బయోస్
బయోస్ (BIOS) అనగా బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్. బయోస్ అనేది కంప్యూటర్ తయ్యారవడానికి వివిధ పరికరాలను గుర్తించడానికి, నియంత్రించడానికి కంప్యూటర్ యొక్క మదర్‌బోర్డు చిప్ పై పొందుపరచబడిన ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్. BIOS యొక్క ఉద్దేశం కంప్యూటర్‌కు ప్లగ్ కనెక్ట్ చేసిన అన్ని వస్తువులు సరిగా పని చేయగలవని నిర్ధారించడం. బయోస్ కంప్యూటరుకు జీవమును తెస్తుంది, ఈ బయోస్ పదం గ్రీకు పదం βίος నుండి వచ్చింది, బయోస్ అంటే "జీవితం".
బూటింగ్ అప్
"బూటింగ్ అప్" అనేది కంప్యూటర్ ను మొదట ఆన్ చేసినప్పుడు కంప్యూటర్ ఉపయోగపడేలా సిద్ధపరచే పూర్తి ప్రక్రియ. కంప్యూటర్ టర్న్ ఆన్ అయినప్పుడు బయోస్ ప్రారంభమవుతుంది, పవర్-ఆన్ సెల్ఫ్ టెస్ట్ (POST) అమలవుతుంది. పవర్-ఆన్ సెల్ఫ్ టెస్ట్ (POST) సమయంలో బయోస్ కంప్యూటర్ ప్రాసెసర్, మెమోరీ, వీడియో కార్డు, ఇతరత్రా వంటి వివిధ పరికరాలు కంప్యూటర్ లో ప్రస్తుతం ఉన్నాయా, అవి పనిచేస్తున్నాయా అని నిర్ధారించుకోవడానికి తనిఖీ చేస్తుంది. ఒకసారి POST విజయవంతంగా పూర్తయితే, ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ కోసం BIOS సాధారణంగా కంప్యూటర్ హార్డ్ డ్రైవ్ లో ఉండే ఆపరేటింగ్ సిస్టమ్‌పై కన్నెస్తుంది. బయోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను కనుగొనగానే లోడ్ ప్రారంభమవుతుంది. ఈ సమయంలో, ఆపరేటింగ్ సిస్టమ్ సిస్టమ్ యొక్క నియంత్రణను తీసుకుంటుంది.