ప్రపంచ వారసత్వ ప్రదేశం
ప్రపంచ వారసత్వ ప్రదేశం, అనేది ఒక ప్రత్యేకమైన ప్రదేశాన్ని సూచిస్తుంది. (ఉదా: అడవి, పర్వతం, సరస్సు, ఎడారి, కట్టడం, నిర్మాణం, లేదా నగరం, దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీచే ప్రపంచ వారసత్వ గుర్తింపు కార్యక్రమాన నిర్వహింపబడి, దానిని జాబితాలో నామినేట్ చేస్తుంది.
ఈ కమిటీలో 21 రాష్టాల పార్టీలుంటాయి.[1] వీటికి రాష్ట్రపార్టీల జనరల్ శాసనసభ, 4 సంవత్సరాల కొరకు ఎన్నుకుంటుంది.[2] ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం, సాంస్కృతిక సంపదను పరిరక్షిస్తూ మానవుల వారసత్వాన్ని ఇతర తరాలకు అందించడం. 2008 వరకు 851 ప్రపంచ వారసత్వ ప్రదేశాలు 141 రాష్ట్ర పార్టీల యందు ఉన్నాయి. వీటిలో 660 సాంస్కృతిక, 166 సహజసిద్ధ, 25 మిశ్రమ ప్రత్యేకతల ప్రదేశాలున్నాయి.[3]
చరిత్ర - మూలం
1954లో, ఈజిప్ట్ ప్రభుత్వం కొత్త అస్వాన్ డ్యామ్‌ను నిర్మించాలని నిర్ణయించుకుంది. దీని ఫలితంగా భవిష్యత్తులో ఏర్పడే రిజర్వాయర్ చివరికి నైలు లోయలో పురాతన ఈజిప్ట్, పురాతన నుబియా సాంస్కృతిక సంపదను కలిగి ఉన్న పెద్ద విస్తీర్ణం వరదలో మునిగిపోతుంది. 1959లో ఈజిప్ట్, సుడాన్ ప్రభుత్వాలు, అంతరించిపోతున్న స్మారక చిహ్నాలైన ప్రదేశాలు, ప్రాంతాలు రక్షించడానికి తమకు సహాయం చేయమని యునెస్కోను అభ్యర్థించాయి. 1960లో యునెస్కో తరుపున డైరెక్టర్ జనరల్ నుబియా లోని స్మారక చిహ్నాలను రక్షించడానికి అంతర్జాతీయ ప్రచారాన్ని ప్రారంభించాడు.[4] నుబియాలోని స్మారక చిహ్నాలను రక్షించడానికి ఈ అంతర్జాతీయ ప్రచారం ఫలితంగా వందలాది ప్రదేశాల తవ్వకం, చరిత్ర నమోదు, వేలకొద్దీ వస్తువుల పునరుద్ధరణ, అలాగే అనేక ముఖ్యమైన దేవాలయాలను రక్షించడం, మరొక ప్రాంతానికి మార్చడం జరిగింది. వీటిలో అత్యంత ప్రసిద్ధమైనవి అబూ సింబెల్ దేవాలయాలు, ఫిలే ఆలయ సముదాయాలు మొదలగునవి. 1980లో విజయవంతంగా ప్రచారం ముగిసింది. ముఖ్యంగా ప్రచారం విజయవంతానికి సహకరించిన దేశాలకు ధన్యవాదాలు తెలిపేందుకు, ఈజిప్ట్ నాలుగు దేవాలయాలను విరాళంగా ఇచ్చింది. దెందుర్ ఆలయం న్యూయార్క్ నగరం లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌కు, మాడ్రిడ్ లోని డెబోడ్ ఆలయం, పార్క్ డెల్ ఓస్టెకు, లైడెన్‌లోని రిజ్‌క్స్‌మ్యూజియం వాన్ ఔదేడెన్‌కు, టాఫెహ్ ఆలయం, మ్యూజియో ఎజిజియో లోని ఎల్లేసియా ఆలయం లోకి మార్చబడ్డాయి.[5]
ఈ ప్రాజెక్టు ఖర్చ 2013లో US$80 మిలియన్ ($284.14 కి సమానం), ఇందులో సుమారు $40 మిలియన్లు 50 దేశాల నుండి సేకరించబడింది.[6] ప్రాజెక్టు విజయం వెనిస్, ఇటలీలోని వెనీషియన్ లగూన్ పాకిస్తాన్‌లోని మొహెంజదారో శిథిలాలు, ఇండోనేషియాలోని బోరోబోదుర్ ఆలయ కాంపౌండ్‌లను రక్షించడం వంటి ఇతర రక్షణ ప్రచారాలకు దారితీసింది. మాన్యుమెంట్స్, సైట్‌లపై అంతర్జాతీయ కౌన్సిల్‌తో కలిసి, యునెస్కో సాంస్కృతిక వారసత్వాన్ని రక్షించడానికి జాబితా కన్వెన్షన్‌ను ప్రారంభించింది.[6]
గణాంకాలు
ప్రస్తుతం 851 ప్రపంచ వారసత్వ ప్రదేశాలు 141 రాష్ట్ర పార్టీలందున్నాయి. వీటిలో 660 సాంస్కృతిక, 166 సహజసిద్ధ, 25 మిశ్రమ ప్రత్యేకతల ప్రదేశాలున్నాయి.
