బర్గర్ పెయింట్స్

బర్గర్ పెయింట్స్
రకంపబ్లిక్
ISININE463A01038
పరిశ్రమరసాయనాలు
స్థాపనడిసెంబరు 17, 1923; 101 సంవత్సరాల క్రితం (1923-12-17)
స్థాపకుడులూయిస్ బర్గర్
ప్రధాన కార్యాలయం
కోల్ కతా, పశ్చిమ బెంగాల్l
,
కీలక వ్యక్తులు
  • కుల్దీప్ సింగ్ ధింగ్రా
    (చైర్మన్)
  • అభిజిత్ రాయ్ (మేనేజింగ్ డైరెక్టర్ & ముఖ్య నిర్వహణ అధికారి )
ఉత్పత్తులు
  • రసాయనాలు
  • డెకరేటివ్ పెయింట్స్
  • ఇండస్ట్రియల్ ఫినిషింగ్ ప్రోడక్ట్స్
  • కోటింగ్స్
రెవెన్యూIncrease8,826 crore (US$1.1 billion) (2022)[1]
Operating income
Increase1,118 crore (US$140 million) (2022)[2]
Net income
Increase829 crore (US$100 million) (2022)[3]
Total assetsIncrease7,212 crore (US$900 million) (2022)[4]
Total equityIncrease3,926 crore (US$490 million) (2022)[5]
ఉద్యోగుల సంఖ్య
3,600 (2020)
వెబ్‌సైట్www.bergerpaints.com Edit this on Wikidata

బర్గర్ పెయింట్స్ లిమిటెడ్ (Berger Paints Ltd) భారతీయ బహుళజాతి పెయింట్ కంపెనీ, భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతా లో ప్రధాన కార్యాలయం ఉంది. ఈ కంపెనీకి భారతదేశంలో 16 తయారీ యూనిట్లు ఉన్నాయి,[6] నేపాల్ లో 2, పోలాండ్,రష్యాలలో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. హౌరా- రిష్రా వద్ద తయారీ యూనిట్లను కలిగి ఉంది[7], అరింసో, తలోజా, నాల్టోలి, గోవా, దేవ్లా, హిందూపూర్,[8] జెజురి,[9] జమ్మూ,[10] పుదుచ్చేరి, ఉద్యోగ్ నగర్ లలో తయారీ యూనిట్లను కలిగి ఉంది. భారత్, రష్యా, పోలాండ్, నేపాల్, బంగ్లాదేశ్ వంటి ఐదు దేశాల్లో ఈ సంస్థ ఉనికిని కలిగి ఉంది. బర్గర్ పెయింట్స్ లో 3931 మందికి పైగా ఉద్యోగులతో, భారతదేశం అంతటా 50000 పైగా పంపిణీ దారులతో, 180 గోదాములతో భారతదేశంలో రెండవ అతి పెద్ద పెయింటింగ్ పరిశ్రమ గా ఉన్నది. యూ కె పెయింట్స్ ఇండియా లిమిటెడ్ ఈ కంపెనీలో 50.09 %వాటాను కలిగి ఉన్నది[11].

యూరోపియన్

బెర్జర్ పెయింట్స్ స్థాపకుడు లూయిస్ బర్గర్. అతడు 1760 సంవత్సరంలో బ్రిటన్ లో పునాదులను వేశాడు.1923 సంవత్సరంలో భారతదేశంలో ప్రారంభించి, ప్రస్తుతం బర్గర్ పెయింట్స్ ఇండియా లిమిటెడ్ 16 ప్లాంట్ల తయారీ యూనిట్లతో, గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెయింట్ కంపెనీల్లో ఒకటిగా, త్రైమాసికంలో, స్థిరమైన మార్కెట్ ట్రాక్ రికార్డ్ తో దేశంలో రెండవ అతిపెద్ద పెయింట్ కంపెనీగా ఉంది[12].

