బీదర్ జిల్లా
Bidhar
బీదర్ జిల్లా | |
---|---|
జిల్లా | |
దేశం | India |
రాష్ట్రం | కర్ణాటక |
జిల్లా కేంద్రం | బీదర్ |
తాలుకాలు | బీదర్, బాల్కీ, ఔరద్, బసవకళ్యాణ్, హుమ్నాబాద్చిట్గుప్ప |
విస్తీర్ణం | |
• Total | 5,448 కి.మీ2 (2,103 చ. మై) |
Elevation | 615 మీ (2,018 అ.) |
జనాభా (2001) | |
• Total | 15,02,373 |
• జనసాంద్రత | 276/కి.మీ2 (710/చ. మై.) |
భాషలు | |
• అధికారిక భాష | కన్నడ |
Time zone | UTC+5:30 (IST) |
Vehicle registration | KA-38,KA-39,KA-56 |
హైదరాబాద్ నుండి దూరం | 120 కిలోమీటర్లు (75 మై.) |
బెంగుళూర్ నుండి దూరం | 700 కిలోమీటర్లు (430 మై.) |
బీదర్ (Kannada: ಬೀದರ, Telugu: బీదరు) (ఈశాన్య) కర్నాటకలోని ఒక జిల్లా కేంద్రం. ఇది పూర్వపు హైదరాబాదు రాష్ట్రములో ఉండి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు సమయములో మైసూరు రాష్ట్రము (ఇప్పటికర్నాటక) లో విలీనము చేయబడింది. ఇక్కడ ప్రధాన భాష కన్నడము. అలాగే తెలుగు, మరాఠి ప్రభావము కూడా అధికముగానే ఉంటుంది. ప్రస్తుతం, ఇది కర్నాటకలో ముస్లిం ప్రాబల్యముగల జిల్లా.
పూర్వచరిత్ర
హైదరాబాదుకు దగ్గరలో వున్న చారిత్రక ప్రదేశము " బీదర్ " . హైదరాబాద్ నుండి సుమారు 140 కిలోమీటర్ల దూరంలో ఉంది బీదర్. 9వ జాతీయ రహదారి మీద ఓ మూడు గంటల ప్రయాణం.ఇక్కడి వాతావరణము, ప్రకృతి అందాలకు ముచ్చట పడ్డ బహ్మనీ సుల్తాన్ 1429 లో బీదర్ నిర్మాణానికి పూనుకున్నాడని చారిత్రిక ఆధారాలు తెలుపుతున్నాయి . 1724 నుంచి 1948 వరకూ నిజాం నవాబుల ఏలుబడిలో వుంది . హైదరబాద్ ప్రాంతములో భాగముగా వున్న బీదర్ ఆ తరువాత కర్ణాటకలో భాగమైపోయింది. పూర్వం దీని నుంచి వచ్చే దండయాత్రలను ఇబ్బందిగా భావించిన నేపథ్యంలో ‘బెడదకోట’గా పిలిచే వారు. బీదర్ పట్టణానికి మరో పేరుగా ఒకప్పుడు విదురా నగరం పేరుతో ఉండేదట. మహాభారతంలోని విదురుడు ఇక్కడే ఉండేవాడట.
1429లో బహమనీ రాజు ఒకటవ అహ్మద్ షా దీన్ని రాజధానిగా చేసుకున్నాడు. 'అహ్మదాబాద్ బీదర్' అని పేరు మార్చాడు. దాదాపు ఒక శతాబ్దం పాటు బహమనీ రాజుల పాలనలో ఉన్న బీదర్, 1527లో దక్కను పాలకులైన బరీద్ షాహీల చేతుల్లోకి వెళ్లింది. మరో రెండు వందల సంవత్సరాల తర్వాత ఔరంగజేబు బీదర్‌ని ఆక్రమించాడు. అతను 1713లో ఆసఫ్ జాహీని దక్కను ప్రాంత సుబేదారుగా నియమించాడు. ఆసఫ్ జాహీ 1724లో నైజాం ప్రభుత్వాన్ని నెలకొల్పాడు. ఇంతమంది చేతులు మారినా, బీదర్‌లో మనకు కనిపించే శిథిల కట్టడాల్లో చాలా వరకు బహమనీ రాజులవే కావడం విశేషం. ఈ పట్టణానికి అయిదు ద్వారాలున్నాయి.
