ప్రకాష్ ఝా

ప్రకాష్ ఝా
ప్రకాష్ ఝా (2012)
జననం (1952-02-27) 1952 ఫిబ్రవరి 27 (వయసు 72)
వృత్తినిర్మాత, నటుడు, దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత
క్రియాశీల సంవత్సరాలు1982⁠–⁠ప్రస్తుతం
జీవిత భాగస్వామి
(m. 1985; div. 2002)
పిల్లలుదిశా ఝా (కుమార్తె)
తల్లిదండ్రులు
  • తేజ్ నాథ్ ఝా (తండ్రి)

ప్రకాష్ ఝా భారతీయ సినిమా నిర్మాత, నటుడు, దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత.

జననం, విద్య

ప్రకాష్ ఝా 1952, ఫిబ్రవరి 27న బీహార్ రాష్ట్రం, పశ్చిమ చంపారణ్ జిల్లాలోని బేతియాలో జన్మించాడు. తండ్రి పేరు తేజ్ నాథ్ ఝా. ప్రకాష్ సైనిక్ స్కూల్ తిలయ,[1] కోడెర్మా జిల్లాకేంద్రీయ విద్యాలయ నం. 1, బొకారో స్టీల్ సిటీ, జార్ఖండ్ లలో పాఠశాల విద్యను అభ్యసించాడు. తరువాత ఫిజిక్స్‌లో బిఎస్సీ (ఆనర్స్) చేయడానికి ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని రామ్‌జాస్ కాలేజీలో చేరాడు. ఒక సంవత్సరం తర్వాత తన చదువును వదిలివేసాడు.[2] ముంబై వెళ్ళి చిత్రకారుడు కావాలని నిర్ణయించుకున్నాడు. జెజె స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ కోసం సిద్ధమవుతున్న సమయంలో ధర్మ సినిమా షూటింగ్‌ని చూసి ఫిల్మ్ మేకింగ్‌పై ఆకర్షితుడయ్యాడు. ముంబైలోని కెసి కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు.[3][4]

వ్యక్తిగత జీవితం

ప్రకాష్ కు నటి దీప్తి నావల్‌తో వివాహం జరిగింది. వారికి దత్తపుత్రిక (దిశా ఝా) ఉంది.[5][6]

సినిమారంగం

1973లో పూణెలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలోని ఎడిటింగ్‌ కోర్సులో చేరాడు. విద్యార్థుల ఆందోళన కారణంగా సంస్థ కొంతకాలం మూసివేయబడగా, ప్రకాష్ బొంబాయికి వెళ్ళి, పనిచేయడం ప్రారంభించాడు. కోర్సు పూర్తి చేయడానికి తిరిగి వెళ్ళలేదు.[7]

"హిప్ హిప్ హుర్రే" (1984), దాముల్ (1984), మృత్యుదండ్ (1997), గంగాజల్ (2003), అపహరన్ (2005), రాజ్‌నీతి (2010), ఆరక్షన్ (2011) చక్రవ్యూహ (2012), సత్యాగ్రహ (2013), డర్టీ పాలిటిక్స్ (2015 ) వంటి రాజకీయ, సామాజిక-రాజకీయ సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఫేసెస్ ఆఫ్టర్ ది స్టార్మ్ (1984), సోనాల్ (2002) వంటి జాతీయ చలనచిత్ర అవార్డు గెలుచుకున్న డాక్యుమెంటరీలను కూడా రూపొందించాడు.

ప్రకాష్ ఝా ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించాడు.[8] పాట్నాలో పి&ఎం మాల్, జంషెడ్‌పూర్‌లో పి&ఎం హైటెక్ సిటీ సెంటర్ మాల్‌ను ఏర్పాటు చేశాడు.[9]

సినిమాలు

  1. శ్రీ వట్స్ (డాక్యుమెంటరీ)
  2. ఫేసెస్ ఆఫ్టర్ ది స్టార్మ్ (డాక్యుమెంటరీ)
  3. హిప్ హిప్ హుర్రే
  4. దాముల్
  5. కుడియాట్టం (డాక్యుమెంటరీ)
  6. ముంగేరిలాల్ కే హసీన్ సప్నే
  7. పరిణతి
  8. బండిష్
  9. మృత్యుదండ్
  10. దిల్ క్యా కరే
  11. రాహుల్
  12. సోనాల్ (డాక్యుమెంటరీ)
  13. గంగాజల్
  14. లోక్‌నాయక్
  15. అపహరన్
  16. ఖోయా ఖోయా చంద్
  17. రాజనీతి
  18. యే సాలి జిందగీ
  19. ఆరక్షన్
  20. చక్రవ్యూః
  21. సత్యాగ్రహ్
  22. క్రేజీ కుక్కడ్ ఫ్యామిలీ
  23. జై గంగాజల్
  24. సారే జహాన్ సే అచా (సిరీస్)
  25. సాంద్ కీ ఆంఖ్
  26. మట్టో కి సైకిల్

