బ్రదర్ అఫ్ బొమ్మలి(సినిమా)

బ్రదర్ అఫ్ బొమ్మాళి
పొస్టరు
దర్శకత్వంబి. చిన్నికృష్ణ
నిర్మాతకనుమిల్లి అమ్మిరాజు
తారాగణంఅల్లరి నరేష్
కార్తిక
మొనాల్ గజ్జర్
ఛాయాగ్రహణంవిజయ్ కుమార్
కూర్పుగౌతం రాజు
సంగీతంశేఖర్ చంద్ర
నిర్మాణ
సంస్థ
సిరి సినిమా
విడుదల తేదీ
7 నవంబరు 2014 (2014-11-07)
సినిమా నిడివి
143 నిముషాలు
దేశంభారత దేశం
భాషతెలుగు

బ్రదర్ అఫ్ బొమ్మాళి 2014లో విదుదలైన తెలుగు హాస్యకథా చిత్రం. బి.చిన్నికృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. కనుమిల్లి అమ్మిరాజు ఈ చిత్రనిర్మాత. అల్లరి నరేష్, కార్తీక, మొనాల్ గజ్జర్ ముఖ్యపాత్రలు పొషించారు. శేఖర్ చంద్ర ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఈ చిత్రం 7 నవంబరు 2014లో విదుదలై మంచి విజయాన్ని సాదించింది.

కథాశం

రామకృష్ణ (నరేశ్), మహాలక్ష్మీ (కార్తీక) కవ లలు! అతని ముద్దుపేరు రాంకీ, ఆమె ముద్దు పేరు లక్కీ. అయితే అన్న రాంకీకి... చెల్లెలు ఎప్పుడూ అన్ లక్కీనే! తల్లి గర్భంలో ఉండగానే దూకుడు ప్రదర్శించిన లక్కీ భూమిమీద పడ్డాక కూడా దానిని కొనసాగించింది. ఆ రకంగా ఆమె అతని పాలిటి ఓ బొమ్మాళి. చెల్లెలి కారణంగా ఎప్పుడు ఏ సమస్య ఎదుర్కోవలసి వస్తుందనో అని భయపడుతూ ఉండే రాంకీ... శ్రుతి (మోనాల్ గజ్జర్) అనే అమ్మాయిని చూసి తొలి చూపు ప్రేమలో పడతాడు. అయితే చెల్లెలి పెళ్ళి కాకుండా నువ్వెలా పెళ్ళి చేసుకుంటావని తల్లిదండ్రులు అడ్డుపుల్ల వేస్తారు. అప్పటి వరకూ టామ్‌బాయ్‌గా ప్రవర్తించిన లక్కీ.. తానూ ప్రేమలో పడ్డానని, అయితే అది వన్ సైడ్ లవ్ అని రాంకీకి చెబుతుంది. అతని గురించి ఆరా తీసిన రాంకీకి అతనో రాయలసీమ ఫ్యాక్షన్ కుటుంబానికి చెందిన కుర్రాడని, మరో పదిహేను రోజుల్లో పెళ్ళి జరగబోతోందని తెలుస్తుంది. చెల్లెలి పెళ్ళి కోసం రాంకీ ఎలాంటి సాహసానికి పూనుకున్నాడు, ఈ వ్యవహారంలో ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాడు అన్నది మిగతా కథ![1]

తారగణం

పాటలు

హైదరాబాద్లో శ్రీయస్ మ్యూజిక్ ద్వారా 2014 అక్టోబర్ 4 న ఆడియో విడుదల జరిగింది.

Untitled
క్రమసంఖ్య పేరు నిడివి
1. "బూమ్ బూమ్"   3:30
2. "జీంస్ వెసుకున్న"   3:27
3. "ఐ లవ్ యు అంటే"   4:01
4. "పొనిటెయిల్ పొరి"   2:06
5. "తు హి మెరా"   3:49
16:53

మూలాలు

  1. చంద్రం (17 November 2014). "బ్రదర్ ఆఫ్ బొమ్మాళి కాదు కంగాలి". జాగృతి వారపత్రిక. Retrieved 19 February 2024.