భౌగోళికం
జిల్లా మొత్తం దక్కన్ పీఠభూమిలో భాగంగా ఉంది. ఇది చాలావరకు ఘనీభవించిన లావా ఆక్రమిత ప్రాంతంగా ఉంది. జిల్లా ఉత్తరభాగంలో వృక్షరహితమైన చదునైన భూమి ఉంది. భూభాగంలో అక్కడక్కడా కొండలువిస్తరించి ఉన్నాయి. జిల్లాభూభాగం సముద్రమట్టానికి 715 మీ. ఎత్తులో ఉంది. సరాసరి ఎత్తు సముద్రమట్టానికి 580-610 మీ ఉంటుంది. మంజీరా నది దాని ఉపనదీ తీరంలో సారవంతమైన భూమి ఉంది.
జిల్లా పూర్తిగా తృతీయ కాలం డెక్కన్ లావా ప్రవాహాలతో కప్పబడి ఉంటుంది. డెక్కన్ బసాల్ట్ లావా సమాంతర సరఫరాల వర్గీకరించారు. ఇవి సాధారణంగా చదునైన ఉపరితలాలు గుట్టలు , చప్పరము వంటి లక్షణాలతో ఉంటుంది. భౌతిక లక్షణాలు గణనీయమైన వ్యత్యాసాలతో కూడుకొని ఉన్నాయి.భూభాగం సాధారణంగా సముద్ర మట్టానికి 618 మీ ఉంటుంది.
జిల్లాలో బాక్సైట్, కయోలిన్ , రెడ్ అక్రె మొదలైన ఖనిజాలు ఉన్నాయి. బసవకల్యాణ్‌కు దక్షిణంగా 3 కి.మీ దూరంలో సిలిసియస్ బాక్సైట్ క్లే అధికంగా కనిపిస్తుంటుంది. అలాంటి ఖనిజం బీసర్ తాలూకాలోని అల్వల్ , కాంథానా గ్రామంలో కూడా ఉన్నాయి. కాంథానా గ్రామంలో అధికంగా కయోలిన్ నిలువలు ఉన్నాయి. సిరిసి , ఔరద్ గ్రామాలలో రెడ్ ఆక్రె నిలువలు ఉన్నాయి.
వాతావరణం
విషయ వివరణ | వాతావరణ వివరణ |
---|---|
వేసవి కాలం | ఫిబ్రవరి మధ్య - జూన్ వరకు |
వర్షాకాలం | జూలై- సెప్టెంబరు |
పోస్ట్ మాంసూన్ | అక్టోబరు - నవంబరు |
శీతాకాలం | డిసెంబరు - ఫిబ్రవరి మధ్య వరకు |
శీతాకాలం గరిష్ఠ ఉష్ణోగ్రత | ° సెల్షియస్ |
శీతాకాలం కనిష్ఠ ఉష్ణోగ్రత | 16.4 నుండి 23.7 ° సెల్షియస్ |
అత్యంత శీతల మాసం | డిసెంబరు |
వాతావరణ విధానం | పొడి వాతావరణం (గాలిలో తేమ 30% - 40%) |
వేసవి కాలం గరిష్ఠ ఉష్ణోగ్రత | 38.8 ° సెల్షియస్ |
వేసవి కాలం కనిష్ఠ ఉష్ణోగ్రత | 25.9° సెల్షియస్ |
అత్యంత ఉష్ణ మాసం | మే |
వర్షపాతం | 847 మి.మీ (జూన్- సెప్టెంబరు 81%) [1] (సరాసరి వర్షదినాలు 52 రోజులు) |
అత్యధిక వర్షపాతం | |
అక్షాంశం | ఉత్తరం |
రేఖాంశం | తూర్పు |
బీదర్ అడవులు
బీదర్ అరణ్యాలు విభాగంకర్నాటకలోని ఉత్తరభుభాగంలో ఉన్నాయి. అరణ్యాలు బీదర్ జిల్లాను చుట్టి పొరుగున ఉన్న గుల్బర్గా జిల్లాలోని 31 గ్రామాలలో విస్తరించి ఉంది. బీదర్ అరణ్యప్రాంతం రిజర్వ్ ఫారెస్ట్, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ , వర్గీకరించని అరణ్యాలుగా విభజించబడ్డాయి.బీదర్ అరణ్య వైశాల్యం 43,592 చ.కి.మీ. జిల్లా భూభాగంలో అరణ్యాలు 8.5% ఆక్రమించి ఉన్నాయి.
నదులు విస్తీర్ణం .
జిల్లా రెండు నదీమైదానాల మధ్య (గోదావరి మైదానం , కృష్ణా మైదానం) ఉంది. గోదావరి మైదానం వైశాల్యం 4,411 చ.కి.మీ. మంజీర నదీమైదానం వైశాల్యం 1989 చ.కి.మీ. కరంజ నదీమైదానం వైశాల్యం 2422 చ.కి.మీ. కృష్ణ నదీమైదానం వైశాల్యం 336 చ.కి.మీ, ముల్లమారి నదీమైదానం వైశాల్యం 249 చ.కి.మీ , గండరీనదీ మైదానం వైశాల్యం 336 చ.కి.మీ ఉంటుంది. జిల్లాలో ప్రవహిస్తున్న ప్రధాననది మంజీర గోదావరి ఉపనది. కరంజానది మంజీరానదికి ఉపనది. జిల్లాలోని నదులు ఉపనదులు ప్రయాణయోగ్యమైనవి కాదు.
