బృందావనం (2010 సినిమా)
బృందావనం (2010 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వంశీ పైడిపల్లి |
---|---|
నిర్మాణం | దిల్ రాజు |
కథ | వంశీ పైడిపల్లి |
చిత్రానువాదం | వంశీ పైడిపల్లి |
తారాగణం | జూనియర్ ఎన్.టి.ఆర్. కాజల్ అగర్వాల్ సమంత ప్రకాష్ రాజ్ శ్రీహరి |
సంగీతం | ఎస్.ఎస్. తమన్ |
సంభాషణలు | కొరటాల శివ |
ఛాయాగ్రహణం | ఛోటా కె. నాయుడు |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
నిర్మాణ సంస్థ | శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ |
భాష | తెలుగు |
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించిన చిత్రం బృందావనం. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జూనియర్ ఎన్.టి.ఆర్., కాజల్ అగర్వాల్, సమంత ముఖ్యపాత్రలు పొషించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అక్టోబరు 14, 2010 న విడుదలై ఘనవిజయాన్ని సాధించింది.
కథ
కృష్ణ అలియాస్ క్రిష్ (జూనియర్ ఎన్.టి.ఆర్.) సిటీలోని పెద్ద కోటీశ్వరుడు (ముఖేష్ ఋషి) కొడుకు. ఖాలీగా ఉన్నప్పుడు ప్రెండ్స్ కి ప్రేమ పెళ్ళిళ్లు గట్రా చేస్తూ హ్యాపీగా బ్రతికేస్తున్న అతనికో గర్ల్ ప్రెండ్ ఇందు (సమంత). ఇక ఇందు కో క్లోజ్ ప్రెండ్ భూమి (కాజల్ అగర్వాల్). భూమికో సమస్య వస్తుంది. చదువుకుంటున్న ఆమెకు బావ (అజయ్) తో తండ్రి భానుప్రసాద్ (ప్రకాష్ రాజ్) ఇష్టంలేని పెళ్ళిని ఫిక్స్ చేస్తాడు. తండ్రికి ఎదురు చెప్పలేని ఆమె ఆ పెళ్ళిని తప్పించుకోవటానికి తన తాత దుర్గా ప్రసాద్ (కోట శ్రీనివాసరావు) సలహాతో తనకో బోయ్ ప్రెండ్ ఉన్నాడని అబద్దమాడుతుంది. దాంతో ఆమె తండ్రి ఆ బోయ్ ప్రెండ్ ని ఇంటికి రప్పించు అంటాడు. దాంతో ఆమె తన స్నేహితురాలు ఇందుని సంప్రదిస్తే..ఆమె తన బోయ్ ప్రెండ్ కృష్ణని ..భూమికి బోయ్ ప్రెండ్ గా వెళ్ళమని పురమాయిస్తుంది.
తన ప్రియురాలు మాట జవదాటలేని కృష్ణ ..భూమి ఉన్న పల్లెకు భయిలు దేరి వెళతాడు. అక్కడ భూమిదో పెద్ద కుటుంబం. అందుకు తగ్గట్లే కుటుంబ తగాదాలు. అక్కడికి వెళ్లిన క్రిష్...తన తెలివితో ఆమె తండ్రికీ, బాబాయ్ శివప్రసాద్ (శ్రీహరి) కీ ఉన్న తగువుని పరిష్కరించి, కలుపుతాడు. దాంతో ఇంప్రెస్ అయిన భూమి తండ్రి ...నా అల్లుడు నువ్వే అని క్రిష్ ని ప్రకటిస్తాడు. మరో ప్రక్క భూమి కూడా క్రిష్ తో ప్రేమలో పడిపోతుంది. ఈ లోగా ఇందు రంగంలోకి దిగుతుంది. ఇంతకీ ఆమె ఎవరు...ఆమెకూ ఆ ఇంటికీ ఉన్న సంబంధం ఏమిటీ... వీళ్ళద్దరి మధ్య ఇరుక్కుపోయిన క్రిష్ ఎలా భయిటపడ్డాడనేది తెరపై చూడాల్సిందే.
తారాగణం
- జూనియర్ ఎన్.టి.ఆర్. - కృష్ణ / క్రిష్
- కాజల్ అగర్వాల్ - భూమి
- సమంత - ఇందు
- శ్రీహరి - శివప్రసాద్
- ప్రకాష్ రాజ్ - భానుప్రసాద్
- కోట శ్రీనివాసరావు - దుర్గా ప్రసాద్
- తనికెళ్ల భరణి - భానుప్రసాద్ బావమరిది
- అజయ్ - భూమికి బావ
- బ్రహ్మానందం - "బొమ్మరిల్లు" తండ్రి
- వేణుమాధవ్ - చిట్టి
- ముకేష్ రిషి - సురేంద్ర (క్రిష్ తండ్రి)
పురస్కారాలు
- నంది పురస్కారాలు
- నంది ఉత్తమ ఆడియోగ్రాఫర్స్: రాధాకృష్ణ ఎస్కల