అవార్డులు

జాతీయ చలనచిత్ర అవార్డులు

  • 1984: నేషనల్ ఫిల్మ్ అవార్డ్ ఫర్ బెస్ట్ నాన్-ఫీచర్ ఫిల్మ్: ఫేసెస్ ఆఫ్టర్ ది స్టార్మ్ (1984)[10]
  • 1985: ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డు: దాముల్ (1985)
  • 1987: ఉత్తమ కళలు/సాంస్కృతిక చిత్రానికి జాతీయ చలనచిత్ర పురస్కారం: కుడిఅట్టం[11]
  • 1988: ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ కోసం జాతీయ చలనచిత్ర అవార్డు: పరిణతి
  • 1988: నేషనల్ ఫిల్మ్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఇండస్ట్రియల్ డాక్యుమెంటరీ: లుకింగ్ బ్యాక్
  • 2002: ఉత్తమ నాన్-ఫీచర్ ఫిల్మ్ కోసం నేషనల్ ఫిల్మ్ అవార్డ్: సోనాల్[12]
  • 2004: ఇతర సామాజిక సమస్యలపై ఉత్తమ చిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డు: గంగాజల్ (2003)[13]
  • 2006: ఉత్తమ స్క్రీన్ ప్లేకి జాతీయ చలనచిత్ర అవార్డు: అపహరన్ (2005)

ఫిల్మ్‌ఫేర్ అవార్డులు

  • 2001: సంవత్సరపు ఉత్తమ డాక్యుమెంటరీ: ఫేసెస్ ఆఫ్టర్ ది స్టార్మ్ (1983)
  • 1985: ఉత్తమ చిత్రంగా ఫిల్మ్‌ఫేర్ క్రిటిక్స్ అవార్డు: దాముల్ (1985)
  • 2006: ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ డైలాగ్ అవార్డు: అపహరన్ (2005) [14]

స్టార్ స్క్రీన్ అవార్డులు

  • 2005: స్టార్ స్క్రీన్ ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు: అపహరన్
  • 2011: స్టార్ స్క్రీన్ ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు: రాజ్‌నీతి

ఫిల్మ్‌ఫేర్ ఓటిటి అవార్డులు

సంవత్సరం వర్గం పేరు ఫలితం
2021 ఉత్తమ సిరీస్ - డ్రామా ఆశ్రమం ప్రతిపాదించబడింది [15]
ఉత్తమ దర్శకుడు - డ్రామా, సిరీస్ ప్రతిపాదించబడింది

ఐటా అవార్డులు

సంవత్సరం విభాగం పేరు ఫలితం
2021 ఉత్తమ ల్యాండ్‌మార్క్ ఓటిటి షో ఆశ్రమం గెలుపు [16]

మూలాలు

  1. "Sainik Schools Society". Sainikschoolsociety.org. Retrieved 2023-07-14.
  2. "Prakash Jha : Hrishikesh Mukharjee cried after watching my film - PassionForCinema". 5 September 2008. Archived from the original on 5 September 2008. Retrieved 2023-07-14.
  3. Bollypedia. "Prakash Jha | Biography, Filmography, Gallery, Awards, Videos | Bollypedia". bollypedia.in. Retrieved 2022-02-16.
  4. "Our Prominent Alumni". KC College of Arts, Commerce & Science, Mumbai. Retrieved 2023-07-14.
  5. "Today's actors have become picky: Prakash Jha". hindustantimes.com. Archived from the original on 26 January 2013. Retrieved 2023-07-14.
  6. "Prakash Jha during the launch of Deepti Naval's book 'The Mad Tibetan'". Photogallery.indiatimes.com. Retrieved 2023-07-14.
  7. Prakash Jha The Cinemas of India, by Yves Thoraval. Macmillan India, 2000. ISBN 0-333-93410-5, ISBN 978-0-333-93410-4. Page 191-192.
  8. "Prakash Jha Productions". Prakashjhaproductions.com. Archived from the original on 2011-07-15. Retrieved 2023-07-14.
  9. Bose, Antara (3 August 2017). "Shopaholics, the big brands are coming". The Telegraph. Archived from the original on 12 February 2018. Retrieved 2023-07-14.
  10. "Prakash Jha Productions". Prakashjhaproductions.com. Archived from the original on 2017-11-10. Retrieved 2023-07-14.
  11. "Prakash Jha Productions". Prakashjhaproductions.com. Archived from the original on 2009-03-24. Retrieved 2023-07-14.
  12. "Prakash Jha Productions". Prakashjhaproductions.com. Archived from the original on 2019-06-26. Retrieved 2023-07-14.
  13. "Prakash Jha Productions". Prakashjhaproductions.com. Archived from the original on 2018-05-23. Retrieved 2023-07-14.
  14. "Prakash Jha". IMDb. Retrieved 2023-07-14.
  15. "My Glamm Filmfare OTT Awards 2021 - Nominations". FilmFare (in ఇంగ్లీష్). 2 December 2021. Retrieved 2023-07-14.
  16. "ITA Awards 2021 full winners list out. Surbhi Chandna and Pratik Gandhi win big". India Today (in ఇంగ్లీష్). Retrieved 2023-07-14.

బయటి లింకులు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.