జిల్లాలో ప్రవహిస్తున్న నదులు
- మంజీరా నది.
- కరంజ నది.
- చుల్కినల.
- ముల్లమారి.
- గంద్రినల.
జిల్లాలో గోదావరి, కృష్ణ నదీ మైదానాలు ఉన్నాయి.
చౌబారా
బీదరు కోటకు చేరే ముందు ఎనభై అడుగుల ఎత్తున్న పహారా గోపురం వుంటుంది. దానిని చౌబారా అంటారు. అయిదు శతాబ్దాల క్రితం దాని పైన సైనికులు పహారా కాస్తూ పట్టణానికి రక్షణగా ఉండేవారట.
సోలా కంభ్ మసీదు
దీన్ని 1423లో నిర్మించారట. దీని మధ్య భాగంలో 16 స్తంభాలున్నాయి. అందువలనే ఆ పేరు. మసీదు చుట్టూ అందమైన తోట కూడా ఉంది
గగన్ మహల్
అప్పటి రాణీవాసం పేరు గగన్ మహల్. చౌబారా గోపురానికి సమీపంలోనే మహమూద్ గవన్ మదరసా ఉంది. ఇది దాదాపుగా శిథిలమైపోయినట్లే. అప్పట్లో ఇది మూడంతస్థుల భవనమట. దీనికి నాలుగు ఎత్తైన మినార్లూ ఉంటేవట. ఇప్పుడొక్కటే మిగిలింది. దానిపై తాపడం చేసిన నీలం, తెలుపు, పసుపు రాళ్లు ఇరాన్ నుండి తెప్పించారట.
గురుద్వారా,అమృత కుండ్
ఇక్కడ కొన్నాళ్ళు గురునానక్ వున్నారట అక్కడ ఒక్క సన్నని నీటిధార వస్తూ వుంటుంది దానిని గురునానక్ వేసిన మొదటి అడుగు ప్రాంతం అంటారు. అది ప్రవహించి ఒక చిన్న కుండీ వంటి నిర్మాణంలోకి వస్తుంది. దానిని అమృత కుండ్ అంటారు.
పాపనాశం శివాలయం
శివభక్తుడైన రావణుని సంహారం తర్వాత తిరిగొస్తున్న రాముడు, శివభక్తుని సంహార దోషం తొలించుకునేందుకు స్వయంగా ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని చెపుతారు.
బసవ గిరి
వీరశైవము క్లిష్ట పరిస్థితులలో వున్నప్పుడు శివుని వాహనమైన నందీశ్వరుడు భూలోకములో ' బసవేశ్వరు ' నిగా అవతరించి వీర శైవ ధర్మమును ప్రబోధించాడట. ఆ బసవన్న ప్రార్థనామందిరమే ఈ బసవగిరి.
జాలా నరసింహ దేవాలయం
ఈ గుహలో శివుడు తపస్సు చేసుకుంటూ వుండగా ' జలాసురుడు ' అనే రాక్షసుడు ఆయనను చాలా విసిగిస్తూ వున్నాడట . అప్పుడు లక్ష్మీనరసింహ స్వామి వచ్చి జలాసురుడిని సంహరించాడట . జలాసురుడి కొద్దిగా పుణ్యము చేసుకొని వుండటము వల్ల, ఏదైనా మంచి కోరిక కోరుకో తీరుస్తాను అన్నాడట నరసింహ స్వామి . ఐతే నువ్విక్కడే వెలవాలి, నిన్ను నా పేరుతో కలిపి పిలువాలి అని కోరాడట జలాసురుడు . అప్పుడు నరసిమ్హస్వామి అక్కడ వెలిశి ' జలానరసిమ్హుడు ' గా కొలవబడుతున్నాడు .' జలా అంటే నీరు కాబట్టి, నరసిమ్హస్వామి పాదాల వద్ద నుంచి నీరు ఆ గుహలో ప్రవహిస్తోందిట. ఇలా 600 మీటర్ల లోపలికి నీటిగుండా ప్రయాణం చేస్తే కానీ జాలా నరసింహుని సందర్శన సాధ్యం కాదు.
మూలాలు
- ↑ "Bidar district official website". Archived from the original on 2007-09-29. Retrieved 2015-02-04.