భారతదేశంలో

ఈ సంస్థ 17 డిసెంబరు 1923 రోజు కోల్ కతాలో హాడ్ ఫీల్డ్స్ (ఇండియా) లిమిటెడ్ గా స్థాపించబడింది. 12 డిసెంబర్, 1947లో బ్రిటిష్ పెయింట్స్ హోల్డింగ్స్ ఈ సంస్థను స్వాధీనం చేసుకొని, బ్రిటిష్ పెయింట్స్ ఇండియా లిమిటెడ్ గా మార్చారు.1965 సంవత్సరంలో బ్రిటిష్ పెయింట్స్ (హోల్డింగ్స్) లిమిటెడ్ బ్రిటన్ సెలనీస్ కార్పొరేషన్ అమెరికా స్వాధీనం చేసుకుంది, దీనితో కంపెనీ నియంత్రణ CELEURO NV హాలండ్ కు బదిలీ చేయబడింది. 1969 సంవత్సరంలో సెలనీస్ కార్పొరేషన్ భారతీయ కంపెనీపై తమకున్న ఆసక్తిని బెర్గర్ జెన్సన్ నికల్సన్ లిమిటెడ్ , బ్రిటన్ కు విక్రయించింది.1983 సంవత్సరం డిసెంబర్) లో కంపెనీ పేరు బర్గర్ పెయింట్స్ ఇండియా లిమిటెడ్ గా మార్చబడింది. 983 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కంపెనీ భారతదేశంలో బర్గర్ పేరు సంస్థ ట్రేడ్ మార్క్ గా, ఇతర వేరియెంట్ లను మాత్రమే ఉపయోగించి, అభివృద్ధి చేసింది. కంపెనీ కలర్ బ్యాంక్ టింటింగ్ సిస్టమ్ ను ప్రారంభించింది, దీని ద్వారా వినియోగదారుడు 5000 కంటే ఎక్కువ రంగుల శ్రేణిని ఎంచుకోవచ్చు, తరువాత వాటిని తొందరగా అందుబాటులో ఉంచవచ్చు[6].

అభివృద్ధి

1997 సంవత్సరంలో పాండిచ్చేరిలో ఒక కొత్త పెయింట్ తయారీ యూనిట్ ప్రారంభించబడింది. 1999 సంవత్సరంలో రాజ్ దూత్ పెయింట్స్ లిమిటెడ్ ఈ సంస్థలో విలీనం చేయబడింది. 2000 సంవత్సరంలో జెన్సన్ & నికోలోసన్ నేపాల్ ప్రయివేట్ లిమిటెడ్ లో 100% వాటాను కంపెనీ కొనుగోలు చేసింది, ఇది జెన్సన్ & నికల్సన్ ఇండియా లిమిటెడ్ పూర్తిగా స్వంత సబ్సిడరీగా ఉంది, బెర్జర్ జెన్సన్ & నికల్సన్ నేపాల్ గా పేరు మార్చబడింది. 2001-02 సంవత్సరంలో ఐసిఐ ఇండియా మోటార్స్ & ఇండస్ట్రియల్ పెయింట్స్ వ్యాపారాన్ని వారి అనుబంధ సంస్థ బెర్జర్ ఆటో & ఇండస్ట్రియల్ కోటింగ్స్ లిమిటెడ్ ద్వారా కొనుగోలు చేశారు. 2003-04 సంవత్సరంలో జమ్మూలో ఒక కొత్త యూనిట్ వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించింది. ప్రిన్సిపల్ ఫైనాన్షియల్ గ్రూప్ USA పంజాబ్ నేషనల్ బ్యాంక్, విజయా బ్యాంక్ ఫర్ పెన్షన్ ఫండ్, ఇన్స్యూరెన్స్ బిజినెస్ లతో కంపెనీ జాయింట్ వెంచర్ కుదుర్చుకుంది. బెర్గర్ ఆటో & ఇండస్ట్రియల్ కోటింగ్స్ లిమిటెడ్ అనేది పూర్తిగా స్వంతమైన అనుబంధ సంస్థ, ఏప్రిల్ 1, 2004 నుంచి కంపెనీతో విలీనం చేయబడి, కంపెనీ BAICL డివిజన్ గా పనిచేస్తుంది. రష్యాలో పెయింట్ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేసే ఉద్దేశ్యం కోసం 2005 ఫిబ్రవరి 3 న సైప్రస్ లో స్థాపించబడిన బెర్గర్ సైప్రస్ అనే సంస్థలో ఈ సంస్థ పెట్టుబడి పెట్టింది. 2005-06 సంవత్సరంలో కంపెనీ జమ్మూలోని తమ కొత్త 2400 MTPA పౌడర్ కోటింగ్ ప్లాంట్ లో వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించింది. 2007 సంవత్సరం(ఏప్రిల్)లో 9000 MTPA సామర్ధ్యం కలిగిన కంపెనీకి చెందిన జమ్మూ రెసిన్ ప్లాంట్ ఉత్పత్తిని ప్రారంభించింది. భారతదేశంలో ఆటోమొబైల్స్, విడిభాగాల్లో ఉపయోగించే ప్లాస్టిక్ సబ్ స్ట్రేట్ ల కొరకు కోటింగ్ ల తయారీ, అమ్మకం కొరకు ఒక కంపెనీని ఏర్పాటు చేయడం, నిప్పాన్ బీ కెమికల్ కంపెనీ లిమిటెడ్ జపాన్ తో కంపెనీ జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది[11].