ప్రాంతం | సహజసిద్ధ | సాంస్కృతిక | మిశ్రమ | మొత్తం | % |
---|---|---|---|---|---|
ఆఫ్రికా | 33 | 38 | 3 | 74 | 9% |
అరబ్ రాజ్యాలు | 3 | 58 | 1 | 62 | 7% |
ఆసియా- పసిఫిక్ | 45 | 126 | 11 | 182[7] | 21% |
యూరప్ - ఉత్తర అమెరికా | 51 | 358 | 7 | 416 | 49% |
లాటిన్ అమెరికా - కరేబియన్ | 34 | 80 | 3 | 117 | 14% |
ఇవి కూడా చూడండి
- ఆఫ్రికా లోని ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితా
- దేశాల వారీగా ప్రపంచ వారసత్వ ప్రదేశాలు
- ఓషియానియా లోని ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితా
- అరేబియా లోని ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితా
- అపాయస్థితిలో ఉన్న ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితా
- యూరప్ లోని ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితా
- అమెరికాల లోని ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితా
- రాష్ట్ర పార్టీల ఆధారంగా ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితా
మూలాలు
- ↑ According to UNESCO World Heritage Site, States Parties are countries that signed and ratified The World Heritage Convention. నవంబరు 2007 వరకు 185 రాష్ట్ర పార్టీలు గలవు.
- ↑ "The World Heritage Committee". UNESCO World Heritage Site. Retrieved 2006-10-14.
- ↑ World Heritage List, UNESCO World Heritage Sites official sites.
- ↑ "Monuments of Nubia-International Campaign to Save the Monuments of Nubia". UNESCO World Heritage Centre. Archived from the original on 5 July 2020. Retrieved 22 May 2020.
- ↑ "The Rescue of Nubian Monuments and Sites". UNESCO World Heritage Centre. Archived from the original on 5 July 2020. Retrieved 22 May 2020.
- ↑ 6.0 6.1 "The World Heritage Convention – Brief History / Section "Preserving cultural heritage"". UNESCO World Heritage Centre. Archived from the original on 26 May 2020. Retrieved 17 July 2019.
- ↑ The Uvs Nuur basin located in Russia and in Mongolia is here included in Asia-Pacific zone.
బయటి లింకులు
- UNESCO World Heritage portal — Official detailed website in both English and French
- The World Heritage List — Official searchable List of all Inscribed Properties
- KML file of the World Heritage List — Official KML version of the List for Google Earth and NASA Worldwind
- Convention Concerning the Protection of the World Cultural and Natural Heritage —
- Convention Concerning the Protection of the World Cultural and Natural Heritage at Law-Ref.org
- Organization of World Heritage Cities — Dealing with urban sites only
- WHTour.org — World Heritage sites in panographies - 360 degree imaging
- Worldheritage-Forum — Weblog and Information on World Heritage Issues
- UK Government's list of UK World Heritage Sites
- US National Park Service's list of US World Heritage Sites
- Parks Canada's list of Canadian World Heritage Sites Archived 2006-10-20 at the Wayback Machine
- World Heritage Site — The most extensive private website about World Heritage
- thesalmons.org's world heritage list — Unofficial list with links and map of sites
- VRheritage.org — Documentation of World Heritage Sites
- WorldHeritageProject.org — Preserving the beauty of our planet’s natural and cultural diversity through the dynamic media of photography, film, music and other artistic expressions.