబడి సాగిన రైలు మార్గములు (రైల్వే ట్రాక్ల) ను 1893 సం. - 1896 సం. మధ్య కాలం సమయంలో, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే నిర్మించింది, ట్రాఫిక్‌కు కూడా తెరిచింది.[1][2] 1898-99 సం.లో బెంగాల్ నాగ్‌పూర్ రైల్వే దక్షిణ భారతదేశం రైలు మార్గములు (లైన్ల) కు కలుపబడింది.[3] తదుపరి కాలంలో 79 కిమీ (49 మైళ్ళు) విజయనగరం-పార్వతీపురం రైలు మార్గము 1908-09 సం.లో ప్రారంభించబడింది, సాలూర్ వరకు పొడిగింపును 1913 సం.లో నిర్మించారు. పార్వతీపురం-రాయ్‌పూర్ రైలు మార్గము 1931 సం.లో పూర్తయింది.[3]
విద్యుద్దీకరణ
పలాస-తిలరు విభాగం 1998-99 సం.లో దీని విద్యుద్దీకరణ జరిగింది.[4]
సదుపాయాలు
పలాస రైల్వే స్టేషనులో రెండు (డబుల్ బెడ్) పడకల నాన్- ఎసి రిటైరింగ్ గది ఉంది. .[5] రైల్వే స్టేషను వద్ద ఇతర సౌకర్యాలలో పాటుగా కంప్యూటరీకరణ రిజర్వేషన్లు కార్యాలయాలు, టెలిఫోన్ బూత్, సామాన్లు భద్రపరచు గది, ప్రయాణీకుల వేచి ఉండు గది, శాకాహారం, మాంసాహార ఉపాహారం లభించు గదులు, పుస్తకం దుకాణములు ఉన్నాయి.[6]
ప్రయాణీకుల ప్రయాణాలు
పలాస రైల్వే స్టేషను రోజువారీ సుమారు 75,000 మంది ప్రయాణీకులకు సేవలందిస్తుంది[7]
రైల్వే పునర్వ్యవస్థీకరణ
బెంగాల్ నాగ్‌పూర్ రైల్వే 1944 సం.లో జాతీయీకరణ చేశారు.[8] ఈస్ట్ ఇండియన్ రైల్వే కంపెనీ యొక్క మొఘల్సరాయ్ తూర్పు భాగం, బెంగాల్ నాగ్‌పూర్ రైల్వే లతో కలిసి, తూర్పు రైల్వే 1952 ఏప్రిల్ 14 న ఏర్పడింది.[9] 1955 సం.లో, దక్షిణ తూర్పు రైల్వేను ఈస్టర్న్ రైల్వే నుండి ఏర్పరచారు. ఇందులో ఎక్కువగా అంతకు ముందు బెంగాల్ నాగ్‌పూర్ రైల్వేచే నిర్వహించబడుతున్న రైలు మార్గములు ఉన్నాయి.[9][10]
కొత్తగా రైల్వే మండలాలు ఏప్రిల్ 2003 సం.లో ప్రారంభించారు, వాటిలో ఈస్ట్ కోస్ట్ రైల్వే, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోనులను నార్త్ ఈస్టర్న్ రైల్వే నుండి మలిచారు.[9]
మూలాలు
- ↑ "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 1 ఏప్రిల్ 2013. Retrieved 13 July 2013.
- ↑ "History of Waltair Division". Mannanna.com. Archived from the original on 11 అక్టోబరు 2012. Retrieved 13 July 2013.
- ↑ 3.0 3.1 "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 2013-04-01. Retrieved 2012-11-10.
- ↑ "History of Electrification". IRFCA. Retrieved 13 July 2013.
- ↑ "East Coast Railway Amenities at Stations (as in 2008)". Archived from the original on 6 జనవరి 2014. Retrieved 13 July 2013.
- ↑ "Palasa railway station". Make my trip. Retrieved 13 July 2013.
- ↑ "Palasa (PSA)". India Rail Enquiry. Retrieved 12 July 2013.
- ↑ "IR History: Part - III (1900 - 1947)". IRFCA. Retrieved 2012-11-21.
- ↑ 9.0 9.1 9.2 "Geography – Railway Zones". IRFCA. Retrieved 2012-11-21.
- ↑ "IR History: Part - IV (1947 - 1970)". IRFCA. Retrieved 2012-11-21.
బయటి లింకులు
పలాస వద్ద ఫలక్‌నామా ఎక్స్‌ప్రెస్ |
అంతకుముందు స్టేషను | భారతీయ రైల్వేలు | తరువాత స్టేషను | ||
---|---|---|---|---|
సుమ్మాదేవి | తూర్పు తీర రైల్వే హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము యొక్క ఖుర్దా రోడ్-విశాఖపట్నం రైలు మార్గము | పూండి |