ప్రకాష్ హుక్కేరి
ప్రకాష్ హుక్కేరి | |||
కర్ణాటక శాసనమండలి సభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 13 జూన్ 2022 | |||
ముందు | అరుణ్ షాహాపూర్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | నార్త్-వెస్ట్ ఉపాధ్యాయుల నియోజకవర్గం | ||
పదవీ కాలం 26 మే 2014 – 23 మే 2019 | |||
ముందు | రమేష్ విశ్వనాథ్ కత్తి | ||
తరువాత | అన్నాసాహెబ్ జోల్లె | ||
నియోజకవర్గం | చిక్కోడి | ||
చిన్న తరహా పరిశ్రమలు, చక్కెర & దేవాదాయ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 2013 మే 17 – 2014 మే 26 | |||
పదవీ కాలం 2008 మే 25 – 2014 మే 26 | |||
ముందు | స్థానం స్థాపించబడింది | ||
తరువాత | గణేష్ హుక్కేరి | ||
నియోజకవర్గం | చిక్కోడి-సదలగా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | చిక్కోడి , మైసూరు రాష్ట్రం, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం కర్ణాటక, భారతదేశం) | 1947 మార్చి 5||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | నీలాంబిక | ||
నివాసం | ఎగ్జాంబా, బెల్గాం జిల్లా , కర్ణాటక , భారతదేశం | ||
పూర్వ విద్యార్థి | JAC కాంపోజిట్ ప్రీ-యూనివర్శిటీ కళాశాల | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
ప్రకాష్ హుక్కేరి కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా పనిచేసి, లోక్‍సభ సభ్యుడిగా ఆ తరువాత జూన్ 2022లో నార్త్-వెస్ట్ ఉపాధ్యాయుల నియోజకవర్గం నుండి కర్ణాటక శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
ప్రకాష్ హుక్కేరి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2008 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో చిక్కోడి-సదలగా నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి జిగజినాగి రమేష్ చందప్పపై 24070 ఓట్ల మెజారిటీతో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2013 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి బసవన్ని రుద్రప్ప సంగప్పగోల్ పై 76588 ఓట్ల మెజారిటీతో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 2013 మే 17 నుండి 2014 మే 26 వరకు చిన్న తరహా పరిశ్రమలు, చక్కెర & దేవాదాయ శాఖ మంత్రిగా పని చేసి,[2] 2014 లోక్‍సభ ఎన్నికలలో చిక్కోడి నుండి లోక్‍సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
ప్రకాష్ హుక్కేరి 2019లో లోక్‍సభ ఎన్నికలలో ఓడిపోయి ఆ తరువాత 2022లో నార్త్-వెస్ట్ ఉపాధ్యాయుల నియోజకవర్గం నుండి కర్ణాటక శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3] ఆయనకు 2023 ఆగస్ట్ 14న ఢిల్లీలో కర్ణాటక రెండో ప్రతినిధిగా క్యాబినెట్ స్థాయి మంత్రి హోదాతో నియమితుడయ్యాడు.[4]
మూలాలు
- ↑ Deccan Herald (15 June 2022). "Prakash Hukkeri wins from North West Teachers Constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 14 November 2024. Retrieved 14 November 2024.
- ↑ The Hindu (15 September 2013). "Rs. 2,400 per tonne not final price for sugarcane: Minister" (in Indian English). Archived from the original on 18 November 2024. Retrieved 18 November 2024.
- ↑ The Hindu (15 June 2022). "Hukkeri makes a comeback" (in Indian English). Archived from the original on 20 June 2022. Retrieved 14 November 2024.
- ↑ TV9 Kannada (14 August 2023). "ದೆಹಲಿಯ ಕರ್ನಾಟಕ ಪ್ರತಿನಿಧಿ ಆಗಿ ಪ್ರಕಾಶ್ ಹುಕ್ಕೇರಿ ನೇಮಕ: ಸಂಪುಟ ದರ್ಜೆ ಸಚಿವ ಸ್ಥಾನಮಾನ". Archived from the original on 18 November 2024. Retrieved 18 November 2024.
{cite news}
: CS1 maint: numeric names: authors list (link)