అవార్డులు

ఈ సంస్థ అభివృద్ధి తో పాటు దేశంలో ఉన్న ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల నుంచి అవార్డులను పొందింది[6].

  • ముంబైలో ప్రతిష్టాత్మక మాన్యుఫ్యాక్చరింగ్ సప్లై చైన్ ఎక్సలెన్స్ అవార్డు 2020.
  • బర్గర్ వీవీఎన్ ప్లాంట్ కు సీఐఐ ఎన్విరాన్మెంటల్ బెస్ట్ ప్రాక్టీసెస్ అవార్డు 2020 లభించింది.
  • ముంబైలో ప్రతిష్టాత్మక మాన్యుఫ్యాక్చరింగ్ సప్లై చైన్ ఎక్సలెన్స్ అవార్డు 2020 గ్రహీత.
  • బర్గర్ సంస్థకు చెందిన వీవీఎన్ ప్లాంట్ 7వ ఓవర్ ఎన్విరాన్మెంట్ గోల్డ్ అవార్డు 2020ని పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ (ఎంఓఈఎఫ్) నుంచి గెలుచుకుంది.

మూలాలు

  1. "Berger Paints India Balance Sheet, Berger Paints India Financial Statement & Accounts". moneycontrol.com.
  2. "BSE Ltd. (Bombay Stock Exchange) | Live Stock Market updates for S&P BSE SENSEX, Stock Price, Company News & Results". www.bseindia.com.
  3. "Berger Paints India Consolidated Profit & Loss account, Berger Paints India Financial Statement & Accounts". www.moneycontrol.com.
  4. "Berger Paints India Balance Sheet, Berger Paints India Financial Statement & Accounts". moneycontrol.com.
  5. "Berger Paints India Balance Sheet, Berger Paints India Financial Statement & Accounts". moneycontrol.com.
  6. 6.0 6.1 6.2 "Berger Paints India Ltd". Business Standard India. Retrieved 2022-08-24.
  7. "Berger Paints plans ₹60 cr. for Howrah, Rishra units". The Hindu (in Indian English). Special Correspondent. 2017-08-04. ISSN 0971-751X. Retrieved 2022-08-24.{cite news}: CS1 maint: others (link)
  8. "Berger Paints opens Hindupur plant in Andhra Pradesh". The Economic Times. Retrieved 2022-08-24.
  9. "Berger Paints commences commercial production at Jejuri plant - Berger Paints India Ltd. Latest News". www.moneyworks4me.com. Retrieved 2022-08-24.
  10. "Berger Paints India Ltd. in Samba, Jammu and Kashmir, India - Company Profile". www.tradeindia.com. Retrieved 2022-08-24.
  11. 11.0 11.1 "About | Company information | capitalmarket". www.capitalmarket.com. Retrieved 2022-08-24.
  12. "Berger Paints India Limited - Manufacturer from Park Street, Kolkata, India | About Us". www.indiamart.com. Retrieved 2022-08-24.